Saturday, 30 July 2016

తెలంగాణా సంప్రదాయ పండుగ బోనాలు ...

తెలంగాణా సంప్రదాయ పండుగ బోనాలు ...
Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.


బోనాల పండుగ అనగానే తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులు పులకరిస్తాయి. పురాణగాధలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల ప్రజలు బంధుమిత్రుల కుటుంబాలతో కలిసి మెలిసి ఈ పండుగ జరుపుకుంటారు. గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను, అను బంధాలను పెంపొందించే వారిధి బోనాలు. భాగ్య నగరవాసుల ప్రత్యేక పండుగగా ఇది సుప్రసిద్ధం. బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢమాసంలో ఈ పండుగ జరుపుకుంటారు.  నగరంలో ఆషాడమాసంలో జరిగే బోనాలు గ్రామాల్లో శ్రావణమాసంలో జరుగుతాయి. గ్రామాల్లో కులవృత్తుల సంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

బోనం అంటే  నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవిగుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మొదలైన పేర్లు కల ఈ దేవిగుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. 

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై బోనం మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము;

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.
పోతురాజు

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నాట్యం చేస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాళ్ళను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు
రంగం

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ వికృతమైన కొపాన్ని తగ్గించెందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి, తల, మొండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నుల పండువగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టి వ్యాధినిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.
ఘటం

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది.
హైద్రాబదులో బోనాలు.

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

కులీకుతుబ్‌ షాల కాలంలో ప్రారంభమైన బోనాలు ప్రతి సంవత్సరం రాజదానిలో సుమారు నెలరోజుల పాటు వైభవోపేతంగా జరుగుతుంది. గోల్కొండ ఖిల్లాలోని జగదాంబికా ఆలయంలో జరిగే బోనాలకు అయిదు వందల ఏళ్ల, సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సుమారు రెండువందల ఏళ్ల చరిత్ర ఉంది. అలాగే నిజాం నవాబుల ప్రార్ధనలతో ప్రాశస్త్యం పొందిన లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. హైద్రాబదులో బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ మహంకాళి ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.అక్కన్న-మాదన్న మాతా మహంకాళి ఆలయంగా సుప్రసిద్ధమైన హరిబౌలి ఆలయంలో బోనాల రోజున రాష్ట్రప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టుచీరను కానుకగా సమర్పించే సంప్రదాయం కొనసాగుతున్నది. లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

Information about hindu festival bonalu. bonalu news, bonalu festival celebrations, bonalu festival 2013.

ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న, మాదన్న, లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మిరాలంమండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.


తెలంగాణ జనజీవన ప్రతీక ‘బోనాలు’

