Wednesday, 11 October 2023

 



మేషం

 12-10-2023

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు.  వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో  స్వల్ప వివాదాలు కలుగుతాయి.  ఉదర అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. 

---------------------------------------

వృషభం

 12-10-2023

చిన్ననాటి మిత్రుల నుండి  విలువైన సమాచారం అందుతుంది. స్ధిరాస్తి  వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.   ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

---------------------------------------

మిధునం

 12-10-2023

వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు.  కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా సన్నిహితుల  సహాయం అందుతుంది స్థిరస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

---------------------------------------

కర్కాటకం

 12-10-2023

వృత్తి వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ప్రయాణాలు  వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

సింహం

 12-10-2023

 బంధువులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో  అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోమున అదనపు  బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.

---------------------------------------

కన్య

 12-10-2023

సమాజంలో ప్రముఖులతో  పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ యత్నాలలో విజయం వరిస్తుంది. స్నేహితుల నుండి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

---------------------------------------

తుల

 12-10-2023

కుటుంబ పెద్దల  సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. వృత్తి  ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

---------------------------------------

వృశ్చికం

 12-10-2023

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో  లాభాలను పొందుతారు. ఇంటా బయటా పెద్దల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది.  నూతన వ్యాపారాలకు  పెట్టుబడులు అందుతాయి.  ఉద్యోగాలలో  పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

ధనస్సు

 12-10-2023

ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు పెరుగుతాయి. వ్యాపారంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

మకరం

 12-10-2023

ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నములలో ఆటంకలు తోలుగుతాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.

---------------------------------------

కుంభం

 12-10-2023

ఆప్తుల నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి.  భూ సంబంధిత వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. కీలక వ్యవహారాలలో మీ కలలు నిజమవుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

---------------------------------------

మీనం

 12-10-2023

 ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు తప్పవు.  కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని పనులలో  సన్నిహితుల నుండి నిందలు  పడవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన చికాకు కలిస్తుంది.

---------------------------------------


సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe
Whatssapp Community
facebook page
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment