🙏ప్రతి గృహంలోనూ అద్దం ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది గదిలో ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ అద్దాన్ని అమరుస్తూ ఉంటారు.🙏
🙏 అద్దం ఒక్కొక్క చోట అమరిస్తే ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే అద్దం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడికి సంబంధించిన వస్తువు.🙏
🙏 చంద్రుడు శ్రీ మహాలక్ష్మి దేవి ఇద్దరూ పాలసముద్రం నుంచి ఉద్భవించారు కావున మహాలక్ష్మి దేవికి చంద్రుడు సోదర సమానుడు. చంద్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు శ్రీమహాలక్ష్మి అనుగ్రహం ఉండి ధన ధాన్యాలు అభివృద్ధి చెందుతాయి.🙏
🙏 అద్దాన్ని తూర్పు గోడకు అమర్చాలి అనగా ఎవరైనా తలదువుకున్నా బొట్టు పెట్టుకున్నా సరే తూర్పు ముఖంగా తిరిగి చేయాలి. ఉత్తర ముఖం కూడా మంచిదే ఉత్తరం గోడకు అద్దాన్ని అమర్చడం వల్ల విద్యాభివృద్ధి జ్ఞానము పెరుగుతాయి.🙏
🙏 తూర్పు గోడకు అద్దాన్ని అమర్చినప్పుడు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం బాగుంటుంది. ఉత్తర వాయువ్యంలో అద్దాన్ని అమర్చినప్పుడు ఆ గృహంలో నివసించే వారి వ్యాపార అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది.🙏
🙏పడమర గోడకు అద్దాన్ని అమర్చినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఎక్కువగా ఉంటాయి చీటికిమాటికి ఎదో రకంగా గొడవలు పడుతుంటారు. కావున పశ్చిమ గోడకు అద్దాన్ని అమర్చ రాదు. దక్షిణ గోడకు అద్దాన్ని అమర్చినప్పుడు ఆ ఇంట్లో వ్యక్తుల యొక్క పనులు సజావుగా జరగవు చేసే పనులలో అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.🙏
🙏 కావున గృహంలో పశ్చిమ గోడకు అద్దాన్ని అమర్చరాదు. ఇంట్లో ఉపయోగించే అద్దాలు పగిలిపోయినవి మసగబారినవి జిడ్డుగా ఉండే అద్దాలు ఉపయోగించరాదు ఇటువంటివి ఉపయోగించినప్పుడు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తగ్గుతుంది కావున పగిలిన అద్దాలు వంటివి ఉంటే బయట పారవేయండి.🙏
🙏 అద్దాన్ని ప్రత్యేకమైన స్థానాల్లో అమర్చి విద్యార్థుల అభివృద్ధి వ్యాపార ఉద్యోగ అభివృద్ధి మరియు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి.🙏
No comments:
Post a Comment