Saturday 14 October 2023

రాశి ఫలితాలు

 



అది వారం (భాను వాసరః) (15-10-2023)

మేషం

 15-10-2023

ఆప్తుల  నుండి అవసరానికి  ధన  సహకారం అందుతుంది. పాత రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలపై  దృష్టి సారించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి  వస్తుంది.    వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు  లభిస్తాయి.  సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

---------------------------------------

వృషభం

 15-10-2023

చుట్టుపక్కల వారితో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో  ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు  లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

---------------------------------------

మిధునం

 15-10-2023

ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో ఆప్తులతో పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు అతికష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------

కర్కాటకం

 15-10-2023

మిత్రులకు  మీ అభిప్రాయాలు నచ్చవు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా  పనులు పూర్తి చేయలేరు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి.  ఇంటా బయట ఒత్తిడి వలన  మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు  మందకోడిగా సాగుతాయి.

---------------------------------------

సింహం

 15-10-2023

ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో  సఖ్యతగా వ్యవహారిస్తారు. సమాజంలో  కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వాహన యోగం ఉన్నది. జీవిత భాగస్వామితో  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

 కన్య

 15-10-2023

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో  మీ పనితీరుతో అధికారుల నుండి  ప్రశంసలు అందుకుంటారు.

---------------------------------------

తుల

 15-10-2023

ముఖ్యమైన విషయాలలో స్వంత  నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగమున విలువైన పత్రములు  విషయంలో  జాగ్రత్త వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

వృశ్చికం

 15-10-2023

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. నూతన  వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

ధనస్సు

 15-10-2023

కీలక వ్యవహారాలలో  ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

మకరం

 15-10-2023

చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఉద్యోగమున పనిఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ  వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి.

---------------------------------------

కుంభం

 15-10-2023

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

మీనం

 15-10-2023

ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.  వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండటం


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe
Whatssapp Community
facebook page
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



 మంచిది.

No comments:

Post a Comment