Saturday, 17 November 2018

కార్తీక శుద్ధ అష్టమి .. గోపాష్టమి ..



గో పూజ.. గోపాలునికి ప్రియమైనవి ..
గోవు పేరునే తన పేరుగా చేసుకున్న గో పాలుడు ..
గో సేవ గోపాలుని సేవయే
కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే అష్టమి నాడు గోవుని పూజించాలి ..
మన హిందూ సాంప్రదాయం లో గోవును తల్లి గా భావిస్తాము ..
క్షీరసాగరమదనం నుండి పుట్టినది .. మన సనాతన ధర్మం లో గోవుకి ప్రత్యేక స్థానం ఉంది ..
ఈ రోజు వీలైన వారు గోవు దగ్గర కు వెళ్ళి .. గోవును చక్కగా శుభ్రపరచి స్నానం చేయించి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ పెట్టి పూల దండ వేసి ..
అరటి పండు కొంత ధాన్యం .. పచ్చ గడ్డి వేసి తినిపించి .. నీళ్లు పెట్టి .. గోమాతకు 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే ...
ఈ భూ మండలానికి ప్రదక్షిణలు చేసినంత ఫలితం ఉంటుంది ..
గోవు శరీరం పై ముక్కోటి దేవతలూ కొలువై ఉంటారు ..
కార్తిక శుద్ధ అష్టమి నాడు గోపూజచేసిన వారు సమస్త వ్రతములు చేసినఫలమును పొందుతారు. ...

No comments:

Post a Comment