Saturday, 30 July 2016

మతము (part 3)

మతము (part 3)
continuation  హిందూమతము..

హిందూధర్మశాస్త్రాలు
హిందూమతము నకు సంబంధించిన ఆధారాలు, నియమాలు, సిద్ధాంతాలు, తత్వాలను వివరించేవి హిందూ ధర్మశాస్త్రాలు. ఇవి ప్రధానంగా సంస్కృత భాష లో వ్రాయబడ్డాయి. ఈ విధమైన సంస్కృత సాహిత్యమును మతపరంగా ఆరు విభాగాలు, మతం తో సంబంధం లేకుండా నాలుగు విభాగాలుగా పరిగణిస్తారు.

ప్రధాన విభాగాలు



శ్రుతులు
"శ్రుతి" అనగా "వినిపించినది". అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు. "మంత్రద్రష్ట" లైన ఋషులకు అవి "వినిపించినవి". చతుర్వేదాలు - అనగా ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణవేదము - ఇవన్నీ శ్రుతులు. మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని "అపౌరుషేయములు" లేదా "నిత్యములు" అని కూడా అంటారు. ఇవి హిందూ ధర్మమునకు మౌలికమైన ప్రమాణములు.
ఒక్కొక్క వేదంలో భాగాలైన సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు కూడా శ్రుతులేఅగును.


ఉపవేదములు
నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. అవి:
ఆయురవేదం, (వైద్య సంబంధ మైనది)
గాంధర్వవేదం (సంగీత సంబంధ మైనది)
ధనురవేదం (యుద్ధ సంబంధమైనది) మరియు
స్థాపత్యవేదం ( శిల్ప విద్యకు సంబంధించినది)

వేదాంగములు
వేదాంగములు ఆరు. అవి:
శిక్ష, ఛందస్సు, నిరుక్తము, వ్యాకరణము, జ్యోతిషము మరియు కల్పము.
ఇంకా ఇతిహాసము అయిన మహాభారతము "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది.

స్మృతులు
"స్మృతి" అనగా "స్మరించినది" అనగా "గుర్తు ఉంచుకొన్నది". ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంధాలు. విధి, నిషేధాల(మానవులు, సంఘము ఏవిధంగా ప్రవర్తించాలి, ఏవిధంగా ప్రవర్తించ కూడదు అనే విషయాలు) గురించి స్మృతులు వివరిస్తాయి.
స్మృతులు ఇరవై ఉన్నాయి. అవి మను, అత్రి, విష్ణు, హరిత, యాజ్ఞవల్క్య, ఉశాన, ఆంగీరస, యమ, ఆపస్తంబ, సమ్వర్త, కాత్యాయన, బృహస్పతి, పరాశర, వ్యాస, శంఖ, లిఖితా,దక్ష, గౌతమ, శాతాతప, వసిష్ట స్మృతులు (ధర్మశాస్త్రాలు).
20 ధర్మశాస్త్రాలు

ఇతిహాసములు - రామాయణము, మహాభారతము

18 పురాణాలు
ఆగమములు - దేవాలయముల నిర్మాణము, విగ్రహములను చేయుట, ఆలయ ప్రతిష్ట, పూజా విధానములు వంటి విషయములు ఆగమములలో ప్రస్తావించబడినవి. ఇవి రెండు ప్రధాన వర్గములు
శైవాగమములు - 28 కలవందురు.
వైష్ణవాగమములు - పాంచరాత్రము, వైఖానసము


దర్శనములు:
దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును? మోక్షస్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి? ఇలా జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు. వాటిలో ఆరు ముఖ్యమైనవాటిని షడ్దర్శనాలు అంటారు. అవి
సాంఖ్యము
యోగము
వైశేషికము
న్యాయము
పూర్వమీమాంస
ఉత్తరమీమాంస
మతంతో సంబంధంలేని విభాగాలు

సుభాషితములు
కావ్యములు
నాటకములు
అలంకారములు

No comments:

Post a Comment