Thursday, 15 December 2016

పెళ్ళిలో పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు నుదుటన “బాసికం” ఎందుకు ధరిస్తారు.?


 

ఇది శాస్ర్త పరంగా మన పూర్వీకులు తెలిపే అతి ముఖ్యమైన విషయం మరియు వివాహ సమయంలో అతి ముఖ్యమైన ఘట్టం ఈ “బాసికం” లో దాగి ఉంది. అదేమిటంటే వధూవరులు ఇద్దరు తప్పక నుదుటే బాసికం ధరిస్తారు. ఈ బాసికం ధరించడం వల్ల ఇరువురికి ఒక చూడముచ్చటైన, అందమైన అలంకరణగా కనిపిస్తుంది. ఈ అందమైన అలంకరణ వెనుక ఒక బలమైన అర్ధము కూడా ఉంది. వివాహ సమయం అంటేనే సుముహూర్తం. ఏ పెళ్ళిలో ఐనా సరే తప్పక ఈ సమయానికే పెళ్ళిళ్ళు జరుగుతాయి.
ఐతే ఈ సుముహూర్త సమయంలో వధువు రెండు కనుబొమ్మల మధ్య వరుడు, అలాగే వరుడు రెండు కనుబొమ్మల మధ్యన గల బొట్టు పెట్టుకునే నుదుటి భాచం వైపు తప్పని సరిగా చూడాలి. అందుకోసమే ఎటువంటి దృష్టిలోపం లేకుండా ఉండటం కోసం ఈ బాసికం ధరిస్తారు. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి అమితమైన ఆకర్షణ పెరుగుతుందని మన శాస్ర్తాలు ఘోషిస్తున్నాయి.

 

No comments:

Post a Comment