🙏'గురువిందగింజ ఎత్తు బంగారం' అంటూ దానిని కొలమానంగా చెప్పడం వింటూ ఉంటాం. గురువిందగింజపై సామెత ఉందంటే, అవి ఎంతగా జన బాహుళ్యంలోకి వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. గురువిందగింజలు లో ఎక్కువభాగం ఎరుపు రంగులో ఉండి, తక్కువ భాగం నలుపు రంగు ఉంటుంది.
🙏రంగుల కలయిక కారణంగా చూడటానికి ఇవి ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తూ ఉంటాయి.
అయితే అందంగా కనిపించడం ఒక్కటే కాదు, వీటివలన అనేక ప్రయోజనాలు ఉన్నట్టుగా చెబుతారు.
🙏గురువింద గింజలు లక్ష్మీ కారకాలు ... వీటిని భద్రపరచిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉండవు.
🙏ఈ కారణంగానే పూర్వం గురువిందగింజలను తమ ఇంట్లో ఉండేలా చూసుకునేవారు.
ఇంట్లో ధనాన్ని ఉంచే చోట గురివిందగింజలు ఉంచడం వలన సంపదలు రెట్టింపు అవుతాయనే విశ్వాసం కూడా ప్రాచీన కాలం నుంచి ఉంది.
సంపదలు పెరగడానికి ఉపయోగపడటమే కాకుండా, ఆ సంపదలకు దిష్టి తగలకుండా చేసే శక్తి కూడా గురువిందగింజలకు ఉంది.
🙏ఈ కారణంగానే నేడు అరుదుగా లభిస్తోన్న గురువింద
గింజలను మరింత అపురూపంగా భద్రపరుస్తున్నారు ... లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతున్నారు.
గురివిందగింజలు ఒక్కొక రంగు గురివిందగింజ ఒక్కో రకంగా ఉపయోగపడుతుంది,
🙏నల్లగురివిందగింజ.🙏
ఇది దృష్ట శక్తులు ఇంటిలోకి రాకుండా అడ్డుకొంటుంది , నరదృష్టి, కన్నుదృష్టి కి ఇది బాగ ఉపయోగపడుతుంది.
🙏తెల్లగురివిందగింజ.🙏
🙏ఇది శత్రువశం , సభావశం , రాజ్యవశం , స్త్రీ పురుష వశికరణ కి ఉపయోగపడుతుంది.
🙏ఆకుపచ్చ గురివిందగింజ.
🙏ఇది ధనాభివృద్ది కి లక్ష్మీ కటాక్షమునకు ఉపయోగపడుతుంది. ధనాభివృద్ది అవుతుంది ,ఆకస్మికంగా ధనం కలుగుతుంది.
🙏పసుపుగురివిందగింజ🙏
🙏ఇది ప్రమాదాల నుండి కాపాడుతుంది, వాహన ప్రమాదముల నుండి కాపాడును, మానసిక ధైర్యం ,అనుకున్న పనులు ఆటంకం లేకుండా జరుగును...
🙏ఇంకా కొన్ని గురివింద గింజలు వాటి శక్తి కొద్దీ ప్రభావం చూపి మానవ జీవిత సరళికి ఏ ఆటంకం లేకుండా పని చేయును.
No comments:
Post a Comment