 
, ,
బహుశా ప్రపంచంలో ఏ పండుగా నెలరోజుల పాటు జరుగదు. కాని తెలంగాణ బోనాలు మాత్రం ఆషాఢమాసం నుంచి శ్రావణం చివరిదాక జరుపుకుంటరు. తెలంగాణ పండుగలు రెండూ గ్రామీణ జీవన నేపథ్యం కావడం విశేషం. ఒకటి బోనాలు (ఆషాడం) రెండు బతుకమ్మ (ఆశ్వీయుజ మాసం). బోనం అంటే భోజనం. అమ్మతల్లికి పెట్టే నైవేధ్యం (భోజనం). బువ్వ; ఇది అత్యంత భక్తిశ్రద్ధలతో, ఊరేగింపుగా ఊరుమ్మడిగా కలసి వెళ్లి ఊరి బయట గల గ్రామ దేవతలకు సమర్పించేది.
మానవులు నాగరికత నేర్చి, గ్రంథాలు రచించిన కాలంలోనే, అత్యంత ప్రాచీన దశలో ఆదిమ మానవులు, దైవభావనకు అంతర్గత రూపమిచ్చారు. అది నిరాకార భావన. అందుకే గ్రామ దేవతలకు విగ్రహాలు ఉండవు. గుళ్లుండవు. అదిమానవులు వర్షం వచ్చినా, ఉరిమినా, మెరిసినా బయపడేవారు. భయం భక్తికి మూలం; కాబట్టి భయంతో ప్రారంభమైన ఆరాధన భక్తిగా నిలిచింది. అందువల్ల ‘అమ్మలా’ ఆపదల నుండి గట్టెక్కించేదెవరని ఆలోచించారు. తమను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ‘అమ్మ’నే తొలిదైవం చేశారు. అందువల్లే గ్రామదేవతలంతా తల్లి దేవతలే. అయితే, అమ్మకు మాత్రం ఆకలి దప్పులుండవా! అందువల్ల ఆమెను కన్న కొడుకుల్లా, కడుపులో పుట్టిన సంతానం కనిపెట్టుకొని, కడుపు నిండా పెట్టాలి కదా, కాబట్టి ‘బోనాలు’ పండుగ పేర ప్రతి ఆషాడంలో అమ్మతల్లికి జాతరలు జరుపు కుంటారు. మరి ఆషాడ మాసమే ఎందుకంటే, వర్షాలు కురిసి వ్యాధులు విజృంభిస్తాయి. మరోవైపు గ్రామీణులు ఎవుసం మొదలు పెట్టేది ఇప్పుడే. అందుకే, ‘తమ పిల్లా పాపా గోడు గోదా, పాడి పంట, చల్లగా కాపాడుతల్లీ’ అంటూ మొక్కులు తీర్చుకుంటారు.
తెలంగాణ ఆత్మ, అంతరాత్మ ఎంత చల్లనిదో, ఎంత ఆత్మీయత కలదో, ఈ పండుగ నిరూపిస్తుంది. ఎక్కడ ఉన్నా, కుటుంబమంతా ఈ పండుగ వేళ ఒక్కటవుతారు. కలసి మురిసి పండుగ చేసుకుంటారు. ఊరంతా ఉమ్మడిగా ఊరేగింపుగా సాగుతారు. పల్లెంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. మరో విధంగా చెప్పాలంటే, పట్నం మురువని పండుగ ఇదే. నేటికి జరుగుతున్న లష్కర్‌ బోనాలే ఇందుకు మంచి ఉదాహరణ. పెద్దమ్మ తల్లి దేవాలయాలే అందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. పల్లె జీవులు ఎంత నిబద్ధత కలిగిన వారో దీనివల్ల తెలుస్తుంది. బడుగుజీవుల కాలనీల్లో తప్పక ‘అమ్మతల్లుల’ దేవాలయాలు కనిపిస్తాయి. ఇది ఆధునిక చింతనలో ఒక భాగం అని చెప్పాలి.
జానపద దేవతలైన గ్రామ దేవతలకు గుళ్లు – గోపురాలు ఉండవు. తమకు నీడనిచ్చే చేట్టే అమ్మకు నీడనిస్తుంది. ఆమెను ఆమే కాపాడుకుంటుంది. ‘రక్షణ! ఎందుకు’? అనుకుంటరు. వేయిగండ్ల తల్లి పోచవ్వ తల్లి అని భావిస్తారు.
గ్రామదేవతలు, ఏడుగురు; స్త్రీ మూర్తులు. ప్రపంచమంతా స్త్రీ మూర్తుల ఆరాధన ఉంది. మెక్సికోలో ధాన్యదేవత, బొంగా దీవులలో ‘అలో అలో’ దేవి, గ్రీసులో ‘డెమిటర్‌’, రోమనులు ‘పెరిన్‌’ అనే పంట దేవతలను పూజిస్తారు.
స్త్రీ సంరక్షకురాలు మాత్రమే కాదు, మానవుల అతి ముఖ్యావసరం ‘అన్నం’ (ఆహారం) కనిపెట్టింది కూడా స్త్రీ. ఆదిమ మానవుల కాలంలో మగవారు వేటకు వెళ్లగా ఆడవాళ్లు ఇంటిపట్టున ఉండి వర్షానికి మొలకెత్తిన ధాన్యాన్ని చూశారు. తాము అదే విధంగా విత్తనాన్ని వేస్తే ఫలిస్తుందని భావించిన సృజనాత్మకత వారిది. అందుల్ల తొలుత వ్యవసాయం కని పెట్టింది స్త్రీలే అనాలి. మగవాళ్లలో స్త్రీ మూర్తి ఆరాధనాభావానికి ఇదో కారణం. రెండోది, సంతానాన్ని అందించి, సంరక్షించేది స్త్రీలే కాబట్టి వారు పూజ్యనీయులయ్యారు.
8-7-2016 News.p65‘ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలుంటారు’ అంటారు మనువు. కానీ, జానపదులు స్త్రీలను దేవతలుగా తలచి, కొలచి ఆరాధించారు. వాళ్ల దృష్టిలో వారే దేవతలు. ఒక్కొక్క ఆపదకు, ఒక్కో దేవత, ఒక్కొక్క విషయానికి ఒక్కో దేవతను ఆరాధించారు. ఈ విధంగా తెలుగునాట లెక్కకు మిక్కిలి గ్రామ దేవతలున్నారు. తెలంగాణలో చాలా చోట్ల పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ దేవతల ఆరాధన చాలాచోట్ల కనిపిస్తుంది. వీరు ఏడుగురు అక్కచెల్లెండ్లుగా, వీరికి తోడు పోతురాజు తమ్ముడని గాథ. ‘పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ’. తరువాత వైదిక కాలంలో వీరే ‘సప్తమాతృక -రూపాలకు మూలమయ్యారని భావించాలి.
ఆరాధ్య విధులు.. ఈ దేవత ఆరాధనలో ముఖ్యమైన విషయాలు గమనించాలి. ఇవి ప్రత్యేకతలు కూడా.
ఈ దేవతలకు గుళ్లుండవు. ఊరి చివర, వేపచెట్టు మొదట్లో రెండు పక్కల పొడుగైన రాయి నిలబెట్టి పైన ఓ రాయి బోర్లిస్తారు. గూడులా ఉండే దీనిలో, ఎదురుగా ఉన్న రాయికి సున్నం పూసి, పసుపు కుంకుమ బొట్లు పెడ్తారు. ఇదే గ్రామ దేవతకు ప్రతీక.
ఈ దేవతలకు పూజారులు బలహీన, బడుగువర్గాల వారే. స్వయంగా పూజలు చేసుకుంటారు . చాకళ్లు, పంబాల వాల్లు చాలాచోట్ల ఆరాధన విధులు నిర్వహిస్తారు. ఈ దేవతలకు జాతరలు జరిపి, బోనం పెట్టాలి. కాబట్టి ‘బోనాల’ జాతర, ‘కల్లుపాక’ పోస్తారు.
దేవతలు ఆగ్రహిస్తే మశూచి, కలరా వస్తాయి. వీటిని పోచమ్మ వచ్చుడు, గత్తర వచ్చుడు అంటారు. అందుకు వాటి నివారణకు కొలువులు నిర్వహిస్తారు. దేవతలకు మద్యం, మాంసం ఇష్టమైనవి. అందువల్ల జంతుబలి అనివార్యం అంటారు. అయితే, తాము ఇష్టపడేవే దేవతలు ఇష్టపడతారని జానపదుల నమ్మకం. ఈ దేవతలలో ప్రత్యేకంగా కొందరు దేవత లుంటారు. పశువులను కాపాడే దేవత ‘మైసమ్మ’. బాలలను కాపాడే దేవత ‘బాలమ్మ’. చెరువుకట్టలు కాపాడే దేవత ‘కట్టమైసమ్మ’. అయితే, ఈ దేవతలకు లెక్కకు మించి తలలు, చేతులు ఉండవు, అసలు ఆకారమే ఉండదు. నిరాకార చింతనకు ప్రతిరూపం గ్రామదేవత. ఈ దేవతల ఆరాధన ప్రజల విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరిళ్ళలోనైనా శుభకార్యం జరిగితే, వాల్లు ‘పోచమ్మలు చేసుడు’ అని ఆరాధిస్తారు. ఊరుమ్మడి సమస్యలు కలరా, పశువులు చావడం వంటివి వచ్చినప్పుడు గాని, అవి రాకుండా నివారణకు గాని, ఊరుమ్మడిగా బోనాలు, పోచమ్మలకు చేసుడు, పండుగగా చేసుకుంటారు. పండుగ ఒక్కరోజుకే పరిమితం కాదు. ఆషాఢమాసంలో, గురు, ఆదివారాల్లో, ఈ పండుగ నెలంతా జరుగుతుంది. ఒక్కచోట, ఒక్కోరోజు జరగడం విశేషం.
 
