Friday 20 October 2023

రాశి ఫలితాలు

                                         

(21-10-2023)

స్థిర వాసరః శనివారం 

మేషం

 21-10-2023

ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి.  దైవ సేవా కార్యక్రమాలలో  విశేషంగా పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

వృషభం

 21-10-2023

వృత్తి ఉద్యోగాలలో  అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారపరంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. 

---------------------------------------

మిధునం

 21-10-2023

నూతన విషయాలు సేకరిస్తారు. గృహమునకు బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.

---------------------------------------

కర్కాటకం

 21-10-2023

మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో  అధికారులను ఆకట్టుకొంటారు.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

సింహం

 21-10-2023

ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు ధన  వ్యయం  చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి. 

---------------------------------------

కన్య

 21-10-2023

చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమైన సకాలంలో పూర్తిచేస్తారు. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి.

---------------------------------------

తుల

 21-10-2023

నూతన కార్యక్రమాలు ప్రారంభానికి  అవరోధాలు కలుగుతాయి. సోదర స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు  విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి.  వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

వృశ్చికం

 21-10-2023

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.  వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకుంలించవు. నిరుద్యోగ  ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.  

---------------------------------------

ధనస్సు

 21-10-2023

కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతాయి. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో  నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.  వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారములను విస్తరించి నూతన  లాభాలు అందుకుంటారు.

---------------------------------------

మకరం

 21-10-2023

వృత్తి ఉద్యోగాలలో  అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. ధన  పరంగా ఒడిదుడుకులు అదిగమిస్తారు.  దీర్ఘకాలిక రుణ ఒత్తిడి  పెరుగుతుంది. దూర  ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. 

---------------------------------------

కుంభం

 21-10-2023

వృత్తి  వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్న నాటి మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో  పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలుంటాయి.

---------------------------------------

మీనం

 21-10-2023

ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో  పూర్తిచేస్తారు.  నిరుద్యోగులకు లభించిన అవకాశాలు  సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో స్వంత ఆలోచనలు అమలుచేస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe
Whatssapp Community
facebook page
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment