Tuesday, 10 October 2023

స్వయంపాకం దానం అంటే ఏమిటీ...?

 


పరిస్థితుల కారణం చేత మనం వండిన భోజనం  పెట్టలేకపోయినప్పుడు,  సాధారణంగా బ్రాహ్మణులు బయటి భోజనం తినరు.  వారుచేసే అనుష్టానం వల్ల  వారు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చెయ్యరు. (అనుష్ఠానం అంటే  ఆచారం, నడవడి, వివిధ ధర్మ కర్మలు) అందుకోసం వారిని ఇబ్బంది కలిగించకుండా బ్రాహ్మణుడినే స్వయంగా  తయారుచేసుకోమని ప్రార్ధిస్తూ ఇచ్చేదే స్వయంపాకం.

స్వయంపాకంకు కావలసినవి.

దోసకాయ, బీరకాయ, పచ్చి అరటి కాయలు, దొండకాయలు, చామగడ్డలు, కంద గడ్డ, ఆకుకూరల్లో  తోటకూర. ఇందులో మీకిష్టమైనవి కనీసం 4 రకాల కూరలు ఉండాలి.

వాటితో పాటు బియ్యం, చింతపండు, పప్పులు, బెల్లం, గట్టి ఉప్పు, ఎండు మిరపకాయలు, నెయ్యి, పెరుగు ఇలా భోజనానికి సరిపడా అన్ని పదార్ధాలు ఒక ఆకులో పెట్టి ఇవ్వాలి.

కూరగాయలతో పాటు తోటకూర తప్పనిసరిగా వుండాలి అని చెప్తారు మనపెద్దలు.

ఇవే కాకుండా దానం చేసుకోవడానికి ఏ వస్తువూ అనర్హం కాదు.

విస్తరిలో బియ్యం కనీసం 1-1/4 కేజీ ఉండాలి. తీపి గుమ్మడికాయ కూడ ఇవ్వొచ్చు.

మధ్యలో రెండు తమలపాకులు, వక్కలు నల్లవి, రెండు అరటిపండ్లు, తాంబూలం మీకు తోచిన దక్షిణ (51/- లేదా 116/- ) ఉంచివారికి అందించాలి.

దానితో వారు కూడా  ఎంతో సంతసించి మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని ఆశీర్వచనం  పలకుతారు.( దీవిస్తారు)

సౌఖ్యమైన జీవనం కోసం  మంచి గుమ్మడికాయ దానం చేసుకోవచ్చు.

అన్ని కలగాపులగంగా  కలిపేసి ఇవ్వకుండా, వేటికీ అవి ప్రత్యేకంగా ఒక కవరు లాంటి దాంట్లో వేసి ఇస్తే వస్తువులు పాడుకాకుండా ఇంటికి తీసుకువెళ్లి వండుకుంటారు.

విస్తరిలో అన్ని ఉంచిన తరువాత బియ్యం పిండితో చేసిన దీపాన్ని ఉంచి ప్రత్యేకంగా కార్తీకమాసంలో దీపదానం కూడా చెయ్యొచ్చు. దానికి విశేష ఫలితం పొందుతారు.🙏


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
htశ్రీ విధాత పీఠం / Sree Vidhatha PeetamouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment