శ్రీ అన్నపూర్ణా దేవి
నిత్యానందకరీ వరాభయకరీ - సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ - ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ|
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారములో దర్శనమిస్తారు.
శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు.శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అన్నము వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము! సర్వ పుణ్య ప్రదాయకము, లోకంలో జీవుల ఆకలిని తీర్చటంకన్నా మిన్న ఏది లేదు. ఈ నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో వున్న శ్రీ దుర్గమ్మని దర్శించి తరించడం వలన అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతారు.
No comments:
Post a Comment