ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషి: శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్ధం ఆయురా రోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం సీతా రామచంద్ర ప్రీత్యర్ధం హనుమద్భడబానల స్తోత్ర జప మహం కరిష్యే ||
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిక్మండల యశోవితాన ధవళీ కృత జగత్రయ వజ్ర దేహ రుద్రావతార లంకాపురి దహన ఉమా అనల మంత్ర ఉదధి బంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయు పుత్ర అంజనీ గర్బసంభూత శ్రీ రామ లక్ష్మణా నందకర కపి సైన్య ప్రాకార సుగ్రీవసాహా య్యకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మ చారిన్ గంభీరనాథ సర్వపాపనివారణ సర్వ జ్వరోచ్చాటన డాకినీ విద్వంసన ||
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా వీరాయ సర్వ దు:ఖ నివారణాయ గ్రహ మండల సర్వ భూత మండల సర్వ పిశాచ మండలోచ్చాటన భూత జ్వరైకాహిక జ్వర ద్వ్యాహిక జ్వర త్ర్యాహిక జ్వర చాతుర్ధిక జ్వర సంతాప జ్వర విషమ జ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది బింది బింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ
ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌమ్ హ్రః ఆం హాం హాం హాం ఔమ్ సౌమ్ ఏహి ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే శ్రవణ చక్షుర్భూతానం శాకినీ డాకినీ విషమ దుస్తానాం సర్వ విషం హార హార ఆకాశం భువనం భేదయ భేదయ చేదయ చేదయ మారాయ మారాయ సోషయ సోషయ మోహాయ మోహాయ జ్వాలాయ జ్వాలాయ ప్రహారాయ ప్రహారాయ సకల మాయం భేదయ భేదయ
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా హనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ బంధన మోక్షం కురు శిరః శూల గుల్మ శూల సర్వసూలాన్ నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాలియాన్ యక్షకుల జలగత బిలగత రాత్రిమ్చర దివాచర సర్పా న్నిర్విశం కురు కురు స్వాహా రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిధ్యాన్ చ్చేదయ చ్చేదయ స్వమంత్ర స్వయంత్ర స్వ విద్యా ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశత్రూన్నాశయ నాశయ అసాధ్యం సాదయ సాదయ హుం ఫట్ స్వాహా ||
ఇతి విభీషణకృత హనుమత్ బడబానల స్తోత్రం సంపూర్ణం
రావణాసురిడి సోదరుడు విభీషణ విరచితం ఈ హనుమత్ బడబానల స్తోత్రం. హనుమంతుని శక్తి స్తుతిస్తూ మొదలయ్యి, అన్ని రుగ్మతల నుండి, అనారోగాల నుండి శత్రువుల నుండి కాపాడమని వేడుకుంటూ భయాల నుండి ఇబ్బందుల నుండి, సర్వారిష్టాల నుండి విముక్త లని చేయమని కోరుతూ చివరగా స్వామి వారి ఆశీస్సులు, ఆరోగ్యం అన్నిట సఫలీక్రుతులం అయ్యేటట్టు దీవించమని సాగుతుంది.
ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము. గురువుల, గురుతుల్యులైన పెద్దలు అనుమతితో నలభై ఒక్క రోజులు లేదా వారి ఉపదేశం ప్రకారం భక్తీ శ్రద్దలతో పారాయణం చేస్తే అన్ని రకాల సమస్యలు ముఖ్యం గా ఆరోగ్యపరమైన వాటినుండి తప్పక ఉపసమనం లభిస్తుందని పెద్దల ఉవాచ.
హనుమత్ బడబానల స్తోత్రం ఈ స్తోత్రము నిత్యమూ పఠించదగినది. దీనివలన శత్రువులు సులభముగా జయింప బడుదురు. సకల విధములైన జ్వరములు భూతప్రేతాదికములు, శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోవును. అసాధ్యములను సాధింపగలదీ స్తోత్రము.
No comments:
Post a Comment