Tuesday 26 December 2023

శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా..

 



🌿గోముఖ శంఖాన్ని  ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని  ఇల్లు అంతా చల్లుతారు. 

🌸ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. 

ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి.

🌿విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నాసహోదరి అని చెప్పిన సందర్భాలు కలవు. 

🌸దేవి యొక్క పాదాలు వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. 

ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్తాపించాలి. 

🌿గణేష్ శంఖాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు. 

🌸అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. 

మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. 

చిన్న శంఖ మాలలను ధరించి కూడా అనేక సిద్ధులను పొందుచున్నారు. 

🌿శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. 

శంఖ బస్మము వల్ల అనేక రోగాలు నయము అగుచున్నవి. 

🌸ఋషి శృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. 

🌿శంఖాన్ని పూరించుట వల్ల శ్వాసకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోర్కెలు తీరును. ఈ శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి. 

🌸శంఖము పాపనాశిని 

ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు 

శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము.

🌷కొన్ని శంఖాల వివరణ:-🌷

🌿దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. 

ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. 

🌸దక్షణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. 

పాంచజన్యం పురుష శంఖం ఇది దొరుకుట కష్టం. 

🌿శని శంఖాలకు నోరు పెద్దది పొట్ట చిన్నది. 

రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. 

రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. 

ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. 

వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. 

🌸కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, 

పంది ఆకారంలో ఉంటాయి. 

శంఖాలు ఎక్కువుగా రామేశ్వరం, 

కన్యాకుమారి, మద్రాసు, 

విశాఖపట్నం  కలకత్తా, బొంబాయి మరియు  పూరీలో ఎక్కువుగా దొరుకుచున్నవి.

🌹సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్! 🌹

🌿హృదయము నందు పరమాత్ముని యొక్క దివ్య నామమును, గాధలను స్మరించడము స్మరణ భక్తీ అందురు. 

పరమాత్ముని యొక్క అఖండ నామములను 

అఖండ రీతిన నిత్యము నియమము తప్పక నిరంతరముగా నామ స్మరణ చేయవలెను.

🌸నామస్మరణము వలన మనస్సుకు శాంతి, సమాధానము దొరుకును. 

ఆనంద సమయమున, 

దుఖ సమయమున, 

ఆపద సమయమున, 

ఉద్వేగ సమయమున, 

చింతా సమయమున, 

ఇంతయేల సర్వ కాల సర్వావస్థల యందు భగవన్నామ స్మరణము చేయ వలెను. 

🌿నడుచుచు, మాటలాడుచు, 

తినుచు, త్రాగుచు, సుఖించుచు, 

బహు విధముల భోగములను 

తనివి తీర అనుభవించుచున్నప్పుడు కూడా ఏమరపాటు లేకుండా శ్రీహరి నామమును స్మరించు చుండవలెను. 

🌸సంపదలతో తుల తూగుచున్నప్పుడు, 

ఆపదలలో మునిగి తేలుచున్నప్పుడు, 

కాలగతులు వ్యతిరేకించి, 

చిక్కులు వాటిల్లి నప్పుడు కూడా శ్రీహరి నామ స్మరణ మానరాదు. 

🌿భగవన్నామ స్మరణకు ఇది సమయం, ఇది సమయం కాదు అనేది లేదు, సర్వ కాల సర్వావస్థల యందు శ్రీహరి నామ స్మరణ చేస్తూనే ఉండవలెను. 

వైభవము, సామర్ధ్యము, బలము, ధనము, కీర్తి గలిగిన సమయము లందు కూడా భగవన్నామ స్మరణ చేయవలెను. 

🌸భగవంతుని నామమును నిరంతరము హృదయము నందు తలుచు భాగ్యవంతునికి ఆపదలు దరిచేరవు, అంత్యమున సద్గతి కలుగును. 

రోగ భాధలు యందు ఊరట లభించి శాంతి చేకూరును. 

🌿రామ నామ మహత్వము చేతనే కాశీనగరమునకు 

ముక్తి క్షేత్రమను నామము కల్గినది. 

వాల్మీకి "మరా, మరా, మరా"... అని జపించి  ముక్తి నొందినాడు. 

🌸ప్రహ్లాదుడు శ్రీహరి నామము జపించి ముక్తి నొందినాడు. పాపియగు అజామిలుడు సైతము నారాయణ స్మరణము వలననే పవిత్రుడు అయి మోక్ష గామి అయినాడు.

🌿పరమేశ్వురుని నామములు అనంతములు. 

వానిని నిత్యమూ నియమ బద్దముగా హృదయము నందు స్మరించుచు భక్తులు తరించెదరు. 

మహా పాపులు కూడా నామస్మరణ చేత పరమ పవిత్రులై మోక్షము నొందిరి.

🌸నిరంతరము శ్రీహరి నామము గావించు వాడే పుణ్యాత్ముడు. 

నామ స్మరణ వలన పాపములు నశించి సుకృతము పొందును. 

అన్ని వర్ణముల వారికినీ నామస్మరణ యందు అధికారము కలదు. ఇదియే స్మరణ భక్తీ.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment