Friday 13 October 2023

బతుకమ్మ

 



దసరా నవరాత్రుల వేళ దేశవ్యాప్తంగా దుర్గా మాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. కానీ ఒక్క తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా వేడుకలు జరుగుతాయి. నవరాత్రుల వేళ తెలంగాణలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26వ తేదీ సోమవారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమై అక్టోబర్ 5వ తేదీన ముగియనున్నాయి. సాధారణంగా ఏదైనా పండుగ వస్తే దేవుళ్లను ఆరాధించడం ఆనవాయితీ. అయితే తెలంగాణలో బతుకమ్మ సందర్భంగా కేవలం పూలతోనే పండుగను జరుపుకుంటారు. భాద్రపద అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే ఈ వేడుకలను తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ సందర్భంగా పూలనే ఎలా పేరుస్తారు.. పూలను దేవతలుగా ఎందుకని భావిస్తారు.. ఎలాంటి పువ్వులను ఆరాధిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బతుకమ్మ సంబరాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల ప్రత్యేక పువ్వులను పూజిస్తారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజున వెన్నముద్దల బతుకమ్మ, చివరగా సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలను ఘనంగా ముగిస్తారు. ఈ సంబురాల సమయంలో బతుకమ్మ పాటలు కూడా పాడతారు.
సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe
Whatssapp Community
facebook page
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371




No comments:

Post a Comment