Monday, 11 July 2016

వారఫలం (11 - 18 జులై 2016)

వారఫలం (11 - 18 జులై 2016)


మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
పరిస్థితులు అనుకూలించడంతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. ఆర్థికంగా కొంత వరకు కుదుటపడతారు. రుణాలు తీర్చడం, కొత్త రుణాలు అనుకూలిస్తాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. శనివారం నాడు మీ పనులకు వర్షం, ఇతరత్రా ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. దైవకార్యాలకు సహాయ సహకారాలందిస్తారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులు కొత్త ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగండి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. సోదరులతో స్వల్ప అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. మీ విలువైన వస్తువులు, పత్రాల విషయంలో ఏకాగ్రత వహించండి. ఆత్మీయుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.


 వృషభం
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కుటుంబీకుల కోసం బాగా శ్రమిస్తారు. ధనవ్యయం అధికమైనా తగిన ప్రయోజనం ఉంటుంది. దంపతుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. తీర్థయాత్రలు, కొత్త ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. స్త్రీల సరదాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. ఆది, సోమవారాల్లో కొంతమంది మీ ఆలోచనలను పక్కదారి పట్టించే ఆస్కారం ఉంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు సంతృప్తికరంగా సాగుతాయి. ఇంటా, బయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులు చేసే పనిమీద ధ్యాస ఉంచడం మంచిది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యలలో ప్రవేశం లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు, స్థల వివాదాలు ఒక కొలిక్కి రాగలవు. క్రయ విక్రయాలు సామాన్యం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి.

 మిథునం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఏ అవకాశం కలిసిరాకపోవడంతో మంగళ, బుధవారాల్లో ఒకింత నిరుత్సాహం చెందుతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన అవకాశం లభిస్తుంది. ఖర్చులు అధికం, రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. బంధువుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. గృహ నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం ఉత్తమం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో శ్రమ, ప్రయాసలెదుర్కుంటారు. చిరు వ్యాపారులు, వృత్తుల వారికి ఆశాజనకం. నోటీసులు, రసీదులు అందుకుంటారు. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన బలపడుతుంది. ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన చెందుతారు.


కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి ఆశ్లేష
కొన్ని వ్యవహారాలు నష్టాలు, ఇబ్బందులు కలిగిస్తాయి. ధనం బాగా వ్యయం చేయాల్సి వస్తుంది. చేస్తున్న పనులు పూర్తి అవుతున్న చివరి క్షణంలో విసుగు, భారమనిపిస్తాయి. ఆది, గురువారాల్లో దంపతులకు ఒక్కక్షణం కూడా సఖ్యత ఉండదు. ఓర్పు, రాజీ ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడం చాలా కష్టం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పుట్టింటి మీద ధ్యాస మళ్ళుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆశాజనకం. రేపటి గురించి ఆలోచనలు అధికమవుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఎరువులు, క్రిమి సంహారక మందుల వ్యాపారులకు బాగా కలిసిరాగలదు. ఉమ్మడి వ్యవహారాల్లో పట్టింపులెదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల బాటలో నడుస్తాయి. వైద్య రంగం వారికి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి.


సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఇబ్బందులుండవు. రుణ చెల్లింపులు వాయిదా పడతాయి. మంగళ, శనివారాల్లో కొన్ని విషయాల్లో సోదరుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. ప్రతి విషయంలోను ఓర్పు, సఖ్యత అవసరం. స్త్రీలకు ఆడంబరాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. విద్యార్థులు తోటి వల్ల మాటపడక తప్పదు. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు ఆలస్యంగా అందుతాయి. సొంత వ్యాపారాలు, దీర్ఘకాలికి పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయడం శ్రేయస్కరం. చిన్నారులు, ఆత్మీయులకు విలువైన కానులందిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. ప్రింటింగ్ రంగాల వారికి అరకర పనులే లభిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సామాన్యం. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. పాతమిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. పత్రిక, వార్తా సంస్థలలోని వారు మార్పుల కోసం చేసే యత్నాలు ఫలించవు. ఏజెంట్లు, బ్రోకర్లు, వృత్తుల వారికి సామాన్యం.

కన్య
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
 ప్రముఖుల ఇంటర్వ్యూ తేలికగా లభిస్తుంది. కొన్ని అవకాసాలు మీకే సానుకూలమవుతాయి. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. గురు, శుక్రవారాల్లో అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తికావు. బ్యాంకు లోన్లు, పర్మిట్లు మంజూరవుతాయి. స్త్రీలకు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులెదురవుతాయి. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి ఆశాజనకం. ట్రావెలింగ్ ఏజెన్సీలకు మందకొడిగా ఉంటుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. స్పెక్యులేషన్ రంగాల వారికి అంచనాలు ఫలిస్తాయి.



 తుల
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
దైవ కార్యాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త వ్యక్తుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. శనివారం నాడు చేపట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. స్త్రీలకు కుటుంబ విషయాల్లో ఏకాగ్రత అవసరం. ఉమ్మడి, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రభుత్వోద్యోగులకు దీర్ఘకాలిక సెలవు, లోన్లు మంజూరు కాగలవు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంపొందడంతో పాటు తోటి విద్యార్థులతో పోటీ పడతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. కోర్టు, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. ఒక సమాచార లోపం వల్ల మంచి అవకాశం చేజార్చుకుంటారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకులెదురవుతాయి.

 వృశ్చికం
విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
మీ లక్ష్యం నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. నిరుత్సాహం వీడి శ్రమించండి. అనుకున్నది సాధిస్తారు. ప్రముఖుల కలయిక వల్ల ఎంతో మేలు జరుగుతుంది. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు మరికొంత కాలం వేచియుండటం మంచిది. విద్యార్థులకు తోటివారితో క్రమేణా సత్సంబంధాలు నెలకొంటాయి. బంధువుల రాక, ఆకస్మిక ఖర్చుల వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు. ప్రతి విషయం మీ జీవితభాగస్వామికి తెలియజేయడం మంచిది. స్త్రీలకు పుట్టింటి నుంచి ధనప్రాప్తి, ఆదరణ లభిస్తుంది. పత్రికా, వార్తా సంస్థల్లోని వారికి సమావేశాల్లో ఊహించని చికాకులెదురవుతాయి. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ వహించండి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. క్రయ విక్రయాలు ఆశాజనకం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు అన్ని విధాలా కలిసిరాగలదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.

ధనస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
 పెద్దలు, ప్రముఖులతో మితంగా సంభాషించండి. ఏ పని చేపట్టినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చీటికి మాటికి అసహనం ప్రదర్శిస్తారు. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు. స్త్రీల సొంత నిర్ణయాలు సమస్యలకు దారితీస్తుంది. విద్యార్థులకు ఉపాధ్యాయులకు సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. క్రయ విక్రయాలు సామాన్యం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రతిఫలం తక్కువైనా వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వైద్యరంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ అభిప్రాయాలకు ఆశించినంత స్పందన ఉండదు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.

 మకరం
ఉత్తరాషాఢ 2, 3, 4పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
 అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఇంటా బయటా మీ మాటకు చుక్కెదురవుతుంది. ఒక్కోసారి ధనం ఎంత వ్యయం చేసినా ప్రయోజనం ఉండదు. ఆది, సోమవారాల్లో చేసే పనిలో ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. విద్యార్థినులకు ఒత్తిడి, మందలింపులు తప్పవు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. ప్రింటింగ్ రంగాల వారి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తులు, నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఏ వ్యవహారం కలిసిరాకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం వాకబు చేస్తారు. ఏమరుపాటు వల్ల ఊహించని చికాకులు తలెత్తుతాయి. క్రయవిక్రయాలు సామాన్యం. దైవ, పుణ్యకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

కుంభం
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆత్మీయుల కలయిక సంతృప్తినిస్తుంది. కొన్ని విషయాల్లో కుటుంబంలో మీ ఆధిపత్యం చెల్లదు. మునుముందు ఖర్చులు అధికంగా ఉంటాయి. మంగళ, బుధవారాల్లో ధనవ్యయంలో మితంగా వ్యవహరించండి. రావలసిన ధనం అందకపోవడంతో ఆందోళన చెందుతారు. స్త్రీలలో అసహనం, అశాంతి చోటుచేసుకుంటాయి. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రదేశానికి వెళ్ళాల్సి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రతి విషయంలోను అన్యమనస్కంగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగస్తులకు సామాన్యం. ఉన్నత స్థాయి అధికారులకు ఆకస్మిక బదిలీ, భాద్యతల్లో మార్పులుంటాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు సామాన్యం. వ్యవసాయ, తోటల రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. వాహన చోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతంత మాత్రంగానే ఉంటుంది. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి.

 మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
మీ సమస్యకు ఒక పరిష్కార మార్గం లభిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. మిమ్ములను పొగిడే వ్యక్తులను ఓ కంట కనిపెట్టడం మంచిది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. గురు, శుక్రవారాల్లో మీరు అభిమానించే వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన క్లయింలు, అడ్వాన్స్‌లు మంజూరవుతాయి. పత్రికా రంగంలోని వారికి నిరుత్సాహం తప్పదు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలించవు. భాగస్వామిక వ్యాపారాల్లో అభిప్రాయ భేదాలు, ప్రతిబంధకాలు ఎదుర్కొంటారు. దైవ, పుణ్య కార్యాలకు ఇతోధికంగా సహాయమందిస్తారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ప్రయాణాల ముఖ్యోద్ధేశ్యం నెరవేరుతుంది. గృహ మరమ్మతులు చేపడతారు. ఆకస్మికంగా అందిన ఒక నోటీసు కలవరపరుస్తుంది. సన్నిహితులతో వేడుకలు, విందులలో పాల్గొంటారు.
 

No comments:

Post a Comment