Saturday, 7 October 2023

అష్టాదశ శక్తిపీఠాలు

 



అష్టాదశ శక్తిపీఠాలు🙏


🙏శక్తిపీఠాలు అత్యంత ప్రాముఖ్యత గల దేవీ ఆలయాలు. సనాతన భారతీయ సంప్రదాయానికిప్రతీకలైన అష్టాదశ శక్తి పీఠాలు భక్తులకు కొంగు బంగారమై విలసిల్లుతున్నాయి. శక్తి పీఠాల ఆవిర్భావం గురించి అనేక కథనాలున్నాయి.🙏


శక్తి పీఠాల ఉద్భవం వెనుక ఒక విషాధ గాథ ఉన్నట్లు మన పురాణాల్లో తెలుపుతున్నాయి.


బ్రహ్మ దేవుడి కుమారులలో దక్షప్రజాపతి ఒకరు. అతనికి యాబై మూడు మంది కుమార్తెలుండేవారు.


వారిలో చంద్రునికి ఇరవై ఏడు గురిని, కశ్యప మహర్షికి పదమూడు మందని, దుర్ముణకు పది మందిని, పితురులకు ఒకరిని, అగ్నికి ఒకరిని ఇచ్చి వివాహం చేసారు.


సతీదేవి మాత్రమే మిగిలింది. కాగా దేవికి చిన్నతనం నుంచే శివుడంటే అపారమైన భక్తి. కానీ దక్షడు ఈశ్వరునికి సతీదేవిని ఇచ్చి వివాహం జరిపించుటకు ఇష్టపడలేదు.


అయినప్పటకీ పార్వతీ దేవి తండ్రి మాటను జవదాటి పరమేశ్వరున్ని పెళ్ళాడింది. దీంతో దక్షప్రజాపతికి శివునిపై మరింత కోపాన్ని పెంచుకున్నాడు.


ఒకరోజు దక్షుడు బృహస్పతియాగం చేసాడు. ఆ కార్యక్రమానికి దేవతలందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు. అయినా పార్వతీ దేవి పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది.


కానీ అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.


సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు.


దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.


సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తు0ది

1. శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

*2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.                                                                                                     *3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.                                                                      *4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.                                                                                                                   *5. జోగులాంబ - ఆలంపూర్ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.

*6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

*7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

*8. ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.

*9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

*10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

*11. గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.

*12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

*13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

*14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

*15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

*16. మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

*17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.

*18. సరస్వతి - జమ్ము, కాశ్మీర్ - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.
సర్వే జనా సుఖినోభవంతు..!శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment