Thursday 28 December 2023

సాక్షాత్ పరమేశ్వరుడే స్వయంగా తన శివలింగాన్ని తానే ప్రతిష్ఠించుకొన్న శివలింగమే తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వరుడు .




🙏ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా , పరమశివుడు తనలోని తపఃశక్తిని ఇక్కడి శివలింగం నందు ప్రవేశపెట్టాడని అందువల్ల ఇక్కడి శివలింగం స్వయంభువు లింగమని పురాణాలు చెబుతున్నాయి.

సృష్టి మొదలయ్యినప్పుడు బ్రహ్మ దేవుడు రూపొందించిన సువర్ణ కలశం మొదట భూమిపై తాకిన ప్రదేశమే కుంభకోణం క్షేత్రం . అందువల్లే ఈ క్షేత్రాన్ని అతి పవిత్రమైన ప్రాంతంగా హిందూ పురాణాల్లో పేర్కొంటారు. అటువంటి కుంభకోణం దగ్గర్లోనే తిరువిడైమరుదూర్ అనే పుణ్యక్షేత్రం ఉంది.

ఇక ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్లు మనకు కనిపిస్తాయి. తిరువిడైమరుదూర్ ఆలయం ప్రాంగణంలో ఉండే మద్ది చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచి శుభాలు జరుగుతాయి. 

ఇటువంటి మద్ది చెట్లు కేవలం మధ్యార్జునం , శ్రీశైలంలో మాత్రమే ఉన్నాయి. 

ఈ ఆలయం పక్కనే భారత దేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబిక దేవి ఆలయాన్ని కూడా ఇక్కడే విరాజిల్లుతుంది.

ఇక ఈ దేవాలయానికి చుట్టూ నాలుగు దిక్కుల్లో నాలుగు దేవాలయాలు ఉన్నాయి. 

అవి తూర్పు వీధిలో విశ్వనాథుడు, పడమట ఉన్న బుుషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఉన్న ఆత్మనాధుడు, వీధిలో ఉన్న చొన్ననాధుడు. 

ఇంతటి విశిష్టమైన దేవాలయంను ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు.

ఈ క్షేత్రంలోని మహాలింగేశ్వరస్వామిని భక్తితో ప్రదక్షిణ చేస్తే ఎటువంటి మానసిక బాధలైనా

తొలిగిపోతాయని స్థల పురాణం తెలుపుతుంది . 

వివాహం, సంతానం కావాల్సిన వారు ఎక్కువ మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు.

ఈ క్షేత్రంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు . ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుందని చెబుతారు. ఇందుకు సంబంధించి  ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారి పాండ్య రాజు వరుగుణ పాండ్యన్ అడవిలో వేటకి వెళ్లి , తిరిగి వచ్చే సరికి చీకటి పడుతుంది. ఆ చీకట్లో అతని గుర్రం ఒక బ్రాహ్మణుడి మీదుగా వెళ్లి అతని చావుకు కారణమవుతుంది. దీంతో  అతనికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది.  శివ భక్తుడైన పాండు రాజు శివుడిని ప్రార్తించగా .. పరమ శివుడు కలలో కనిపించి తిరువిడైమరుదూర్ క్షేత్రంలోని శివలింగాన్ని దర్శించుకోవాల్సిందిగా సూచిస్తాడు. దీంతో రాజు తిరువిడైమరుదూర్ వెళ్లి  తూర్పు ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తాడు. 

అతన్ని అన్ని చోట్లకు వెంటాడుతున్న బ్రహ్మహత్యా దోషం పవిత్రమైన శివాలయంలోకి రాలేక తూర్పు ద్వారం వద్దనే ఉండి పోతుంది. ఇక రాజు శివుడిని ఆరాధించిన తర్వాత అదే ముఖద్వారం నుండి బయటకు వస్తుండగా ..వచ్చిన తూర్పు ద్వారం నుంచి కాకుండా  మరో ద్వారం గుండా బయటకు వెళ్లమని ఆశరీరవాణి సూచించడంతో రాజు అలాగే చేస్తాడు. దీంతో 

ఇప్పటికీ ఆ బ్రహ్మహత్య దోషం అక్కడే ఉందని లోనికి వెళ్లిన వారు ఎవరైనా ఈ ద్వారం గుండా వస్తే  బ్రహ్మహత్య దోషం వారికి చుట్టుకుంటుందని చెబుతారు.

ఈ పవిత్రక్షేత్రానికి మధ్యార్జునం అని కూడా పేరు ఉత్తరంలో ఉన్న శ్రీశైల మల్లికార్జునిడికి, దక్షిణాన ఉన్న తిరుపుట్టైమరుదూరుకు మధ్యన ఉండటం వల్ల  ఈ క్షేత్రాన్ని మధ్యార్జునం అని పిలుస్తారు. 

అర్జునం అంటే మద్ది చెట్టు. ఈ మూడు క్షేత్రాల్లో మాత్రమే అత్యంత అరుదైన మద్దిచెట్లు దర్శనమిస్తాయి. 

ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి తెల్లని మద్దిచెట్లు కనపడవు . ఇక ఈ ఆలయం పక్కనే మనకు 

భారత దేశంలో అత్యంత మహిమాన్విత ఆలయాల్లో ఒకటిగా చెప్పబడే మూకాంబిక అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. అమ్మవారు పద్మాసనంలో కూర్చొన్న స్థితిలో మనకు కనిపిస్తుంది. మూకాసురుణ్ణి చంపడం వల్ల వచ్చిన బ్రహ్మ హత్యా దోషం పోవడానికి ఇక్కడ తపస్సు చేసినట్లు

స్థలపురాణం చెబుతుంది. కర్నాటకలోని మూకాంబిక దేవి ఆలయం వలే ఈ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యం కలిగినది. ఈమెను చాలా శక్తికల దేవతగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ హత్య దోషం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతే కాకుండా  పిల్లల కోసం, సుఖ ప్రసవం కోసం ఈ దేవిని స్థానిక భక్తులు పూజిస్తారు. కాబట్టి , సృష్టి మొదలయినప్పుడు  భక్తులు సేవించుకోవటానికి పరమ శివుడు ఈ లింగాన్ని సృష్టించి, ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి 

తాను తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని ,

పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడంటే అది ఎంతటి 

మహాద్భుత లింగమో పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి , ఎంతో ప్రాముఖ్యత గల ఈ పుణ్య క్షేత్రంలోని మహాలింగేశ్వరున్ని దర్శించుకొన్నవారికి  కోరుకున్న కోరికలు నెరవేరగలవని శాస్త్ర వచనం 

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment