Tuesday 26 July 2016

పూజగదిలో శంఖం ?

పూజగదిలో శంఖం ?

శ్రీమహావిష్ణువు ధరించడం వలన ... అవతార పురుషులు విజయానికి సంకేతంగా ఉపయోగించడం వలన శంఖానికి పవిత్రత ఏర్పడింది. ఇక శంఖం లక్ష్మీదేవి స్వరూపమనీ, దానిలో గంగ .. వరుణుడు .. బ్రహ్మ కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఈ శంఖం భూమి ... ఆకాశం ... బంగారం సమ్మేళనంగా ఏర్పడిందని ఆధ్యాత్మిక గ్రంధాలు అంటున్నాయి.
ఇంతటి మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న శంఖం పూజ గదిలో ఉండవచ్చునా? ... లేదా? అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. మరికొంతమంది శంఖాన్ని ఇంట్లో ఊదవచ్చునా ? లేదా? అనే సందేహంతో సతమతమై పోతుంటారు. ఇందుకు సరైన సమాధానం మనకి శాస్త్రంలో కనిపిస్తుంది. దైవ స్వరూపంగా భావించబడుతోన్న శంఖాన్ని పూజగదిలో వుంచి పూజించవచ్చనీ, ఈ విధంగా చేయడం ఎలాంటి దోషాలు సంక్రమించవని శాస్త్రం చెబుతోంది.
ఇక శంఖాన్ని ఇంటికి సంబంధించిన పూజ గది దగ్గర ఊదకూడదని శాస్త్రం అంటోంది. దేవతామూర్తులు ప్రాణప్రతిష్ఠ చేయబడిన ఆలయాలలోను ... యజ్ఞయాగాది కార్యక్రమాలలో మాత్రమే శంఖం ఊదవచ్చని చెబుతోంది. దేవాలయాలో కూడా ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా, సూర్యోదయానికి ముందు ... సూర్యస్తమయం తరువాత మాత్రమే శంఖం ఊదాలనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

No comments:

Post a Comment