Monday 24 July 2017

శ్రావణమాస విశేషాలు: 2017



శ్రావణమాస విశేషాలు:
శ్రావణమాసం వచ్చిందంటేచాలు ప్రతీ ఇల్లు దేవాలయాన్ని తలిపిస్తుంది. నెల రోజుల పాటు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణ వినిపిస్తుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి దైవ కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు వేదపండితులు. అంత గొప్ప పవిత్రమాసం నేటి నుంచి (సోమవారం) ప్రారంభమైంది.

అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్టపండుగలు సైతం రానున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవదైన శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటింది. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు ఏర్పడింది. ఈ శ్రావణమాసంలోనే వర్షరుతువు ప్రారంభమవుతుంది.

త్రీమూర్తులలో స్థితికారుడు దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి (భార్య) అయినటువంటి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం. వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణం. మహావిష్ణువు జన్మనక్షత్రం కూడా శ్రావణనక్షత్రం కావడం, అటువంటి శ్రావణనక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైన మాసం. ఈ మాసంలో చేసే దైవకార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది. నెల రోజులు నిష్ట, నియమాలతో పూజలు నిర్వహించినట్లయితే కోరిన కోరికలు తప్పక నేరవేరుతాయానేది భక్తుల ప్రగాఢవిశ్వాసం.



శ్రావణ మాసంలోని మరిన్ని విశిష్టతలు..
శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే ఎంతో మోక్షం లభిస్తుంది. శుక్లపక్ష పౌర్ణమి, శ్రావణపౌర్ణమి, రాఖీపౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదభ్యాసాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన లాంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటి ముఖ్య పండుగలు సైతం శ్రావణమాసంలో రావడం శ్రావణమాసానికున్న ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ మాసంలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచాతప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటున్నాయి మన పూరాణాలు.


శివారాధనకు ఎంతో విశిష్టత కలిగిన మాసం..
శ్రావణమాసంలోని దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు కూడా విశిష్టమైన మాసం. శ్రావణమాసం ముఖ్యంగా భగవారాధనలో శివ, కేశవ బేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ మాసంలో చేసే ఏ చిన్న కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుంది. ఈ మాసంలో సోమవారాలు పగలంత ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రభిషేకాలు, బిల్వార్చనలు జరిపినట్లయితే సకల పాపాలు కూడా నశిస్తాయాని శస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా ఉపవాసం ఉండి దీక్షను పూర్తిచేయాలి. అలా సాధ్యం కానీ పక్షంలో రాత్రి సమయంలో పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని బుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనేక శుభఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణశుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఈ పక్షంలోని ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్ర్తాలు చెబుతున్నాయి. భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉటుందంటున్నారు పండితులు. అందుకే శ్రావణమాసంలోని అన్ని సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది.





శ్రావణ మాసంలో విశేష పర్వదినములు:
  1. మంగళగౌరీ వ్రతం 25-7-2017
  2. నాగపంచమి 28-7-2017
  3.  వరలక్ష్మీ వ్రతం 4-8-2017
  4. సర్వేశం ఏకాదశి 3-8-2017
  5. రాఖీ పూర్ణిమ7-8-2017
  6. హయగ్రీవ జయంతి 7-8-2017
  7. రాఘవేంద్ర జయంతి -8-2017
  8. శ్రీ కృష్ణాష్టమి  14-8-2017
  9. కామిక ఏకాదశి 18-8-2017
  10. పోలాల అమావాస్య 21-8-2017
మంగళగౌరీ వ్రతం:

శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
ఈ వ్రత విదానం & వివరములకు క్లిక్ చేయండి —-> మంగళగౌరీవ్రత వివరములు

 
వరలక్ష్మీ వ్రతం:

మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.

శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణమాసంలో మరొక శుక్రవారమైన ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. పూజ మండపంనందు నిండు కళశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి శ్రీవరలక్ష్మీదేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ కింది శ్లోకాని పటించాలి.

శ్లోకం : 

బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే 


అని పటిస్తూ తోరణాన్ని చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను శ్రవణం చేస్తూ ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా మహాశివుడు పార్వతిదేవికి సూచించి సౌభాగ్యం, మాంగల్యబలాన్ని వివరించినట్లు పురణాలు చెబుతున్నాయి.



శుక్లా పంచమి-నాగుల పంచమి: 28-7-2017

దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈరోజుని నాగులచవితి పండుగలా నాగాపుజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.


శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి:

శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది. 
శ్రావణ పూర్ణిమ – రాఖీపూర్ణిమ:


అన్న/తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు. 

ముఖ్యమైన విషయం..
7వ తేదీ రాఖీపౌర్ణమి


ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం ఉంది. కాబట్టి ఆరోజు ఎలాంటి పూజలు చేయకపోవడం మంచిది. ఉదయం 9గంటల వరకు పూజాకార్యక్రమాలు ముంగించుకుని దైననామ స్మరణలో ఉంటే శుభం చేకూరుతుంది.




  హయగ్రీవ జయంతి:

ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టం. 

కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి:

మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతే కాదు. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర, శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడినది.
 
కృష్ణపక్ష అష్టమి – శ్రీకృష్ణాష్టమి:

శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది. 


కృష్ణపక్ష ఏకాదశి – కామిక ఏకాదశి:

ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం. 


కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య:


పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి,  పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.



శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహ సిద్ధిరస్తు.

Friday 21 July 2017

రాహు మహా దశలో కాలసర్ప యోగము (Kalsarpa Yoga in Rahu Mahadasha)


కాల సర్ప యోగమునకు జ్యోతిష్య సాస్త్రములో ఏడున్నర సంవత్సరముల శని దశ వలె మహత్వ పూరితమైన స్థానమును ఇవ్వ బడ్డది (The Kalasarpa Yoga is considered as malefic as the Sadesati). ఈ యోగము ఎవరి కుండలిలో అయితే వుండునో వారు రాహు దశలో అష్ట అశ్వర్యములను పొంది వున్నతిని పొందెదరు మరియు రాహువు యొక్క అశుభ దశలో దు:ఖములను మరియు కష్టములను పొందెదరు.
కాల సర్ప యోగము ఎవరి కుండలిలో అయితే వుండునో వారిని రాహువు యొక్క మహాదశ ఎలా ప్రభావితము చేయునో పరిశీలిద్దాము రండి.
జ్యోతిష్య శాస్త్రము ప్రకారము రాహువు యొక్క మహాదశ సంఘర్ష పూరితమైనదిగా వుండును (Jyotisha says that the Rahu Mahadasha is full of struggle). 


దీని యొక్క మహాదశ నడుచు చున్నప్పుడు జీవితములో త్వరత్వరగా వొడిదుడుకులు వచ్చును. రాహు దశ యొక్క ఫలితములు త్వరగా లభించుట ప్రారంభమగును. ఎవరి కుండలిలో అయితే కాలసర్ప యోగము వుండునో వారికి ఈ గ్రహ దశలో విశేషమైన కష్టములను మరియు సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. గోచారములో రాహువు యొక్క మహాదశ కాలసర్ప యోగము కలవారికి విషేశ కష్టములను కలిగించును (Rahu Mahadasha is more inauspicious for those who have Kalsarpa Yoga). 

ఎప్పుడైతే ఈ దశ వచ్చునో ఆ సమయములో వ్యక్తిని చాలా కష్టములను ఎదుర్కొన వలసి వచ్చును. 

రాహువును సర్పము యొక్క తల మరియు కేతువును తోకగా చెప్పెదరు. యది కుండలిలో వున్న అన్య గ్రహములు వీటి మద్యకు వచ్చునప్పుడు కాలసర్ప యోగము కలుగును. కాలసర్ప యోగములోనికి వచ్చిన తరువాత శుభ యోగము మరియు గ్రహములు కూడా బలహీన పడి పోవును. దీని యొక్క పూర్తి ఫలితములు రాహువు యొక్క మహాదశపై నిర్ధారిణము కాగలదు. జన్మ జాతకములో కాలసర్ప యోగము వుండి రాహువు యొక్క మహాదశ నడుచు చున్న ఎడల ఆ సమయములో జీవితము నిరాశ మరియు కష్టదాయకముగా అనిపించును. ఈ సమయములో జీవిత ప్రయాణమును సరిగా తీసుకు వెల్లదలచినా అది చెడుగానే వుండగలదు. మీకు మీ పరిశ్రమకు తగ్గ ప్రతిఫలము లభించుట చాలా కష్టము మరియు మీకు అన్ని విధముల నష్టములు మాత్రమే కలుగును. కాని ఈ సమయములో ధైర్యముతో కూడి రాహువు యొక్క ఉపాసనము చేసిన ఎడల మీరు మీ విపరీత స్థితిల నుండి కొంతవరకు శాంతి లభించగలదు. 

