Monday 18 July 2016

అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు......

అందరికీ  గురు పూర్ణిమ శుభాకాంక్షలు......

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు శబ్దానికి అర్థం; ఆచార్యుడంటే ఎవరు? వ్యాసుని కధ... గురుపూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం!
గురువు అంటే:
గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అంటే గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చే యువారు అని అర్ధము. గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం!గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.
వేదవ్యాసుని కథ:
వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసుకదా? శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన కృష్ణ దెై్వపాయనుడే వ్యాసుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని, అంబాలికకు పాండు రాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు.పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశసా్తల్రు పొందాడు.కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే! భాగవాతాన్ని రచించాడు.
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి దైలుడనే శిష్యునికి ఋగ్వేదాన్ని, వైశాంపాయనునికి యజుర్వే దాన్ని; జైమినికి సామవేదాన్ని; సుమంతునికి అధర్వణ వేదాన్ని తెలియజేసి వ్యాప్తి చేయించాడు. తాను వ్రాసిన పురాణాతిహాసాలు సుతునికి చెప్పి ప్రచారం చేయించాడు. పరమేశ్వరుని దయతో వ్యాసునికి పుత్రుడు జన్మించాడు. ఒక రోజు వ్యాసుడు తన ఆశ్రమంలో అరణి మధిస్తుండగా ఘృతాచి అనే అప్సరస కనబడింది. ఆమె అందానికి చలించిన వ్యాసుని వీర్యస్కలనం కాగా అందుండే శుకుడు జన్మించాడు. ఆ బాలునికి వ్యాసుడు దివ్యబోధలు చేసాడు. సృష్టి్ట క్రమం, యుగధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు తెలియజేసి జ్ఙానిగా మార్చాడు.
ప్రాచీన గాథలు, గత కల్పాలలో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు, చదవలేదు.అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.
పూజా విధానం (వ్యాస పూజ / గురు పూజా విధానం)...
కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు, అత ని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తారుట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో, శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.
ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురు వుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట!వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి.ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.
శో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః
అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!
ఆషాఢ పూర్ణిమ ప్రత్యేకతలు...
ఈ రోజు గురు పూర్ణిమతో పాటుగా కోకిలా వ్రతం, మహాషాఢి అని, వ్యాస పూజ, శివశయనోత్సవం, జితేంద్రరాయ జాతర. ఆ, కా, మా, వై పూర్ణిమలో మొదటిదైన ఆషాఢ పూర్ణిమ స్నానం... ఎన్నో వున్నాయి. కోకిలా వ్రతం విచిత్రంగా వుంటుంది, ఈనాడు సాయంకాలం నది స్నానం చేసి తెలకపిండితో కోకిల ప్రతిమ చేసి పూజ చేయాలి. నెల రోజులు పాటు అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరు చేసినా అందమైన భాగస్వామి దొరుకుతాడని అంటారు. కోకిల, తెలకపిండి ప్రధానంగా కావాలి. ఆషాఢంలో తెలకపిండి తీసుకోవాలి, కోకిల వలస వెళ్ళిపోతుంది. కోకిలాదేవి ద్రుపదుని భార్య. (ఈ వ్రత విధానం, కధ అంతా స్మృతి కౌస్తుభంలో చూడచ్చు).
జితేంద్రరాయ జాతర :
మహబూబ్‌నగర్‌ జిల్లా వసుమర్తి గ్రామం దగ్గర భీమనది కృష్ణలో సంగమించే చోటున ద్వీపం వుంది. అక్కడ శ్రీ కృష్ణ దెై్వపాయన బృందావనం అనే ఆరామం దగ్గర జితేంద్రరాయ పేరిట అతి ఘనంగా వ్యాస పూర్ణిమ నిర్వహిస్తారు.
బాసర (బాసర అదిలాబాద్‌ జిల్లాలో వుంది) :
ఇక్కడ వ్యాస మహర్షి అమ్మవార్ని సైకత శిల్పంగా చేసి సైజలు చేసాడని అంటారు. ఆ కధతో పాటుగా వ్యాసతీర్ధం కూడా అక్కడ చూడాల్సినది. వ్యాసపురియే కాలక్రమముగా వాసర అని పిలువడబడింది. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు యొక్క అపరరూపంగా భావింపబడి సమస్త ప్రపంచమునకు, ఆధ్యాత్మిక గురువుగా, జ్ఞానజ్యోతి స్వరూపుడై వెలిసిన శ్రీ వేదవ్యాస ముని నామమున, ప్రసిద్ధమైన వ్యాస తీర్ధం సర్వతీర్ధాలకు తలమానికం!
బ్రహ్మ నారదునికి వ్యాస తీర్ధ మహిమ ఇలా వివరించాడు. నారదా! ఈ వ్యాస తీర్ధమున స్నానము గావించినచో సమస్త మనోరథములు నెరవేరతాయి. సంతానార్ధులకు సంతానం, భోగభాగ్యములు కోరువారిందు స్నానం చేసి దేవిని ఉపాసిస్తే సమస్త భోగభాగ్యములు, మోక్షమును కోరువారీ వ్యాస తీర్ధమున స్నానించినా జీవన్ముక్తుల గుదురు.అంటే ఎవరైతే వ్యాస తీర్ధమున ఒక్క సారియైననూ స్నానం చేస్తారో, సమస్త పాపముల నుంచి తక్షణ విముక్తి. ఈ వ్యాస తీర్ధ మహత్యం పారాయణ చేసి నవారికి, వ్యాసుడు గావించిన సరస్వతీ స్తోత్రములను ఎవరు నియమ పూర్వకంగా పఠింతురో, ఎవరు ఎందులో వారికి తప్పక శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి కటాక్షం వుంటుందిట..
సద్గురువులు తమ శిష్యులని పుత్రవాత్సల్యంతో చూస్తారు. పరబ్రహ్మ స్వరూపంగా చూస్తారు. శాంతానికి ఉనికిపట్టు, వారు చాపల్యం గానీ, చిరాకు గాని పొందరు. తమ పాండిత్యానికి గర్వించరు.వారికి ధనవంతులు, పేదలు, నీచులు... అనే తారతమ్యం వుండనే వుండదు. మన పూర్వజన్మ సుకృతం వల్ల సాయిబాబాను అలాంటి సద్గురువును పొందాం. (షిర్డీలో చాలా బాగా ఉత్సవాలుంటాయి).
భక్తి విశ్వాసాలనే హృదయ దీపాన్ని సరిచేసి ప్రేమ అనే వత్తిని వెలిగించాలి. అప్పుడు జ్ఞానజ్యోతి (ఆత్మసాక్షాత్కారం) వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశిస్తుంది. ప్రేమలేని జ్ఞానం వౄఎధా. ప్రేమ లేనిదే చదువులు, వినుట, నేర్చుట అనేవి నిష్ఫలములు. ప్రేమ నివసిస్తే భక్తి, శాంతి, స్వేచ్ఛ వరుసగా వస్తాయి. యదార్ధమైన కాంక్ష, ఉత్తమ భావమున్న చోట భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అదే ప్రేమ
మోక్షానికి మార్గం... గురువు ద్వారానే!
ఓం గురుభ్యోనమః -

No comments:

Post a Comment