Friday, 22 December 2023

చిదంబర రహస్యం

 



8 సంవత్సరాల పరిశోధన  తరువాత R&D వాళ్ళు మరియు విదేశీ శాస్త్రవేత్తలు కలిసి నిర్ణయించిన విషయం ఏంటంటే నటరాజుని బొటనవేలు ప్రపంచానికి అయస్కాంత శక్తి లో మధ్యభాగం గా నిరూపణ చేశారు.

పురాతన తమిళ పండితుడు తిరుమూలర్ ఇదే విషయాన్ని 5000 సంవత్సరాల కిందనే నిరూపణ చేశారు.

ఆయన మాటల్లో తిరుమందిరం అనేది ప్రపంచానికి సైన్స్ ప్రకారం కూడా ఒక దారి చూపించే దిక్సూచి గా చెప్పారు.

ఆయన చేసిన వర్ణనలు అర్థం చేసుకోవాలంటే ఒక 100 సంవత్సరాలు పడుతుంది.

చిదంబరం కు సంబందించిన వివరాలు చూస్తే

1)ఈ దేవాలయం ప్రపంచ అయస్కాంత శక్తికి సెంటర్ పాయింట్ లో ఉంది.

2)'పంచ భూత"అనే దేవాలయాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.

A)చిదంబరం అనేది ఆకాశ తత్వం గా,

B) కాళహస్తి దేవాలయం గాలి అనే తత్వంగా

C) కంచి ఏకాంబరేశ్వరుడు భూమి తత్వం గా,

పై  దేవాలయాలు ఒకటే లైన్ లో 79 డిగ్రీ లో 41 నిమిషాల లాంగ్టిట్యూడ్ లో ఉంటాయి.ఇది మీకు గూగుల్ లో కూడా దొరుకుతుంది.అద్భుత దృశ్యం తో కనపడుతుంది.

3)మన దేహంలోని 9 మార్గాలు 9 దారులను సూచిస్తుంది.

4)ఈ దేవాలయం 21,600 బంగారు పలకల తో చేశారు అది మానవ దేహంలోని 21,600 ఉఛ్వాస-నిచ్వాస లకు ప్రతీక.

5)ఈ 21,600 బంగారు పలకలు గోపురం మీద ఫిక్స్ చేయడానికి 72,000  బంగారు గొర్లను వాడారు. ఇవే మానవ దేహంలోని నాడీ వ్యవస్థ ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి  ఇవి మనకు కనపడకుండా వాటి పని అవి చేస్తాయి

6)తిరుమూలర్ గారు ప్రతి మనిషి శివలింగానికి ప్రతినిధి అని చెప్తున్నారు,దానికి ప్రతినిధి చిదంబరం,దానికి ప్రతినిది సదాశివం ఆయన నాట్యం.

7)పొన్నాంబలం అనేది ఈ దేవాలయానికి ఎడమ పక్కగా ఉంటుంది. అంటే మనకు గుండె ఉండే ప్రాంతం, అది మన గుండె ను సూచిస్తుంది.దీనికి చేరుకోవాలంటే 5 మెట్లు ఎక్కాలి వీటినే పంచట్శర పడి అనగా "సి వా య న మ"అనే పంచాక్షరీ మంత్రాలుగా చెప్పబడింది

4 పిల్లర్లు ఉన్న కనగసభ అనేది 4 వేదాలకు ప్రతీకలుగా సూచిస్తుంది.

8)పొన్నాంబలం కు వుండే 28 పిల్లర్లు28 శివపూజా పద్ధతులకు సూచికలు,ఈ 28 పిల్లర్ లకు సపోర్ట్ గా 64+64 పైభాగానికి చెందిన బీములు సూచికగా అవే 64 కళలకు ప్రతీకగా ఉన్నాయి.అడ్డుగా ఉన్న బీమ్ లు మానవ శరీరం లోని రక్త  నాళాలు గా సూచిస్తున్నాయి.

9)రూఫ్ పైన ఉండే 9 కళశాలు 9 రకాల శక్తులకు సూచికగా చూపిస్తుంది.అర్ధ మండపం లోని 6 పిల్లర్ లు 6 శాస్త్రాలను,సహ మండపం లోని 18 పిల్లర్లు 18 పురాణాలకు ప్రతీకలుగా ఉన్నాయి.

10) నటరాజు చేసే నృత్యం విశ్వనాట్యం గా విదేశీ శాస్త్రవేత్తలు వర్ణిస్తారు.

ఇప్పుడు సైన్స్ ఏదైతే చెప్తుందో దాన్ని కొన్ని వేలసంవత్సరాల క్రితమే హిందు ధర్మం చెప్పింది. ఇది ఒక మతం కాదు జీవన విధానం.


హరహర మహాదేవ.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment