Tuesday, 10 October 2023

పెద్దల ఆశీర్వాదo విలువ

 

              

🙏మీరు ఏదో ఒక పెద్ద పని కోసం బయటకు పోయినప్పుడల్లా   పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటారు.* 🙏

🙏ఎందుకంటే మనకు వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయవంతమవు తుంది.🙏

🙏చాలా మంది ఇది అబద్ధం అనుకుంటారు. మరియు ఇదంతా పనికిరాని పని అని వారు భావిస్తారు.🙏

🙏మనం కూడా వారిలో ఒకరం. అoదుకే, ఈ రోజు మనం పెద్దల ఆశీర్వాదం ఎంత ప్రయోజనకరంగా మరియు ఫలవంత మైనదో  తెలియజేసే కథను తెలుసుకుందాం.🙏

🙏పూర్వం సదాచార వేద పండితుడు ఉండేవారు. సరస్వతి కటాక్షమే కానీ లక్ష్మీ కటాక్షం లేనివాడు. అతనికి ఒక్కడే కుమారుడు. పండితుడికి వాక్సుద్ధి కలవాడిగా పేరొందినవాడు🙏

🙏అవసాన దశలో కొడుకుని పిలిచి, “నాయనా! నేను నీకంటూ ఏ ఆస్తిపాస్తులు కూడపెట్టలేదు. కానీ నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించింది ఒక్కటే.🙏   

🙏జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా,     విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది నాయనా! ", అని చెప్పి ప్రాణాలు వదిలాడు.🙏

🙏తండ్రికి చేయవలసిన ఖర్మలన్నీచేశాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు.🙏

🙏విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఊరికే కూర్చోక చేతితో దోసిలి నిండా ఇసుకను తీసుకొని క్రిందకు పోస్తున్నాడు. ఒకసారి పోసాడు. రెండో సారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదము గుర్తుకొచ్చింది.🙏

🙏పట్టిందల్లా బంగారం అవుతుంది" ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుంది అని ఇసుకను క్రిందికి పోసి చూసాడు🙏

🙏మూడో సారి ఇసుకను చేతిలోనికి తీసుకొని తలపైకెత్తితే చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురి పెట్టి నిల్చొని వున్నారు. ప్రక్కన రాజు గారు వున్నారు.🙏  

🙏ఆయన తీవ్రంగా “ఏం చేస్తున్నావు? ఏం వెతుకు తున్నావ”ని అడిగారు.🙏

🙏దానికి తండ్రి మరణం, తన దుస్తితి వివరించాడు.🙏

🙏అప్పుడు సైనికులు దూరంగా తొలగారు.🙏

🙏రాజు గారు అన్నారు, “మా నాన్న గారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు  బహుమతిగా ఒక ఉంగరo ఇచ్చారు. అది రెండు రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో పడి పోయింది. రెండు రోజులుగా వెతుకు తున్నాం. నీవు అవిషయం తెలుసు కొని వెతుకు తున్నావని మా సైనికులు అనుకొన్నారు.” అని చెప్పగానే చేతిలోని ఇసుక చటాలని క్రిందికి వదిలి లేచాడు.🙏

🙏తండ్రి వాక్భలం.ఆ ఇసుకలోనే రాజుగారి ఉంగరం దొరినది.🙏

 🙏రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే మూడు సoచుల బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు.🙏

🙏దానితో బంగారు నగల వ్యాపారం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి ఆ రాజ్యoలోని గొప్ప వ్యాపారస్తుల జాబితాలోకి చేరిపోయాడు.🙏

🙏తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవo.🙏

🙏సారాంశం🙏

🙏మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.

🙏మాతృదేవోభవ..! పితృదేవోభవ.🙏

🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు



సర్వే జనా సుఖినో భవంతు,


శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment