Friday, 18 January 2019

పారిజాత వృక్షం


పారిజాత వృక్షం గురించి తెలియని వారుండరు. ఈ వృక్షం పేరు చెప్పగానే వెంటనే అందరికి గుర్తుకొచ్చే పేర్లు ఏవంటే శ్రీకృష్ణుడు,సత్యభామ. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తీసుక వచ్చి సత్యభామకు ఇచ్చాడని నానుడి ఉంది. శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లా, కింటూర్ అనే గ్రామంలో ఉంది.  ఈ పారిజాత వృక్షాన్ని ఇప్పడు కూడా భక్తులు చూడవచ్చు. ఈ మహా వృక్షాన్ని ప్రపంచంలోని వృక్ష శాత్రవేత్తలు పరిశీలించి, ప్రపంచంలోనే విలక్షణమైన వృక్షంగా దీనిని గుర్తించారు.

ఈ వృక్షానికి సంబంధించి కొన్ని పురాణ కథలు కూడా  ఉన్నాయి
  • కింటూర్ గ్రామం బారాబంకి పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ గ్రామాన్ని మొదట 'కుంతి' అని పిలిచేవారు. 'కుంతి' పాండవుల తల్లి. మహాభారత కాలంలో కుంతి దేవి ఒక శివాలయాన్ని ఈ ఊరిలో నిర్మించుకొని అక్కడే ప్రాణాలను విడిచిందట అలా ఆవిడ చితాబస్మం నుంచి పారిజాత అనబడే వృక్షం పుట్టుకొచ్చిందని అక్కడి వారి భావన.
  • మరో కథనం ప్రకారం అర్జునుడు స్వర్గం నుండి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చాడని, కుంతీ దేవి ఈ పారిజాత పుష్పాలను తెంపుకొని శివుడికి పూజలు చేసేదని మరోక వాదన
  • శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రలోకం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చి సత్యభామకు బహుకరించాడు. దీనిని దొంగిలించడానికి ప్రయత్నించే శ్రీకృష్ణుడు కష్టాలలో పడతాడు. ఆ కథే పారిజాతాపహరణం.
             
              ఈ పురాణ కధనాలు నిజమో కాదో తెలీదు గానీ ఈ వృక్షం మాత్రం పురాతమైనదని చెప్పడం మాత్రం ఖచ్చితం. దీని వయస్సు సుమారు ఐదు వేల సంవత్సరాలకు పైగానే ఉండవచ్చని వృక్ష శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ప్రపంచంలోని ఏ చెట్టుకూ లేని ప్రత్యేకత ఈ చెట్టుకు ఉంది. ఆ ప్రత్యేకతలు ఏమిటంటే... ఈ వృక్షం పునరుత్పత్తి గానీ, పండ్లు గానీ ఉత్పత్తి చేయదు. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు ఎలా ఉంటాయంటే చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా ఎంతో అందంగా బంగారు, తెలుపు రంగు కలిసిన వర్ణములో ఉంటాయి. 
           పారిజాత పుష్పం ఈ చెట్టుకు పుష్పాలు ఎప్పుడు పడితే అప్పుడు వికసించదు. ఇది కేవలం జూన్/ జులై నెలలో మాత్రమే వికసిస్తుంది. ఈ పుష్పాల సువాసనలు చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. వృక్షం యొక్క ఎత్తు 45 అడుగులు, చుట్టుకొలత 50 అడుగులు గా పేర్కొనటం జరిగింది. వృక్షం గొప్పతనం ఏమిటంటే, దీని శాఖలు గానీ, ఆకులు గానీ కుచించుకుపోయి కాండంలో కలవడమే తప్ప ఎండిపోయి రాలటం మాత్రం జరగదట. ఇది నిజమేనని అక్కడికెళ్లిన భక్తులు కూడా చెప్పుతుంటారు. ఆ చెట్టు వద్ద ఆకులు గాని..పుష్పాలు గాని కింద రాలినట్లు అసలు కనిపించవని వారు తెలుపుతారు.

No comments:

Post a Comment