'త్రిపురత్రయం' లో రెండవ శక్తి స్వరూపిణి ఈ తల్లి. అందుకే శరన్నవరాత్రులలో వచ్చే పంచమిని 'లలిత పంచమి' అని కూడా అంటారు.
చెరకుగడ, విల్లు, పాశము,
అంకుశము ధరించి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ
లలితా పరాభట్టారిక భక్తుల ఇక్కట్లు తొలగించి, అప్లైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
కన్యలుమంచి భర్త కొరకు, ముత్తైదువులు దీర్ఘ సుమంగళి గా అఖండ సౌభాగ్యం కొరకు ఈ
నవరాత్రులలో అయిదవ రోజు 'ఉపాంగ లలితా వ్రతం' ఆచరిస్తారు.
అమ్మవారిని శ్రీ లలితా దేవి అలంకారం లో సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమ పూజలు చేసి, ముత్తైదువలకు తాంబూలాలు ఇచ్చుకుంటారు.
ముత్తైదువులను పిలిచి సువాసినీ పూజలు చేస్తారు. కొంతమంది తమ
గృహాల్లోనే సామూహిక లక్ష కుంకుమార్చనలు ఏర్పాటు చేసుకుంటారు.
బొమ్మలకొలువులు పెట్టుకున్న వారు పేరంటాలు చేసుకుంటారు. శ్రీ లలితా దేవి తనని కొలిచిన
భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుంది. కుంకుమ పూజలు సలిపే వారికి మాంగళ్య
సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.
పంచమి నాడు శ్రీ లలితాదేవి దేదీప్యమైన మూర్తిని
మనస్సులో ప్రతిష్టించుకుని, 'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమః' అని వీలైనన్ని సార్లు
జపించుకుంటే అమ్మ మాతృమూర్తి యై చల్లగా చూస్తుంది.
ఈనాడు ధరించవలసిన వర్ణం: తెలుపు. ఈనాటి నివేదనలు: పులిహోర, పెసర బూరెలు.
No comments:
Post a Comment