రాహువు యొక్క దశ, మహాదశలలో ఎక్కడైతే బయంకరమైన కష్టములు కలుగునో అక్కడే దశ దిగజారును. త్వరగా శుభ పరిణామములు లభించుట ప్రారంభమగును. ఈ దశ వ్యక్తిని పరిశ్రమి మరియు సంఘర్షజీవితమును గడుపు వ్యక్తిగా చేయును. అందువలన వ్యక్తి కష్టములలో కూడా సఫలత యొక్క మార్గములో నడుచుట నేర్చుకొనగలడు. అనేక విధములనై ఉన్నతిని చేరుకొన గలడు. రాహువు యొక్క మహాదశలో ఎవరైతే దశను ఎదుర్కొన జాలక కూర్చొని వున్నారో వారిని రాహువు కష్టముల పాలు చేయును. అందువలన మీ కుండలిలో యది కాలసర్ప యోగము వుండి రాహువు యొక్క మహాదశ అంతర్ దశలో కష్టకరమైన పరిస్థితులను ఎదుర్కొన వలసి వచ్చు చున్న ఎడల మనస్సును స్థిరముగా వుంచి శుభ సమయము కొరకు ప్రతీక్షించండి మీకు శుభ పరిణామములు తప్పక లభించగలవు.

విధివిధానం గా చేయించుకున్న కాలసర్ప యంత్రాని ప్రతిష్టించుకోవడం, కాలసర్ప శాంతి హోమం చేయించు కోవడం, సుబ్రహ్మణ్య స్వామికి పూజ అభిషేకం కళ్యాణం చేయించుకోవడం, మానసాదేవి పూజ చేయించుకోవడం  మొదలైన పరిహారాలు చేసుకోవాలి.
శుభమస్తు

సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం.



సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.
మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.

మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.

జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం.

సంతానప్రాప్తిని కోరే మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు.

Tuesday 11 July 2017

ధనం, విలువైన ఆభరణాలు ఉత్తరపు గదిలో ఎలా దాచాలి?

No automatic alt text available.

No automatic alt text available.No automatic alt text available.

ధనం, విలువైన ఆభరణాలు, వస్తువులు ఉండే బీరువాలు, ఇనుప పెట్టెలు, షెల్ఫులు మొదలైనవి.. ఉత్తరపు గదిలో ఉత్తర దిశకు ఎదురుగా దక్షిణపు గోడకు చేర్చి పెట్టుకోవాలి. లేదా తూర్పు గదిలో తూర్పు దిక్కునకు ఎదురుగా పడమటి గోడకు చేర్చి పెట్టుకోవాలి. ఏ గదిలోనైనా ఈశాన్యమూలకు ఇది ఉండకుండా చూసుకోవాలి.

Sunday 9 July 2017

భోజనాల గది


Image may contain: table and indoor
భోజనాల గది పడమర దిశలో ఏర్పరుచుకోవాలి. తూర్పు దిక్కునకు ఎదురుగా పశ్చిమదిశలో కూర్చొని భోజనాలు చేయడం మంచిది. పడమటి దిశకు ఎదురుగా కూర్చుని భోజనం చేయరాదు.

హోమ భస్మాన్ని నేలపై ఉంచకూడదట.. విభూతి నవగ్రహ దోషాలను..?

Image may contain: food





 
సాధారణంగా హోమంలో దర్బలు, ఇతరత్రా హోమ వస్తువులు వేసి దహిస్తారు. హోమం ప్రక్రియ పూర్తికాగా.. మిగిలిన భస్మాన్నే విభూతి అంటారు. పవిత్రంగా భావించబడే విభూతి ప్రతి శివాలయంలోనూ ఉంటుంది.
అయితే ఈ హోమభస్మాన్ని నుదుట ధరించిన తర్వాత నేలపై రాల్చేయడం.. ఆలయ గోడలపై విదిలించడం వంటివి చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. హోమ భస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదట. అలా ఉంచితే దోషాలు తప్పవంటున్నారు. విభూతిని నుదుటన ధరించడం ద్వారా నవగ్రహ దోషాలు, ఈతి బాధలు తొలగిపోతాయని పంచాంగ నిపుణులు అంటున్నారు.
హోమం భస్మాన్ని ధరించడం ద్వారా అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. దేవుని అనుగ్రహంతో అనుకున్న పనులు నిరాటకంగా జరిగిపోతాయి. అంతేగాకుండా అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాల నుంచి నివారణ లభిస్తుంది.
విఘ్నేశ్వరుడైన శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగించడం ద్వారా పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడే చెడు ప్రభావం ఉండబోదు..

