Wednesday, 7 November 2018

బలి పాడ్యమి



కార్తీక శుద్ధ పాడ్యమి రోజున హిందువులు బలి పాడ్యమి  గా జరుపుకుంటారు.
పాడ్యమి రోజు ఉదయాన పంచవర్ణముతో బలిని నిర్మించాలి. తెల్లని బియ్యంతో పరివారాన్ని నిర్మించాలి. ఆ మీద పూజ చేయాలి. బలిని ఉద్దేశించి యధాశక్తి దానాలు చేయాలి.

బలి ప్రార్థన

బలిరాజ నమస్తుభ్యం
విరోచన సుతప్రభో
భవిష్యేంద్ర సురారాతే
పూజేయం, ప్రతిగృహ్యతాం
ఈ పండుగ ఐదు రోజుల దీపావళి పండుగలో నాలుగవది.. మొదటిది.. ధన త్రయోదశి.. రెండవది.. నరక చతుర్థశి.. మూడవది దీపావళి.. నాలుగవది బలి పాడ్యమి.. అయిదవది యమ విదియ(భగినీ హస్త భోజనాలు).. ఇక బలి పాడ్యమి మన రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకోము.. దీనిని కేరళ రాష్ట్రంలో బాగా జరుపుకుంటారు...
బలి చక్రవర్తి వామనుడి కి మూడు అడుగుల స్థలాన్ని దానం చేసిన రోజు... బలి చక్రవర్తి రాక్షసుడైనప్పటికీ జనరంజక మైన పాలనను అందించాడు.. అతని హయాంలో ప్రభుత్వం సుపరిపాలన కొనసాగించిందని.. అతని దానగుణం చెప్పలేని దనీ.. ప్రతీతి... అందుకే అతి దానంవలన అహంకారం ప్రబలి దేవేంద్ర పదవి పొందేందుకై దేవతలను హింసించివారిని హింసించాడని... వారిని రక్షించుటకై శ్రీ మహా విష్ణువు.. విశ్వజిత్ యాగం చేస్తున్న సమయంలో మూడు అడుగుల నేలను దానమడిగి.. భూగోళం ఆకాశం.. మూడు దిక్కులు ఆక్రమిస్తాడు...
భూమి గోళాకారంలో ఉంది అనేది ఎప్పుడో ధృవీకృతమైనదనేందుకు ఇదొక ఆధారం.. మూడు దిక్కులు ఆక్రమించిన త్రివిక్రమునకు నాలుగో దిక్కున పాదం మోపే అవకాశం లేకపోయింది.. అదే పాతాళం... (ప్రస్తుత అమెరికా) .. శ్రీ మహావిష్ణువు ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిదవ మన్వంతరం (అంటే కలియుగం అయిపోయిన తర్వాత) బలి చక్రవర్తిని యుగ పురుషునిగా చేస్తానని మాట ఇచ్చినట్లు పురాణ వృత్తాంతం.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371




No comments:

Post a Comment