Friday 13 October 2023

"మహలయా అమావాస్య" రోజున మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే మంచిది .

 


------------------------------------

మీ గోత్రం ..


మీ పేరు చెప్పుకొని...


నా జన్మకు మూల కారణమైన నా తల్లి - దండ్రులకు నా యొక్క అనంతకోటి నమస్కారములు.అలాగే నా తల్లి - దండ్రులకు మూలమైన తాతలకు , ముత్తాతలకు అనంత కోటి ప్రణామములు . 

సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకూ ఈ వంశ పరంపరల్లో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంతకోటి నమస్కారములు . 

   ఎందరో యోగులు,  మహాత్ములు, పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి , నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొందియున్నాను. ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించు చున్నాను . మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోక హిత  కార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి . ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ చంద్రార్కము అవనిలో విలసిల్లునట్లుగా ఆశీర్వదించండి .

     నాలోనూ , నా కుటుంబ  సభ్యుల లందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి , క్షేమ , స్థైర్య , ధైర్య , విజయ ,అభయ , ఆయుః , ఆరోగ్య , ఐశ్వర్య ముల నొసగి , ధర్మార్ద , కామ , మోక్ష ముల నొసగి , అహం పదార్ద రహిత స్తితి కలిగేటట్లుగా దీవించి నా జన్మ ధన్యత చేకూర్చగలరని కోరుతూ 

అష్ట వసువులు , ఏకాదశ రుద్రులు , ద్వాదశ ఆదిత్యులు ,త్రిమూర్తులు , త్రిమాతలు , అష్ట దిక్పాలకులు , నవ గ్రహాలు , సమస్త సద్గురువులు మరియు  సమస్త దేవతా మూర్తుల యొక్క ఆశీస్సులను  కోరుతూ  నా యొక్క అనంత కోటి నమస్కారములు సమర్పించుచూ మనసా,  వాచా, కర్మణా, త్రికరణ శుద్ధిగా , ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరించు చున్నాను .


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
FOLLOW US ON:
Pls Like, Share, Comment, Subscribe
Whatssapp Community
facebook page
శ్రీ విధాత పీఠం / Sree Vidhatha Peetam YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment