బహుశా ఫెంగ్ ష్యూ అనే పదానికి అర్థం ఎవరికీ తెలీక పోవచ్చు. ఇది చైనాలో ఓ శాస్త్రానికి పేరు. సుమారు మూడువేల సంవత్సరాలకు పూర్వం ఫ సి అనే ముని ఈ శాస్త్రాన్ని రూపొందించారని వినికిడి. ప్రకృతిలోని వివిధ అంశాలను మానవునికి అనుసంధానం చేసి తన భవిష్యత్‌కు మెరుగులు దిద్దుకునేందుకు రూపొందించిన శాస్త్రమే ఫెంగ్ ష్యూ. ఇది వాస్తు, అలంకరణ, మానవుని జీవన విధానాలపై అనేక నియమ నిబంధనలను రూపొందించి మానవాళికి ప్రసాదించిన శాస్త్రం.
ఈ శాస్త్రంలో నిత్య జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ఎన్నో మెళకువలు, సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పడక గదిలో అయినా ఆఫీసులో అయినా విద్యుత్ పరికరాలను వీలైనంత దూరంలో ఉంచాలి. ఎందుకంటే వాటిలో ప్రసారమయ్యే విద్యుత్ తరంగాలు మీ పని తీరును ప్రభావితం చేస్తాయి.
దీనివల్ల మీరు సక్రమంగా పని చేయలేరు. అందువల్ల వాటిని తగినంత దూరంలో
ఉంచాలని ఈ శాస్త్రం చెపుతోంది. అలా వీలుపడని పక్షంలో విద్యుత్ ప్రసారాన్ని
అదుపు చేసే ఎమిథిస్ట్ క్లస్టర్ని వాటి దగ్గరగా అమర్చాలి. అలాగే గుమ్మంవైపు
కాళ్ళు పెట్టి పడుకోకూడదు. అలా పడుకుంటే శవరూపంగా ఉంటుందని ఈ శాస్త్రం
పేర్కొంటోంది
పడక గదిలో భార్యా భర్తలు తమ ఫోటోలను విధిగా పెట్టుకోవాలి. దానితో బాతుల జంట వున్న ఫోటోను కలసి పెట్టుకుంటే ఇంకా మంచిది. బెడ్ రూంలో అక్వేరియం వంటి అధిక నీటి నిల్వ వస్తువులను ఉంచకూడదు. పడక గదిలో ఎన్నడూ వీపును గుమ్మం వైపు ఆనించి కూర్చోరాదు.
పడక గదిలో వస్తువును శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవన్నీ చిందరవందరగా వున్నట్టయితే భార్యా భర్తల సంబంధాలు బలంగా వుండవని భావన. ఎంత డబ్బు అర్జించినా నిలవదు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల పడక గదిలో వస్తువులను అందంగా, శుభ్రంగా అమర్చుకోవాలని ఈ శాస్త్రం చెపుతోంది.

No comments:
Post a Comment