 
 31-7-2016

ఇవాళ జంట నగరాలలో బోనాలు సమర్పించే ఆలయాల గురించి చెప్తానన్నానుకదా. బోనాల సమర్పణకి కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ బోనాలు ముందుగా గోల్కొండ కోటలోని జగదంబా మహాకాళి ఆలయంలోని అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాతే మిగతా ఆలయాలలో. అందుకనే ముందుగా ఆ ఆలయం గురించి తెలుసుకుందాము.  
జగదంబా మహాకాళి ఆలయం, గోల్కొండ
ఈ ఆలయం 900 సంవత్సరాల క్రితం నుంచీ వున్నది. అంటే గోల్కొండ కోట కట్టటానికన్నా ముందే ఈ ఆలయం వున్నది. పూర్వం ఈ కొండమీద గొల్లవారు పశువులను మేపుకోవటానికి వచ్చేవారు. వాళ్లు కనుగొన్న ఆలయం ఇదని ఒక కధనం వున్నది. ఇంకొక కధనం ప్రకారం కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు ఈ కొండమీద మట్టికోట కట్టించేటప్పుడు అక్కడ అమ్మవారిని పూజించి బోనాల పండగ చేశారు. ఈ మట్టికోట గొల్లవాళ్ళు పాలించేవారు. అప్పటినుంచీ దీనిని గొల్లకోట అనేవారనీ, అదే క్రమంగా గోల్కొండ అయిందంటారు. అప్పటినుంచీ ఇక్కడ బోనాల ఉత్సవం నిర్వహిస్తున్నారు. అందువల్లనే కాబోలు అతి పురాతనమైన ఈ ఆలయంలో ముందుగా బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. హింతూ ముస్లిమ్ ల సమైక్యతకు చిహ్నంగా, నిజాం సమయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో ముస్లింలు కూడా సోదర భావంతో పాల్గోనేవారు.
ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బోనాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు లంగర్ హౌస్ చౌరస్తాలో ఆలయ కమిటీవారికి అందజేస్తారు. అలాగే ఈ ఆలయ కమిటీ తరఫున జంట నగరాలలోని సికిందరాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, లాల్ దర్వాజా అమ్మవారికి, ఇంకా కొన్ని ఆలయాలలో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందజేస్తారు. ప్రభుత్వ ప్రతినిధులు పట్టు వస్త్రాలు ఆలయ కమిటీకి అందజేసిన తర్వాత చుట్టు పక్కల ప్రాంతాలనుంచీ భక్తులు తీసుకు వచ్చిన తొట్టెల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు రాత్రి వరకూ సాగుతుంది. గోల్కొండ ప్రాంతంలో వుండే ఆలయ పూజారిగారి ఇంటినుంచి అమ్మవారి విగ్రహాన్నికూడా ఊరేగింపుగా తీసుకు వెళ్తారు. ఈ ఉత్సవాలకు సమీపంలోవారేకాక చుట్టుపక్కల జిల్లాలనుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు. అమ్మవారికి తొమ్మిది వారాలపాటు పూజలు నిర్వహిస్తారన్నానుకదా. ఈ తొమ్మిది వారాలలో 3వ వారం ఉజ్జయినీ మహంకాళి బోనాలు, ఐదవ వారం లాల్ దర్వాజా అమ్మవారి బోనాలతోబాటు అన్ని ప్రాంతాలలో కూడా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ఆలయం : ఇక్కడ చాలాకాలం ఎటువంటి షేడ్ లేకుండా వున్నది. ఇప్పుడు కూడా ఆలయం చిన్నదే. అయితే అనేక శతాబ్దాలనుండీ పూజలందుకుంటున్న తల్లి మహిమ మాత్రం అనంతమని ఆలయంలో బోనాలు సమర్పించే భక్తులను చూస్తే తెలుస్తుంది. ఈ ఆలయం కిందనుంచీ చార్మినార్ దాకా సొరంగ మార్గం వున్నదంటారు. ఇప్పుడు మూసేశారు.
