Tuesday, 10 October 2023

హారతులు ఎన్ని రకాలు

 





సర్వేశ్వరునికి వేదమంత్రోక్తంగా సశాస్త్రీత్రయంగా ఇచ్చే సర్వమంగళ నీరాజనమే హారతులు. ఇవి పలురకాలు

🔱✨🔱✨🔱✨🔱✨🔱✨🔱

1.   ఏక హారతి

ప్రతిదీ ఒకేవిధంగా ఉండడానికి ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిశ్చల స్థితిలో ఉండేందుకు దోహదం చేసేదే ఏక హారతి. ఇది నదుల్లోని ఔషధగుణాలు పెరగడానికి కూడా తోడ్పడుతుంది.

2,.    నేత్రహారతి

దివ్యస్వరూపమైన పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలని ఇచ్చేదే నేత్రహారతి. దీనివల్ల సమస్త దృష్టిలోపాలు తొలగిపోతాయి.

3,.     బిల్వహారతి

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇచ్చే నీరాజనమిది. మనం చేపట్టిన ప్రతి పనినీ త్రికరణ శుద్ధితో చేసే ప్రేరణనిచ్చి అన్నింటా విజయాల్ని సాధించే శక్తినిస్తుంది.

4,.    పంచహారతి

ఇది పంచభూతాలకు ఇచ్చే హారతి. ప్రత్యేకించి పంచభూతాల్లోని జలానికి ఇచ్చే నీరాజనం. ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా సమస్త మానవాళి కాపాడబడాలని ఇచ్చే హారతి.

5,.    సింహ హారతి

ఇది ప్రతి ఒక్కరూ విజయశిఖరాలకు చేరాలని ఇచ్చే హారతి. ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలన్నీ నెరవేరాలని ప్రజలు, ప్రభుత్వం సుభిక్షంగా ఉండడానికి ఇచ్చే హారతి.

 6,.      రుద్ర హారతి

రుద్ర అంటే శివుడు అని కాదు. రుద్ర అంటే ఇక్కడ మంగళం అని అర్థం. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఇచ్చే హారతి ఇది.

7,.      చక్రహారతి 

చక్రం విష్ణుమూర్తి కుడి చేతిలో ఉంటే ఇది గురువు ఎడమ చేతిలో ఉంటుంది. ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండదు కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు.

8,.       నవగ్రహ హారతి

మన జీవితాల్ని నడిపే నవగ్రహాలే దోషాల పాలైతే జీవితం సాఫీగా సాగదు. అందుకే నవగ్రహాల దోషాలను తొలగించేందుకు ఈ హారతి పడతారు.

9,.      కుంభహారతి

ప్రతి మంచి పనికీ స్వాగతం పలకడానికి, నరఘోషతో పాటు సమస్త దిష్టి దోషాలు తొలగిపోవడానికి ఈ హారతి పడతారు.

10,.         నృత్యహారతి

పరమేశ్వర స్వరూపమైన సమస్త కళలూ దేదీప్యంగా వెలుగొందడానికి ఇచ్చేదే ఈ నృత్యహారతి. నృత్యం జీవచైతన్యానికి ప్రతీక కాబట్టి నృత్య హారతి ఇవ్వడం ద్వారా మానవ జీవితాలు సమస్తం నిత్యం చైతన్యంతో వెలుగొందుతాయి.

11,.        రథహారతి

ద్వైమూర్తులందరికీ రథాలు ఉంటాయి. రథహారతి ఇవ్వడం వల్ల అందరికీ రథాలు అంటే వాహనాలు కలిగేందుకు దోహదం చేసేదే ఈ రథహారతి.

12.        వృక్షహారతి

సమస్త వృక్షసంపదంతా అపారంగా పెరిగి స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇవ్వడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇచ్చేదే వృక్షహారతి.

13,.       నాగహారతి

సంతాన లోపాలు, కాలసర్పదోషాలు తొలగిపోవడానికి ఇచ్చేదే నాగహారతి.

14,.      ధూపహారతి

భూలోకంలో ఉండే సమస్త కాలుష్యాల్ని తొలగించి సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమిమీద పడాలని పర్యావరణం చక్కగా ఉండాలని ఇచ్చేదే ధూపహారతి

15,.      అఖండ కర్పూర హారతి

సమస్త లోకాలు శాంతిసీమలు కావాలని కర్పూరంతో పట్టేదే అఖండ కర్పూర హారతి

16,.        నక్షత్ర హారతి

ప్రతి మనిషిలోనూ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలనే దోషాలు ఆవరిస్తే సమస్యలు మొదలవుతాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవాలని ఇచ్చేదే నక్షత్ర హారతి 🙏🙏🙏    


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు


వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
htశ్రీ విధాత పీఠం / Sree Vidhatha PeetamouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment