🌺 స్వామి వారు ఎదురుగా వచ్చే భక్తులను చూడకుండా అమ్మవారితో ఏదో రహస్యంగా చెప్తున్నట్టు గా ఉంది కదూ....!
🌺 అలా ప్రక్కకు తిరిగి ఎందుకు వుంది అని మీకు అనుమానం ఎప్పుడూ కలగలేదా ???
🌺 ఏమై ఉంటుందొ తెలుసా... ??? జాగ్రత్తగా వినండి అయితే...
🌺 శ్రీ వెంకటాచల మహత్యం ని అనుసరించి కలియుగంలో శ్రీవారు ఆదివరాహా స్వామి వారికి ఒక వరం ఇచ్చి ఉన్నారు..
🌺 ప్రధమ పూజ, ప్రధమ నైవేద్యం, ప్రథమ దర్శనము 🌺
🌺 అంటే వరాహ స్వామి వారికె ప్రథమ పూజ చేస్తారు, ముందుగా ఆయనకే నైవేద్యం సమర్పిస్తారు, ఆయన కే ప్రధమ దర్శనం.
🌺 వైఖానశ ఆగమ శాస్త్ర ప్రకారం, శ్రీ వెంకటాచల మహత్యంలో తెలిపిన క్షేత్ర మహత్యం లో క్షేత్ర నియమం ప్రకారం...
🌺 తిరుమల వెళ్లే ముందు ప్రతి భక్తుడు... ముందుగా పుష్కర స్నానం చేసి, వరాహ స్వామి దర్శనాన్ని చేసుకొని, ఆ స్వామి అనుమతితో మాత్రమే ఆనంద నిలయం లో ఉన్న శ్రీవారి దర్శనం చేసుకోవాలి. 🌺
🌺 ఇది తిరుమల యొక్క క్షేత్ర సంప్రదాయం:
🌺 శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం... ముందు తల్లి ప్రదానం, తర్వాత గురువు... ఆ తర్వాతే భగవంతుడు. కావున... ముందుగా అలివేలు మంగాపురం లో వెలసివున్న అమ్మవారి దర్శనం చేసుకుని, తిరుమల చేరుకుని పుష్కరిణి లో స్నానం చేసి.. జ్ఞానాపిరాన్ ( గురువు) గా పిలవబడే ఆది వరాహ స్వామి వారి దర్శనం చేసి వారి అనుమతితో మాత్రమే శ్రీనివాస పరబ్రహ్మ దర్శనానికి వెళ్లాలి . ఇది క్షేత్ర నియమం మరియు తిరుమలలో స్వామి దర్శనం చేసుకునే క్రమం.
🌺 బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటలలో లో చెప్పాలి అంటే వెంకటేశ్వర స్వామి... ఆ వరాహ స్వామి వారికి ఇచ్చిన వరం " నిను చూడక నను చూసినా, నన్ను చూసి నిన్ను చూసినా... నేను వారిని చూడను" అని అన్నారు అట.
🌺 ఇప్పుడు ఆ విగ్రహం ఎందుకు అలా ఉందొ తెలుసుకుందాం 🌺
🌺 అయ్యవారు, అమ్మవారు రహస్యంగా మంతనాలు చేస్తూ మాట్లాడుకుంటూ..." లక్ష్మీ... ఈ భక్తుడు ముందుగా నీ దర్శనం చేశాడా, చేసాడు స్వామి అని అమ్మవారి సమాధానం చెప్పిన తర్వాత... ఒకవేళ నీ దర్శనం చేస్తే... పుష్కర స్నానం చెయ్యడం నేను చూసాను (మనం స్వామి పుష్కరిణి లో స్నానం చేశామా లేదా అని ఆయన గమనించడానికే స్వామి కంటి కి ఎదురుగా పుష్కరిణి ఉంటుంది ), పద్ధతి ప్రకారం ముందుగా ఇక్కడ నా దర్శనానికి వచ్చి క్షేత్ర సంప్రదాయ నియమాలను పాటించాడు కనుక, ఆనంద నిలయం లో స్వామి వక్షస్థలం లో కూడా ఉండే నువ్వు... నా మాటగా ఆ శ్రీనివాసుడి తో చెప్పి... ఈ భక్తుడి సమస్త ఇతిబాధలు తీర్చి, కోరిన కోరికలు తీర్చమని చెప్పు."... అని తన భార్య చెవిలో మన గురించే రహస్యంగా చెప్తున్నారు ఆ ఆదివరాహ స్వామి వారు.
🌺 కావున తిరుమలకు దర్శనం కి వెళ్లి వచ్చాము అని మనం గొప్పగా చెప్పుకోవడం కాదు ప్రదానం..
నా భక్తుడు నా కొండకి , నేను చెప్పిన విధానం లో వచ్చి దర్శనం చేసుకున్నాడు అని ఆ స్వామి ఆనందంతో అనుకునేలా చెయ్యాలి మన తిరుమల యాత్ర.
🌺 కావున తిరుమల యాత్ర లో ప్రతి చిన్న విషయంలో ఆ స్వామి గమనిస్తూ ఉంటాడు. భక్తి భావన తో మాత్రమే స్వామి కి దగ్గరగా వెళ్లగలం.
🌺 ఇది ఆ వరాహస్వామి విగ్రహం అలా పక్కకి తిరిగి, అమ్మవారి తో ఎదో చెప్తున్నటు ఉండడానికి వెనుక ఉన్న అసలు కథ.
🙏అందరికి ఆ శ్రీనివాస పరబ్రహ్మ కటాక్షం కలుగుగాక 🙏
No comments:
Post a Comment