🕉️🪷🕉️🪷🕉️🪷🕉️🪷🕉️🪷🕉️
పూజా విధానం ప్రారంభం
గణేశ ప్రార్ధన
శుక్లామ్బరధరమ్ విష్ణుమ్ శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయెత్ సర్వ విఘ్నోప శాంతాయే
దీప ప్రజ్వలన
దీపత్వమ్ బ్రహ్మ రూపేసి జ్యోతిషాం ప్రభురవనయహ్
సౌభాగ్యం దేహి పుత్రాన్స్‌చ సర్వాన్ కామాన్‌శ్చ దేహిమ్
దీపమును వెలిగించి దీపపు కున్దిని కుంకుమ అక్షంతాలతో అలంకరీంపవలెను
శ్లో : అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా , ఓం నారాయణాయ స్వాహా , ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
ఏ రోజు తిధి ఆ రోజు చెప్పుకొనవలెను.
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ / గంగా /గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే
(ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే
(ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే
శుభయోగే , శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం , శుభతిథౌ , శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య
(మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ , ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన , కనక , వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం , సర్వాపదా నివారణార్ధం , సకలకార్యవిఘ్ననివారణార్ధం, సత్సంతాన సిద్యర్ధం , పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం , ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం , సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
కలశారాధన
శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము , కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)
శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన , తమపైన జల్లుకొనవలెను.)
తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.
పసుపు వినాయకుని పూజ
మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి , ఆవాహయామి , నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు , గంధం పువ్వులు వేయవలెను.
ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాదిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయనమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః, మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
శ్రీ మహాగణాధిపతి బెల్లము లేదా పండ్లు గానీ ప్రసాదముగ నివేదించాలి. కర్పూర నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).
ప్రాణ ప్రతిష్ట చేయు విధానం
అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి , పళ్లు , ఫలాలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ప్రాణప్రతిష్ట చేసేందుకు పువ్వులు, అక్షింతలను పట్టుకుని అమ్మవారి పాదాలను పట్టుకుని కింది మంత్రములను పఠించాలి.
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణ మిహ నో ధేహి భోగమ్
జ్యోక్పశ్యేషు సూర్యముచ్చరంత మనుమతే మృడయా న స్స్వస్తి
అమృతంవై ప్రాణా అమృతమాపః
ప్రాణానేన యథాస్థాన ముపహ్వయతే
ఓం అం హ్రీం క్రీం హంస స్సోహం
స్వామిని శ్రీ జగన్నాథే యావత్పూజావసానకం
తాపత్వ్తం ప్రీతిభావేన యంత్రేస్మిన్ సన్నిధింకురు
రక్తాంభోదిస్థపోతోల్లస దరుణసరోజాధిరూఢా కరాభైః
పాశం కోదండ మిక్షూద్భవ మణిగుణ మప్యంకుశం పంచబాణాన్
భిభ్రామా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీనవక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః
సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శ్రీవహాకాళీ
శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ అవాహితాభవ
స్థాపితాభవ సుప్రసన్నాభవ వరదాభవ స్థరాసనం కురు ప్రసీద ప్రసీద
శ్రీ దుర్గా దేవి ఆవాహన పూజ
శ్రీ దుర్గా దేవియే నమః ధ్యాయామి , ఆవాహయామి , నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
శ్రీ దుర్గా దేవి యే నమః పాదయోః పాద్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి (గంధం చల్లవలెను)
శ్రీ దుర్గా దేవియే నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)
ధ్యానం
లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం
విద్యాప్రదాన సమయే శరదిందుశుభ్రాం
విద్వేషి వర్గవిజయేతు తమాలనీలాం
దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే
ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుశుండిం శిరః
శంఖం సందధతీంకరైః త్రిణయనాం సర్వాంగభూషాభృతాం
యాదేవీ మధుకైటభ ప్రశమనీ యామాహిషోన్మూలినీ
యాధూమ్రేక్షణ చండముండ దమనీ యారక్తబీజాశినీ
యాశుంభాది నిశుంభ దైత్యశమనీ యా సిద్ధలక్ష్మీఃవరా
తాంత్వాం చంద్ర కళావతంస మకుటాం చారుస్మితాం భావయే
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః
అధాంగ పూజ
ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి
శ్రీ దుర్గాష్టోత్తర శతనామ పూజ
అక్షతలు , పుష్పములు పూజ చెయ్యండి
దుర్గా అష్టోత్తర శత నామావళి
ఓం దుర్గాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం చండికాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వాలోకేశాయై నమః
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
ఓం సర్వతీర్ధమయ్యై నమః
ఓం పుణ్యాయై నమః (10)
ఓం దేవయోనయే నమః
ఓం అయోనిజాయై నమః
ఓం భూమిజాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అనీశ్వర్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిరహంకారాయై నమః
ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః (20)
ఓం వాణ్యై నమః
ఓం సర్వవిద్యాధి దేవతాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం వనీశాయై నమః
ఓం వింధ్యవాసిన్యై నమః
ఓం తేజోవత్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
ఓం దేవతాయై నమః (30)
ఓం వహ్నిరూపాయై నమః
ఓం సతేజసే నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణమధ్యాయై నమః
ఓం గుణత్రయ వివర్జితాయై నమః
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం సర్వసంహార కారిణ్యై నమః
ఓం ధర్మజ్ఞానాయై నమః (40)
ఓం ధర్మనిష్ఠాయై నమః
ఓం సర్వకర్మ వివర్జితాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కామసంహర్త్ర్యై నమః
ఓం కామక్రోధ వివర్జితాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం చంద్రసుర్యాగ్ని లోచనాయై నమః
ఓం సుజయాయై నమః (50)
ఓం జయభూమిష్ఠాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జనపూజితాయై నమః
ఓం శాస్త్ర్యై నమః
ఓం శాస్త్రమయ్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం శుభాయై నమః
ఓం చంద్రార్ధమస్తకాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భ్రామర్యై నమః (60)
ఓం కల్పాయై నమః
ఓం కరాళ్యై నమః
ఓం కృష్ణ పింగళాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం చంద్రామృత పరిస్రుతాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం మహామాయాయై నమః (70)
ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః
ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం కమలాలయాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కలాతీతాయై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః
ఓం యోగనిష్ఠాయై నమః
ఓం యోగిగమ్యాయై నమః
ఓం యోగిధ్యేయాయై నమః (80)
ఓం తపస్విన్యై నమః
ఓం జ్ఞానరూపాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
ఓం భూతాత్మికాయై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతేశ్యై నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం స్వధాయై నమః
ఓం నారీ మధ్యగతాయై నమః (90)
ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
ఓం మోహితాంశుభవాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం మాత్రాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం నిమ్నగాయై నమః
ఓం నీలసంకాశాయై నమః
ఓం నిత్యానందాయై నమః
ఓం హరాయై నమః (100)
ఓం పరాయై నమః
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం దుర్లభరూపిణ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః (108)
ఏ రోజు ఏ దేవి అలంకారిన్ని , అవతారాన్ని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను.
మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి -
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి -
శ్రీ గాయత్రీ దేవి -
శ్రీ అన్నపూర్ణా దేవి -
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి -
శ్రీ మహాలక్ష్మీ దేవి -
శ్రీ సరస్వతీ దేవి -
శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి ) -
తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి ) -
పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )
తిథి నక్షత్రములను బట్టి అలంకారములు ప్రతీ సంవత్సరం మారవచ్చు.
నైవేద్యము
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గా దేవి యే నమః (ప్రసాదం నివేదయామి).
ఓం ప్రాణాయస్వాహా, ఓమ్ అపానాయస్వాహా, ఓంవ్యానాయ స్వాహా
ఓమ్ ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. (నీరు వదలాలి.)
తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి. (తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
శ్రీ దుర్గా దేవి యే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ దుర్గా దేవి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
ఉద్వాసన
ఈ క్రింది మంత్రము జపించుచూ ఉద్వాసన పలుకవలెను
మం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానస్సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః యథాస్థాన ముద్వాసయామి.
శ్రీ దుర్గా దేవి పూజ సమాప్తం
దసరా నైవేద్యములు
నైవేద్యములు ఇవే పెట్టాలి అని నియమము ఏమీ లేదు కానీ ఒక పధ్దతిగా ఈ నైవేద్యములు పెట్టచ్చు.
1. పాడ్యమి రోజు శ్రీ దుర్గాదేవి - చలిమిడి , వడపప్పు , పాయసం
2. విదియ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి . తీయటి బూంది, శనగలు
3. తదియ రోజు శ్రీ గాయత్రీ దేవి . రవ్వకేసరి, పులిహోర
4. చవితి రోజు శ్రీ అన్నపూర్ణాదేవి . పొంగలి
5. పంచమి రోజు శ్రీ లలితా దేవి . పులిహోర పెసరబూరెలు
6. షష్టి రోజున శ్రీ మహాలక్ష్మి దేవి . బెల్లం లేదా పంచధార తో చేసిన క్షీరాన్నం
7. సప్తమి రోజు శ్రీ సరస్వతి దేవి (మూలా నక్షత్రం రోజున) అటుకులు, కొబ్బరి, శనగపప్పు, బెల్లం
8. అష్ఠమి రోజు శ్రీ దుర్గాదేవి (దుర్గాష్ఠమి) గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు
9. నవమి రోజు శ్రీ మహిషాసురమర్ధిని (మహర్నవమి) చక్రపొంగలి
10. దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి (విజయ దశమి-దసరా) పులిహోర, గారెలు
ఇవే నైవేద్యంగా పెట్టాలి అని నియమం కాదు
మీరు యధాశక్తిన ఏది ఉంటే ఆదే పెట్టవచ్చు భక్తిప్రధానం.
No comments:
Post a Comment