తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి మాసంలో త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ప్రదోష వ్రతం ప్రతి నెలలో శుక్ల పక్షంలో ఒకసారి.. కృష్ణ పక్షంలో మరోసారి వస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి నెలలో రెండుసార్లు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం శనివారం రోజున వస్తే శని ప్రదోషం వ్రతం అని.. సోమవారం వస్తే సోమ ప్రదోష వ్రతం అని.. మంగళవారం రోజున వస్తే భౌమ ప్రదోషం అని అంటారు. ఈ నేపథ్యంలో . ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని, శని భగవానుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పర్వదినాన ఉపవాస దీక్షలుండి శివయ్యను, పూజించడం వల్ల సంపద పెరగడంతో పాటు ఆరోగ్యం, శ్రేయస్సు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు.
పూజా విధానం..
ఈ పూజలో మొత్తం 16 రకాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ దాదాపు ఒకే పద్ధతిలో ఉంటాయి. ఈ పూజను షోడషోపచార పూజ అని కూడా అంటారు. ఈ వ్రతం ఆచరించేవారు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ముందుగా దేవుని ఎదుట ద్యాన ముద్రలో కూర్చొని, శివయ్యను స్మరించుకుంటూ ఉపవాసం దీక్ష ప్రారంభించాలి. మీ ఇంట్లోని పూజా గదిలో శివుని విగ్రహం లేదా ఫొటోకు తెల్ల చందనం, అక్షింతలు, పూలు, పూల హారాలు, బెల్లం, శమీ ఆకులు, బిల్వ పత్రాలు తదితర వస్తువులను సమర్పించాలి. అనంతరం దీపారాధన చేయాలి. ఆ తర్వాత ధూపం వెలిగించాలి. పూజా సమయంలో శివ చాలీసా, శివ మంత్రాలను పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వాలి. ఈరోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్లీ స్నానం చేసి శివ పూజ చేయాలి.
ప్రదోష వ్రతం ప్రాముఖ్యత..
స్కంద పురాణం ప్రకారం, ప్రదోష వ్రతాన్ని ఆచరించిన వారికి ఆదాయం, సంతోషంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించిన వారు ప్రతి ప్రయత్నంలోనూ కచ్చితంగా సక్సెస్ అవుతారు. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి ఉంటుంది. అంతేకాదు సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కచ్చితంగా మంచి ఫలితాలొస్తాయి. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఉపవాసం ఉంటూ శని ప్రదోష కథను తప్పకుండా చదువుకోవాలి. ఈ వ్రతం దాదాపు గంటన్నర సమయం ఉంటుంది.
సంపదలు పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ కెరీర్లో పురోగతి లభిస్తుంది. సంతానం లేని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కచ్చితంగా పిల్లల గురించి శుభవార్తలను వింటారు. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికి శివయ్య కోరికలన్నీ నెరవేరుస్తాడని చాలా మంది నమ్ముతారు.
No comments:
Post a Comment