Saturday 8 July 2017

గురు లక్షణములు

తంత్రరాజం  లో వివరింపబడిన గురు లక్షణములు:



సౌలభ్య మప్యగర్విత్వం సంతోషో బహు తంత్రతా
అసంశయః తత్వభోదః తచ్చిత్త ప్రతిపాదనాత్

భావము:
సులభముగా అందుబాటులో ఉండువారు, గర్వము లేకుండు వారు,
సదా సంతోషముతో ఉండువారు,
అన్ని తంత్ర పద్దతులు తెలిసిన వారు,
తత్వ జ్ఞాన సంపన్నులు,జ్ఞానోపదేశముతో సంశాలు పోగొట్టేవారు,
తత్,చిత్ లను సులభ సాధ్యంగా భోదదించు వారు నిజమైన గురువులు

గురు పూర్ణిమ

ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా 'వ్యాసపౌర్ణమి' అని అంటారు. గురు పౌర్ణిమ రోజున గురుపూజా మహోత్సవాలు జరుగుతాయి. ఇదే రోజున వ్యాసముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

'గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర :
గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :'

 
గురుపూజకు శ్రేష్టమైన గురుపౌర్ణమి విశిష్ఠత ఏమిటో తెలుసా? పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. 


ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు. 

వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.
ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు.
వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. 

ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక..!


గురుకటాక్ష సిద్దిరస్తు



సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371





Friday 7 July 2017

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు


* భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
* కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి
తనయులు 60,000
మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి
పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్
బెంగాల్
* కాంభోజ రాజ్యం - ఇరాన్ (శ్రీరాముని ముత్తాత
రఘు మహారాజు సామ్రాజ్యం
ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది)
* రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన
చోటు)- లాంగకో, టిబెట్, చైనా
* గోకర్ణ,శివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ,
కర్ణాటక
* సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
* మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
* కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల
వరకు ఉన్న ప్రదేశం
* దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్
* సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర
నది
* ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ
యాగం
చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) -
అయోధ్య,ఉత్తర్
ప్రదేశ్
* తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
* అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
* కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్
ప్రదేశ్
* గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు-శృంగబేరిపురం, అలహాబాద్
దగ్గర
* దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా,
మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు
* చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా,
మధ్యప్రదేశ్
* పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర
* కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక
* శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక
* హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం -
హనుమాన్
హళ్ళి,కొప్పాళ,కర్ణాటక
* ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని
రాజ్యం),
ఋష్యమూక పర్వతం-తుంగభద్ర నదీతీర ప్రాంతం,హంపి దగ్గర,కర్ణాటక
* విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు
* శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
* రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక
* అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ,
శ్రీలంక
* శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
* సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక
* వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో
ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ
దూరంలోని
బితూర్.
* కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్,
పాకిస్తాన్
* లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్,
పాకిస్తాన్
* తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన
నగరం) - తక్షశిల, పాకిస్తాన్
* పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు
పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం
* మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్
ధాం,నేపాల్
* నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
* జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
* మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
* శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి
వారి
రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం, దుర్యోధనుని చంపిన
చోటు-కురుక్షేత్ర, హర్యానా
* పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి
విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి * తనకోసం నేలను సృష్టించుకొన్న
ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
* మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ
ఒరిస్సా
* నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్
జిల్లా,మధ్యప్రదేశ్
* వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
* నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
బోధించిన
ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు-
మన
గ్రామం, ఉత్తరాంచల్
* రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
* సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-
కురుక్షేత్ర దగ్గర
* హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
* మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
* వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
* కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్
* మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్
ప్రావిన్స్, పాకిస్తాన్
* ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
* గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్,
హర్యానా
* కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
* పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
* కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం -
గిర్నార్,గుజరాత్
* శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
* హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్
ప్రదేశ్
* విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ,
మహరాష్ట్ర
* కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
* చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
* కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా,
మధ్యప్రదేశ్
* ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ
దగ్గర
* కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
* పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్,ఫారుఖాబాద్
ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
* కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్,
ఉత్తర్
* జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్
* కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) -
పశ్చిమ హర్యానా
* మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్
వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
* విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్
నగర్,రాజస్థాన్
* శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
* ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
* నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస
తీర్థం, సోంనాథ్, గుజరాత్
* జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
* కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్
* బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
* గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్
ప్రదేశ్ .