Wednesday, 13 July 2016

హిందూధర్మ సంస్కృతిలో భక్తి

 హిందూధర్మ సంస్కృతిలో భక్తి


హిందూధర్మ సంస్కృతిలో భక్తి గురించిన విశేషాలు అనేకానేకము ఉన్నాయి . సాధకులు , ఆరాధకులు ఏవిధమ్ముగా ఉండాలో మనకు నారదభక్తి సూత్రాలు విపులీకరించాయి . భక్తి తో తన ఇస్టదైవాన్ని ఆరాధిస్తే మనస్శాంతి కలుగు తుంది . మనసు లో చెడు ఆలోనచలము తావుండదు. సన్మారగము లో నడిచేందుకు వీలుపడుతుంది . ఎన్నో మానసిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చును . నిత్యజీననం లో వత్తిళ్ళకు , వడిదుడుకులకు తట్టుకునే మనోధైర్యం కలుగుతుంది . మనసు ప్రశాంతం గా ఉంటే శరీరము ఆరోగ్యం గా ఉంటుంది . 80 శాతము శరీరక రుగ్మతలకు మానసిక ఆందోళనే కారణము . భక్తి తో వీటినన్నింటినీ అధిగమించవచ్చును .
• భగవంతుదుని ఆరాధించడమే భక్తి అని పరాశరుడు తెలియజేసాడు .
• భగవంతుని లీలావిశేషాల గురించి తెలుసుకోవడమే భక్తి అని గార్గుడు తెలియజెప్పాడు .
• మన:పరిపక్వ సాధనే భక్తి అని అంటాడు శాండిల్యుడు .
• రామానుజాచార్యులు , మధ్యాచార్యులు కూడా భక్తి మార్గము గురించి ఉత్తమోత్తమము గా తెలియజేసారు .
• కర్మ , జ్ఞాన , యోగ మార్గదర్శకమే భక్తి మార్గము . గుణ , రూప , పూజ , సఖ్య , వాత్సల్య , మాధుర్య , ఆత్మనివేధన , తన్మయ మరియు విరహ - ఇలా అనేక భక్తి మార్గాల గురించి నారదభక్తి సూత్రాలలో వివరించబదింది .
అదేవిధం గా భగవద్గీతలోని అనేక అధ్యాయాలలో భక్తి ప్రాశస్యం మనకు గోచరిస్తుంది . ఉదాహరణకి ....
శ్రవణ భక్తి , కీర్తం భక్తి , స్మరణ భక్తి , పాదసేవ భక్తి , వందనభక్తి , దాస్య భక్తి , అర్చనభక్తి , స్నేహభక్తి , అత్మానుసందాన్యభక్తి , మొదలైనవి .
• భక్తి మారగములో ద్యాన భక్తికి ఒక ప్రత్యేకత ఉంది. త్యాగరాజు , పురందరదాసు మొదలైన వారు భక్తిపారమార్ధ్యాన్ని పానం చేసిన మహనీయులు .
• కీర్తన భక్తి కి - రామదాసు , అన్నమయ్య
• శ్రవణభక్తికి - గోపికలు , రుక్మిణి ,
• స్మరణభక్తి కి - నారద , తుంబుర , ప్రహ్లాదులు ,
• పాదసేవన భక్తి కి - శబరి , భరతుడు , లక్ష్మణుడు ,
• అర్చన భక్తికి - కన్నప్ప , ఏకలవ్యుడు , నంది ,
• వందన భక్తి కి - మానవులు ,
• దాస్య భక్తి కి - హనుమంతుడు , గరుత్మంతుడు ,
• స్నేహభక్తి కి - సుగ్రీవుడు , విభీషణుడు ,
• ఆత్మనివేదన భక్తికి - కుబేరుడు , అర్జునుడు .
భక్తి మార్గము లో గట్టి పట్టుదల ఉండాలి , దృఢమైన ప్రతి్జ్ఞ చేసుకోవాలి అప్పుడే కార్య సాధకుడవుతాడు .

No comments:

Post a Comment