Wednesday 28 November 2018

Tip Of The Day 29-11-2018

ENTRANCE AT N7:

Entrance is at N7 IS very Bad...It Effect on Girls who Stays in This House...They may differ from parents.
n7 means &th parts of 8 parts in complete North Area( Slightly left side of North East Entrance)

రుద్రాష్టకం


నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ |
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేఽహమ్ || ౧ ||
నిరాకారమోంకారమూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్ |
కరాలం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్ || ౨ ||
తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్ |
స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్భాలబాలేందు కంఠే భుజంగా || ౩ ||
చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుమ్ |
మృగాధీశచర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి || ౪ ||
ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటిప్రకాశమ్ |
త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్ || ౫ ||
కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ |
చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ || ౬ ||
న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్ |
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ || ౭ ||
న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా దేవ తుభ్యమ్ |
జరా జన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభో పాహి శాపన్నమామీశ శంభో || ౮ ||
రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే |
యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ||


పంచాంగం 29 - 11 - 2018,


ఓం శ్రీ గురుభ్యోనమః🙏

శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,

తేదీ .... 29 - 11 - 2018,

గురు వారం ( బృహస్పతి వాసరే ),

శ్రీ విళంబి నామ సంవత్సరం,

దక్షిణాయనం,

శరద్ ఋతువు,

కార్తీక మాసం,

బహుళ పక్షం,

తిధి : సప్తమి రా9.57

తదుపరి అష్టమి,

నక్షత్రం : ఆశ్లేష/ఆశ్రేష ఉ10.25

తదుపరి మఖ,

యోగం : ఐంద్రం సా5.00

తదుపరి వైధృతి,

కరణం : భద్ర/విష్ఠి ఉ11.07

తదుపరి బవ రా9.57

ఆ తదుపరి బాలువ,

సూర్యరాశి : వృశ్చికం,

చంద్రరాశి : కర్కాటకం,

సూర్యోదయం : 6.16,

సూర్యాస్తమయం : 5.20,

రాహుకాలం : మ1.30 - 3.00,

యమగండం : ఉ6.00 - 7.30,

వర్జ్యం : రా9.35 - 11.05,

దుర్ముహూర్తం. : ఉ9.57 - 10.42 &

మ2.23 - 3.07,

అమృతకాలం. : ఉ8.55 - 10.25

Tuesday 27 November 2018

Tip Of The Day 28-11-2018

BEST RELATIONSHIPS - PHOTO FRAMES

NORTH WEST is Good to Place Photo Frames With your Friends / Relative /  Near and dear for Best Relationships.

పంచాంగం 28 - 11 - 2018




ఓం శ్రీ గురుభ్యోనమః🙏 

తేదీ ... 28 - 11 - 2018,

ఓం శ్రీ గురుభ్యోనమః🙏 

తేదీ ... 28 - 11 - 2018,

బుధ వారం ( సౌమ్య వాసరే )
,
శ్రీ విళంబి నామ సంవత్సరం,

దక్షిణాయనం,

శరద్ ఋతువు,

కార్తీక మాసం,

బహుళ పక్షం,

తిధి : షష్ఠి రా12.18,

నక్షత్రం : పుష్యమి మ12.06

తదుపరి ఆశ్లేష/ఆశ్రేష

యోగం : బ్రహ్మం రా8.17

తదుపరి ఐంద్రం,

కరణం : గరజి మ1.28

తదుపరి వణిజ రా12.18,

సూర్యరాశి : వృశ్చికం,

చంద్రరాశి : కర్కాటకం,

సూర్యోదయం : 6.16,

సూర్యాస్తమయం : 5.20,

రాహుకాలం : మ12.00 - 1.30,

యమగండం. : ఉ7.30 - 9.00,

వర్జ్యం : రా12.00 - 1.29,

దుర్ముహూర్తం. : ఉ11.26 - 12.10 &

రా10.30 - 11.22,

అమృతకాలం. : ఉ7.36వరకు &

తె6.07నుండి,

Monday 26 November 2018

Tip Of The Day 27-11-2018

Glass n Mirrors:

NORTH is Good Location for Glass work or Mirror. GLASS can't be Used at SOUTH which Effect on Relax / Name / Fame.

