👉 పడక గది లో ( బెడ్ రూమ్ ) పడుకోవడానికి ఉపయోగించే మంచం తల భాగం దక్షిణ లేదా తూర్పు దిక్కుకి ఉండాలి . తూర్పు వైపు తల పెట్టి నిద్రపోవాలి . ఇంటికి లేదా అపార్టుమెంట్ లో ఆగ్నేయ దిశలో ఉన్న పడక గదులలో నిద్రించే వారికీ నిద్రలేమి , అకారణ ఆందోళన , నిరాశ నిస్పృహలు ఉంటాయి .
👉 ఏ గృహంలో అయిన , అపార్టుమెంట్ లో అయిన ఈశాన్యంలో వంట గది ఉంటే ఆ ఇంటిలో ఉండే వారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి . వాయుమండలం నుండి నివాసంలోకి ప్రవేశించే సహజ శక్తీ ఈశాన్య మూల నుండి వస్తుంది , అందువలన ఈశాన్య దిశను శుభ్రంగాను చల్లగా ఉంచాలి . అప్పుడేఆ గృహంలో సహజ ప్రాణశక్తి నిరాటంకంగా ప్రవేశిస్తుంది .
👉 నివాస ప్రదేశంలోని మధ్యభాగాన్ని ( హాల్ ) సాధ్యమైనంత ఖాళీగా ఉంచాలి . ఎందుకంటె వాస్తులో గృహ మధ్య భాగం "బ్రహ్మస్థానం "గృహంలోకి ప్రవేశించే పాజిటివ్ ఎనర్జీ బ్రహ్మస్థానానికి చేరుతుంది .
👉 ఎట్టి పరిస్థితుల్లో వంట గది మరియు లావెట్రీ కలిపి నిర్మించరాదు వంట గదికి లావెట్రీకి మధ్య సాధ్యమైనంత దూరం ఉండేటట్లు చూసుకోవాలి .
👉 పడక గదిలో ఉన్న మంచానికి ఎదురుగా గోడపైన అద్దాన్ని ఉంచకూడదు . ఆలా ఉంచటం వల్ల ఆ బెడ్ పై నిద్రించే వారిలో అశాంతి , నిద్రలేమి ఏర్పడతాయి .
👉 ఇంటి మధ్య భాగం పై నుండి దూలాలు వెళ్ళటం వల్ల గృహంలో వాస్తు దోషం ఏర్పడుతుంది . ముఖ్యంగా , ఆ గృహంలో నివసించే వారికీ మానసిక అశాంతి ఏర్పడుతుంది . ఆ ఇంట్లో సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలలో కూడా తీవ్రమైన విబేధాలు వస్తాయి .
🕉శుభమస్తు 🔯
సర్వేజనా సుఖినోభవంతు🙏👍
No comments:
Post a Comment