గత జన్మ శాపాలు ఈ జన్మలో కూడా వెంటాడతాయి పితృ శాపం మాతృ శాపం స్త్రీ శాపం పుత్రిక శాపం సోదరీ శాపము దైవ శాపము అపరిచిత శాపము సంబంధిత శాపము ఇటువంటి శాపాలు ఒక వ్యక్తి జాతక చక్రం లో లగ్నం మరియు నవాంశ కుండలి ద్వారా తెలుసుకోవచ్చు గత జన్మ శాపాలు ప్రస్తుత జన్మ పై ఎంత మేరకు ప్రభావం చూపిస్తున్నాయి అనేది కూడా పరీక్షించుకోవచ్చు జాతక చక్రంలో ఆయా గ్రహాల స్థానాలను అనుసరించి ఫలితాలు నిర్ధారించవచ్చు. జాతక చక్రాన్ని లోతైన విశ్లేషణ ద్వారా ఈ ఫలితాలను రాబట్టవచ్చు. డబ్బుని అనారోగ్యం నిమిత్తం ఎక్కువగా ఖర్చు పెట్టడం విద్యకు ఆటంకా లు జరగడం.ముప్పై సంవత్సరాలు వయస్సు నిండినప్పటికీ వివాహం కాకుండా పోవుట.(ఈ విషయమై కొన్ని వందల జాతక చక్రాలను పరిశీలించడం జరిగింది ఈ పరిశోధనలో పూర్వజన్మ శాపము కారణంగా వివాహాలు ఆలస్యము కావడమో లేదా వివాహం అయిన తరువాత విడిపోవడం అనేది తొంభై అయిదు శాతం జాతక చక్రాలలో గమనించడం జరిగింది). భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు దంతక్షయానికి సంబంధించిన సమస్యలు సంభోగ శక్తి సన్నగిల్లడం జుట్టు త్వరగా రాలిపోవడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం మన ఇంటి పరిసరాలలో కుక్క పిల్లి లేదా పాడి పశువు చనిపోవడం లేదా దొంగతనం జరగడం జాతకుడు నిర్దోషి అయినప్పటికీ పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కడ౦ .శరీరంలో రక్త హీనత తీవ్రమైన కాళ్ల నొప్పులు తరచూ కోపంతో ఇతరులతో గొడవ పడడం ఇటువంటి లక్షణాల లో రెండు లేదా మూడు లక్షణాలు ఒక జాతకుడు పై ప్రభావం చూపిస్తుంటే ఆ వ్యక్తికి పూర్వజన్మ శాపం ఈ జన్మ పై ప్రభావం చూపిస్తున్నది అని తెలుసుకోవాలి. కేవలం ఇవి సమస్యకు లక్షణాలు మాత్రమే. వీటి వలన ఆర్థికంగా పతనం కావడం,అకాల మరణాలు, భార్యా వియోగం, జైలుకు వెళ్లడం, డబ్బు వారసులు ఉన్నప్పటికీ తన చివరి కాలంలో ఎవరి సహకారం లేకుండా ఒంటరిగా వెలి వేయబడడం. ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, వారసత్వ ఆస్తి ని పోగొట్టుకోవడం.ఆర్దిక సమస్యలు, కుటుంబ సమస్యలు,ఆలస్య వివాహం, అనారోగ్యం, విదేశీయానం లో ఆట౦కాలు ఇటువంటి దుష్ఫలితాలు మరెన్నో జాతకుడు ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. జ్యోతిష్యుడు ఈ సమస్యను గుర్తించినప్పుడు 2 లేదా 3 ప్రశ్నలను జాతకుడు ని ప్రశ్నించి దోష నిర్ధారణ చేయవచ్చు. చాలా చిన్న పరిహారాలు ద్వారా వీటి నుంచి బయటపడవచ్చు. కొంతమంది జాతకులు మేము గ్రహాలకు జపం క్షీర తర్పణం హోమాలు చేయించాము కానీ సరైన ఫలితం దక్కలేదు అంటూ ఉంటారు.వారు మొదట పూర్వజన్మ శాపం ఉన్నట్లు అయితే దానికి పరిహారం మొదట చేసుకోవాలి. మనకు మన మహర్షులు అందించిన గొప్ప వరంగా దీనిని భావించాలి. శ్రీనివాస సిద్ధాంతిగా నా అనుభవంలో ఎంతో మంది జాతకాలకు ఈ సమస్యను గుర్తించడం పరిహారాలు చెప్పడం వారు మంచి ఫలితాలను పొందడం జరిగినది. ఇటువంటి విద్య పుస్తకాలలో లభించదు గురు పరంపర గా మాత్రమే లభిస్తున్నది మా గురుదేవులు నాకు ప్రసాదించిన ఒక వరం గా దీనిని భావిస్తాను. జాతకులు సరియైన జ్యోతిష్యుని సంప్రదించి నప్పుడు జాతకుడు యొక్క భవిష్యత్తు సంతోషకరం గా ఉండడం లో అతిశయోక్తి లేదు.
No comments:
Post a Comment