పంచాంగం 27 - 11 - 2018,



ఓం శ్రీ గురుభ్యోనమః🙏

శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ .... 27 - 11 - 2018,

మంగళ వారం ( భౌమ్య వాసరే ),

శ్రీ విళంబి నామ సంవత్సరం,

దక్షిణాయనం,

శరద్ ఋతువు,

కార్తీక మాసం,

బహుళ పక్షం,

తిధి : పంచమి రా2.38,

నక్షత్రం : పునర్వసు మ1.43,

యోగం : శుక్లం రా11.24,

కరణం : కౌలువ మ3.47 తదుపరి తైతుల రా2.38,
సూర్యరాశి : వృశ్చికం,

చంద్రరాశి : కర్కాటకం,

సూర్యోదయం : 6.15,

సూర్యాస్తమయం : 5.20,

రాహుకాలం : మ3.00 - 4.30,

యమగండం. : ఉ9.00 - 10.30,

వర్జ్యం : రా9.10 - 10.39,

దుర్ముహూర్తం. : ఉ8.28 - 9.12 & రా10.30 - 11.22,

అమృతకాలం. : ఉ11.27 - 12.57 & తె6.07నుండి,

Sunday 25 November 2018

Tip of The Day 26-11-2018

LAUGHING BUDDA / KUBERA:

Good Place to keep Laughing Budda / Kubera Is NORTH part of The House.For More Oppurtunities Where We can Create the Inflow of The More Money.

పంచాంగం 26 - 11 - 2018


ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 

శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,

తేదీ .... 26 - 11 - 2018,

సోమ వారం ( ఇందు వాసరే ),

శ్రీ విళంబి నామ సంవత్సరం,

దక్షిణాయనం,

శరద్ ఋతువు 

కార్తీక మాసం,

బహుళ పక్షం,

తిధి : తదియ ఉ7.04

తదుపరి చవితి/చతుర్థి రా.తె4.54,

నక్షత్రం : ఆర్ధ్ర మ3.12 తదుపరి పునర్వసు, 

యోగం : శుభం రా2.27,

కరణం : భద్ర/విష్ఠి ఉఉ7.04 తదుపరి బవ సా5.59
ఆ తదుపరి బాలువ రా.తె4.54,

సూర్యరాశి : వృశ్చికం,

చంద్రరాశి : మిథునం,

సూర్యోదయం : 6.14,

సూర్యాస్తమయం : 5.20,

రాహుకాలం : ఉ7.30 - 9.00,

యమగండం. : ఉ10.30 - 12.00,

వర్జ్యం : రా2.26 - 3.56,

దుర్ముహూర్తం. : మ12.09 - 12.54 & మ2.22 - 3.07,

అమృతకాలం. : ఉ7.13వరకు,

_నేటివిశేషం_
సంకష్టహర చతుర్థి

Saturday 24 November 2018

ఈ వారం రాశిఫలాలు :నవంబరు 23 శుక్రవారం నుండి నవంబరు 29 గురువారం వరకు



మేష రాశి 
ఈ వారం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. గృహ, వాహన విషయాలు ఒత్తిడి 
ఉండవచ్చు. ఒత్తిడితో ఆలోచనలు పూర్తిచేస్తారు.కొత్త వార్తలు అందుతాయి. లాభాలు 
సంతోషాన్నిస్తాయి. ఊహించని ప్రయోజనాలుటాంయి. ప్రయాణాలకు అవకాశం. సౌకర్యాల వల్ల 
సంతోషం. ఆహార విహారాదులపై దృష్టి ఉంటుది. సహకారం లభిస్తుంది. గౌరవ లోపాలకు 
అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. సంతానం అను


వృషభ రాశి

ఈ వారం భాగస్వాములతో అనుకూలత ఉంటుంది. ఆహార విహారాదులపై దృష్టి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వాగ్దానాల వల్ల ఇ్బంది ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు వచ్చే సూచనలు. సంప్రదింపుల వల్ల ఒత్తిడి. శ్రమ, కాలం ధనం వృథా కాకుండా చూసుకోవాలి. ఒత్తిడితో పోటీల్లో విజయం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. శారీరక ఒత్తిడి ఏర్పడుతుంది.
మిథున రాశి 
ఈ వారం వాక్‌ చాతుర్యం పెంచుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆత్మ విశ్వాసం 
పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. పనుల్లో జాగ్రత్త అవసరం.
 భాగస్వాములతో అననుకూలత. వ్యాపారస్తులు జాగ్రత్త పడడం మంచిది. నూతన పరిచయాల 
వల్ల ఇబ్బందులు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతానం వల్ల సంతోషం. వ్యతిరేక 
ప్రభావాలపై విజయం ఉంటుంది. 


కర్కాటక రాశి 
ఈ వారం అన్ని పనుల్లో పోటీలు ఒత్తిడులు ఉంటాయి. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతోపని చేయాలి. సృజనాత్మకత పెరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకూలం. ప్రయాణాల్లో సంతోషం ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆలోచనల్లో చిత్త చాంచల్యం ఉంటుంది.సంతానం వల్ల సంతోషం. మాటల్లో నిరాశ, నిస్పృహలు ఉంటాయి.విద్యార్థులకు అనుకూల సమయం.


సింహరాశి 
ఈ వారం అన్ని పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రయోజనాలకోసం ప్రయత్నిస్తారు. విహార యాత్రలపై దృష్టి పెడతారు. వ్యతిరేకత ప్రభావాలు ఉంటాయి. నూతన పరిచయాల వల్ల సమస్యలు వచ్చే అవకాశం. విందు భోజనాల్లో పాల్గొటాంరు. సౌకర్యాల వల్ల సంతోషం ఏర్పడుతుంది. శుభవార్తలు వింరు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు కోసం ఆరాటపడతారు. తొందరపాటు పనికిరాదు. చేసే పనుల్లో జాగ్రత్త అవసరం.


కన్యారాశి
 ఈ వారం అధికారులతో అనుకూలతలు ఏర్పడతాయి. పెద్దలతో సంప్రదింపులు ఉంటాయి. భాగస్వాముల సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉంటుంది. పనుల్లో పోటీలు ఎదురైనా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. శ్రమతో పనులు సాధిస్తారు. లాభాలు కోల్పోయే సూచనలు. విశ్రాంతిలోపం ఉంటుంది. మాటలవల్ల గుర్తింపు పెరుగుతుంది.

తులా రాశి:
 ఈ వారం శ్రమతో పనులు పూర్తిచేస్తారు. దూర ప్రయణాలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పనులపై దృష్టి పెడతారు. సంతోషకర వాతావరణం. లాభాలపై దృష్టి ఉంటుంది.

వృశ్చికరాశి
 ఈ వారం వ్యాపార విషయాల్లో శ్రమతో పాటు విజయాన్ని సాధిస్తారు. ఆర్థికాంశాల్లో ఒత్తిడి ఉంటుంది. ఉన్నత విద్యలపై దృష్టి ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది. అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తారు. ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. విందువినోదాలకోసం ఖర్చు చేస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది.

ధనుస్సురాశి
 ఈ వారం ఆధ్యాత్మిక ఖర్చులకు అవకాశం ఉంటుంది. దాన ధర్మాల వల్ల మేలు కలుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది. భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. సహకార లోపాలకు అవకాశం ఉంటుంది. అనుకోని ఇబ్బందులు వుటాంయి. అనుకోని సంఘటనలు ఇబ్బందికి గురి చేస్తాయి. పెట్టుబడులపై దృష్టి ఉంటుంది. మాటల్లో నిరాశ తప్పదు. కీర్తి ప్రతిష్టల్లు ఒత్తిడి ఏర్పడుతుంది.

మకరరాశి ఈ వారం చికాకులు వచ్చే సూచనలు. సంప్రదింపులకు అవకాశం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. చేసే పనుల్లో పోటీలు ఉంటాయి. ఒత్తిడి ఇబ్బంది తప్పకపోవచ్చు. భాగస్వామ్య వ్యవహారాల్లో శ్రమ ఒత్తిడి ఉంటాయి. పరామర్శలకు అవకాశం. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అనారోగ్య సూచనలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి.

కుంభరాశి ఈ వారం తొందరపాటు పనికిరాదు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఉన్నా గుర్తింపు లభిస్తుంది. శ్రమాధిక్యం ఉంటుంది. సామాజిక గౌరవాన్ని పెంచుకుటాంరు.ఆలోచనల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. సంతానంతో జాగ్రత్తగా ఉండాలి. నూతన నిర్ణయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు తప్పక పోవచ్చు. కాలం, ధనంకోల్పోయే సూచనలు. భాగస్వాములతోజాగ్రత్త అవసరం. సంతోషమైన సమయం.

మీన రాశి ఈ వారంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకునే అవకాశం. భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. లాభాల సంతృప్తి ఉండకపోవచ్చు.సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. పెట్టుబడులు పెడతారు. అనుకున్న పనులు సాధించే దిశగా ప్రయాణిస్తారు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. అనుకోని ఇబ్బందులు వచ్చే సూచనలు. ఉన్నత కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. స్నేహానుబంధాలు విస్తారిస్తాయి.


పంచాంగం 24 - 11 - 2018


ఓం శ్రీ గురుభ్యోనమః🙏

శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,

తేదీ .... 24 - 11 - 2018,

శని వారం ( స్థిర వాసరే ),

శ్రీ విళంబి నామ సంవత్సరం,

దక్షిణాయనం,

శరద్ ఋతువు,

కార్తీక మాసం,

బహుళ పక్షం,

తిధి : పాడ్యమి ఉ10.28

తదుపరి విదియ, 

నక్షత్రం : రోహిణి సా5.27

తదుపరి మృగశిర,

యోగం : శివం ఉ10.34

తదుపరి సిద్ధం,

కరణం : కౌలువ ఉ10.28

తదుపరి తైతుల రా 9.54

ఆ తదుపరి గరజి,

సూర్యరాశి : వృశ్చికం,

చంద్రరాశి : వృషభం,

సూర్యోదయం : 6.13,

సూర్యాస్తమయం : 5.20,

రాహుకాలం : ఉ9.00 - 10.30,

యమగండం : మ3.00 - 4.30,

వర్జ్యం : ఉ9.39 - 11.12 & రా10.48 - 12.20,

దుర్ముహూర్తం. : ఉ6.13 - 7.42 & మ12.08 - 12.53,

అమృతకాలం. : మ2.19 - 3.53,

Tip of The Day 24-11-2018

BRASS ITEMS

Good to PLace at SOUTH WEST and SSW to get more creativity in mind and good relationships in the family members.

Thursday 22 November 2018

పడక గదిలో భార్యాభర్తల ఫోటోలు ఉంచాల్సిందే




బహుశా ఫెంగ్ ష్యూ అనే పదానికి అర్థం ఎవరికీ తెలీక పోవచ్చు. ఇది చైనాలో ఓ శాస్త్రానికి పేరు. సుమారు మూడువేల సంవత్సరాలకు పూర్వం ఫ సి అనే ముని ఈ శాస్త్రాన్ని రూపొందించారని వినికిడి. ప్రకృతిలోని వివిధ అంశాలను మానవునికి అనుసంధానం చేసి తన భవిష్యత్‌కు మెరుగులు దిద్దుకునేందుకు రూపొందించిన శాస్త్రమే ఫెంగ్ ష్యూ. ఇది వాస్తు, అలంకరణ, మానవుని జీవన విధానాలపై అనేక నియమ నిబంధనలను రూపొందించి మానవాళికి ప్రసాదించిన శాస్త్రం.
ఈ శాస్త్రంలో నిత్య జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ఎన్నో మెళకువలు, సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పడక గదిలో అయినా ఆఫీసులో అయినా విద్యుత్ పరికరాలను వీలైనంత దూరంలో ఉంచాలి. ఎందుకంటే వాటిలో ప్రసారమయ్యే విద్యుత్ తరంగాలు మీ పని తీరును ప్రభావితం చేస్తాయి.
దీనివల్ల మీరు సక్రమంగా పని చేయలేరు. అందువల్ల వాటిని తగినంత దూరంలో ఉంచాలని ఈ శాస్త్రం చెపుతోంది. అలా వీలుపడని పక్షంలో విద్యుత్ ప్రసారాన్ని అదుపు చేసే ఎమిథిస్ట్ క్లస్టర్ని వాటి దగ్గరగా అమర్చాలి. అలాగే గుమ్మంవైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు. అలా పడుకుంటే శవరూపంగా ఉంటుందని ఈ శాస్త్రం పేర్కొంటోంది
పడక గదిలో భార్యా భర్తలు తమ ఫోటోలను విధిగా పెట్టుకోవాలి. దానితో బాతుల జంట వున్న ఫోటోను కలసి పెట్టుకుంటే ఇంకా మంచిది. బెడ్ రూంలో అక్వేరియం వంటి అధిక నీటి నిల్వ వస్తువులను ఉంచకూడదు. పడక గదిలో ఎన్నడూ వీపును గుమ్మం వైపు ఆనించి కూర్చోరాదు.
పడక గదిలో వస్తువును శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవన్నీ చిందరవందరగా వున్నట్టయితే భార్యా భర్తల సంబంధాలు బలంగా వుండవని భావన. ఎంత డబ్బు అర్జించినా నిలవదు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల పడక గదిలో వస్తువులను అందంగా, శుభ్రంగా అమర్చుకోవాలని ఈ శాస్త్రం చెపుతోంది.

