తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానానికి బోనాల
పండుగ నిండు నిదర్శనం.
ఆషాఢ మాసమంతా తెలంగాణలో గ్రామదేవతల ఉత్సవాలు, బోనాల జాతరలు జరుగుతూనే ఉంటాయి. ఈ గ్రామదేవతల ఉత్సవాలలో, బోనాల ఉత్సవాలలో తెలంగాణ ప్రజలు భక్తి విశ్వాసాలతో పాటు శాస్త్ర విజ్ఞానం కూడా దాగివుంది.
ఆషాఢమాసంలో వర్షాలు విరిగా కురియడం వల్ల క్రిమి కీటకాలు, వైరస్ ద్వారా అంటువ్యాధులు వ్యాపించి జన నష్టం కలుగజేస్తాయి. పూర్వకాలంలో వైద్య విజ్ఞాన శాస్త్రం పరిణతి చెందక ప్రచారం కాని కాలంలో పల్లెటూర్లలో ప్లేగు, కలరా, మశూచి వంటి అంటువ్యాధులు ప్రబలి గ్రామాలకు గ్రామాలే శ్మశానాలుగా మారిపోయేవి. దీనినే గత్తర వచ్చింది అనేవారు. ప్రకృతి భయంకర వికృత చేష్టలు, బీభత్సాలు, వైపరీత్యాలు జన సామాన్యానికి అర్థమయ్యేవి కావు.
ఈ ప్రకృతి వైపరీత్యాలను, ప్రకృతి బీభత్సాన్ని జయించి వాటిని నివారించుకునే నిమిత్తం మానవుడు భక్తిభావంతో గ్రామదేవతలను ప్రతిష్టించుకొని విశ్వాసంతో ఆరాధించడం మొదలు పెట్టిండు. దీనినే శక్తి ఆరాధన, ప్రకృతి ఆరాధన, గ్రామ దేవతల ఆరాధన అంటారు. గ్రామదేవతలను గ్రామాలలోని సబ్బండవర్ణాలు, వివిధ కులవృత్తుల వారు ఆరాధించడమే కాక పూజారులుగా కూడా చెలామణీ అయ్యారు, అవుతున్నారు.
తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధమైన గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, సుంకులమ్మ, పెద్దమ్మ, జమ్ములమ్మ, వీర నాగమ్మలు. కాగా, పల్లెసీమలలో పిల్లలకు తట్టుపోయడం, మశూచి సోకడం గ్రామదేవతయైన పోచమ్మ వల్లనే అని ప్రజలు నమ్మేవారు. గ్రామ దేవతలను బోనాలతో (నైవేద్యాలతో) ఉపశమించజేస్తే పిల్లలకు సోకిన తట్టు, మశూచి తగ్గుతాయని గ్రామీణుల విశ్వాసం, భక్తి. అందుకే ఆషాఢమాసంలో తెలంగాణ ప్రజలు పోశమ్మకు, మైసమ్మ (కట్ట మైసమ్మ, కోట మైసమ్మ, గండి మైసమ్మ), పెద్దమ్మ, ఎల్లమ్మలకు బోనాలలు సమర్పిస్తారు. జంతుబలులతో కుటుంబ సమేతంగా, గ్రామ ప్రజలంతా కలిసిమెలిసి సంబరాలు జరుపుకుంటారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, తమ పిల్లలను అమ్మవారు చల్లగా చూడాలని ఊరుమ్మడిగా ప్రజలు బోనాల సంబరాలు జరుపుతారు.
ఈ బోనాల సంబరాలు ఉన్నత కులాల ఆధిపత్య ధోరణికి వైదిక సాంప్రదాయానికి విరుద్ధాలు. గ్రామదేవతలకు బోనాల (భోజనాల) రూపంలో సమర్పించే నైవేద్యం పల్లె ప్రజలు నిత్య జీవితంలో తినే మాంసాహారం, తాగే కల్లు తదితర పదార్థాలే ఉంటాయి. ప్రజలకు ప్రియమైన పదార్థాలనే గ్రామదేవతలకు కూడా ప్రీతిపాత్రంగా భావించి నైవేద్యంగా సమర్పిస్తారు.

No comments:
Post a Comment