బోనాలు: బోనాల ఉత్సవాలు ఈ ఆలయంలో ప్రారంభమవుతాయన్నానుకదా. ఇక్కడ 9 వారాలపాటు తొమ్మిది పూజలతో అమ్మవారిని కొలుస్తారు. అంటే దాదాపు 2 నెలల 15 రోజులు. ఈ సమయంలో ప్రతి గురువారం, ఆదివారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. తొమ్మిది వారాలు అమ్మవారికి పూజలు చేసిన తర్వాత తొమ్మిదవ వారంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది. లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని అత్యంత సుందరంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రాళ్ళు జానపదగీతాలు, వాయిద్యాల నడుమ నృత్యం చేస్తారు. పాత నగరంలో జరిగే ఘటాల ఊరేగింపులో పరిసర ప్రాంతాలలోని ఆలయాలవారంతా పాల్గొంటారు
ఉజ్జయిని మహంకాళి ఆలయం, సికిందరాబాద్
సికిందరాబాద్ లో జనరల్ బజారులో కిక్కిరిసిన దుకాణాల మధ్య వున్నది ఈ ఆలయం. మొదట్లో ఇక్కడ ఆలయం మాత్రమే వుండేది. తర్వాత తర్వాత జనావాసాలు పెరిగాయి. ఈ ఆలయం వెనుక ఒక చిన్న కధ వున్నది. క్రీ.శ. 1813 లో సురిటి అప్పయ్య అనే ఆయన మిలటరీలో పని చేస్తూ ఈ ప్రాంతాల్లో వుండేవారు. ఆయనకి ఉజ్జయినీ బదిలీ అయితే అక్కడికి వెళ్ళారు. ఒకసారి అక్కడ కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలి, చాలామంది చనిపోసాగారు. అప్పుడు అప్పయ్యగారు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్ళి ఆ తల్లికి మొక్కుకున్నారు. కలరా తగ్గిస్తే తన స్వంత ఊరులో అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని. కలరా తగ్గింది. రెండు ఏళ్ళ తర్వాత స్వస్ధలానికి వచ్చిన అప్పయ్యగారు దారుతో అమ్మవారి విగ్రహాన్ని చేయించి ఒక వేప చెట్టు కింద వుంచి పూజించసాగారు. తర్వాత చిన్న ఆలయం... ఆ తర్వాత ఆలయం విస్తీర్ణం చేసే సందర్భంలో తూర్పువైపు వున్న బావిని మరమ్మత్తు చేయిస్తుంటే బావిలో మాణిక్యాంబ విగ్రహం దొరికింది. అమ్మవారి ఆనతి ప్రకారం అమ్మవారి విగ్రహం పక్కనే మాణిక్యాంబ విగ్రహాన్ని ప్రతిష్టించారు. క్రీ.శ. 1864 సం. లో శ్రీ సురటి అప్పయ్యగారి సారధ్యంలో ఇదివరకు విగ్రహాల స్ధానంలో ఇప్పుడున్న మూర్తులను ప్రతిష్టించారు. అప్పటినుంచీ ఇక్కడ శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతున్నాయి.
అమ్మవారు: ఇక్కడ అమ్మవారు ఒక చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో భరిణతో దర్శనమిస్తారు. పక్కనే మాణిక్యాంబ దర్శనమిస్తుంది. ముందు వున్న వేప చెట్టుని అలాగే వుంచి చుట్టూ ఆలయం నిర్మించారు. ఉపాలయంలో ఈశ్వరాంశ సంభూతుడైన వీరభద్రస్వామి చతుర్భుజాలతో ఎదురుగా నందీశ్వరుడితోసహా దర్శనమిస్తాడు.
బోనాలు:  గోల్కొండలో బోనాల ఉత్సవం మొదలయిన మూడవ ఆదివారం ఈ ఆలయంలోనూ, ఈ పరిసర ప్రాంతాలలోని వందకు పైగా ఆలయాలలోనూ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సాయంత్రం ఫలహారం బళ్ళు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. మర్నాడు మహంకాళి, మాణిక్యాంబల చిత్రపటాలను ఏనుగు మీద వూరేగిస్తారు. ఇక్కడ బోనాల మర్నాడు జరిగే రంగం చాలా ప్రసిధ్ధి చెందింది. ఘటం ఊరేగింపు రోజూ, పరిసర ప్రాంతాలలో ఒక్కొక్క వీధిలో జరుగుతుంది. ఈ ఆలయాలని మీరు దర్శించారా? లేకపోతే అవకాశం వున్నప్పుడు తప్పక దర్శించండి. ఈ నెల 15వ తారీకునుంచీ మహిళలు ఆసక్తిగా ఎదురుచూసే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా కొన్ని అమ్మవార్ల ఆలయాలు దర్శించుకుందాము.


No comments:

Post a Comment