Tip of The day 23-11-2018

Group Discussions can be done at North East or North West to Have Good Clarity and FruitFul Discussions.
Avoid Dark colours and Toilets in these Locations.

కార్తిక పౌర్ణమి....


మాసాలన్నింటిలోనూ పరమపావనమైన కార్తికమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. శివ-విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తిక పౌర్ణమిని శరత్‌ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అనీ పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలోనే కార్తిక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి, సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పూర్ణిమనాడే. దత్తాత్రేయ జన్మదినమూ ఇదే! దేవ దీపావళి, కుమార దర్శనమనీ ఈ పర్వడికి పేర్లున్నాయి. ఈ రోజున ‘రాసలీలా మహోత్సవం’ జరుపుతారు. యోగసిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినమిది.
నేటి సముద్రస్నానం శివారాధన, అభిషేకం, ఉసిరిక, దీపారాధనలకూ విశేషమైన ఫలితాలున్నాయి. శంకరుడు త్రిపురాసురుణ్ని వధించిన విజయోత్సాహానికి సంకేతంగా స్త్రీలు 720 వత్తుల నేతి అఖండ దీపం వెలిగించి భక్తేశ్వర వ్రతం ఆచరిస్తారు. మహిషాసురవధ సం దర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తిక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం. క్షీరసాగర మథనం సందర్భంగా వెలువడిన హాలాహలం మింగి శివుడు లోకసంరక్షణం చేసినందుకు సంతోషంతో ప్రజలు ‘జ్వాలాతోరణోత్సవం’ ఈ శుభదినాన నిర్వహించారు. ఈ రోజున ‘వృషోత్సర్జనం’ అనే ఉత్సవం జరుపుకొంటారు. పితృదేవుల ప్రీత్యర్థం ఒక కోడెదూడను ఆబోతుగా వదులుతారు. ఇలా చేయడం వల్ల గయలో కోటిసార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. శివాలయంలో ఈ రోజున నందాదీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు. ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు.
ఉసిరిక చెట్టు కింద కార్తిక దామోదరుడిగా కీర్తిపొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి, ఉసిరికాయలతో పూజిస్తారు. కొందరు ఈ రోజున తులసిని, వ్యాసుణ్ని ఆరాధిస్తారు. దీపదానం, బిళ్వదళార్చన, ఉపవాసం, జాగరణ, శతలిం గార్చన, సహస్ర లింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకం, వన భోజన సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణం, వెండి, బంగారు, సాలగ్రామం, భూ, గోదానం, అన్నదానాలకు కార్తిక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల్ని అనుసరించి వృషవ్రతం, మహీ ఫలవ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమా వ్రతం, కృత్తికావ్రతం లాంటి వ్రతాలు, నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తుంటారు. శైవ-వైష్ణవాలయాల్లో ఎంతో సభక్తికంగా జరిగే జప, తప, దీపదాన, పూజాదికాలకు అక్షయ ఫలితాలనిచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తిక పౌర్ణమి.