Monday 25 July 2016

హనుమంతునికి తమలపాకు మాల ఎందుకు వేస్తారు?



హనుమంతునికి తమలపాకు మాల ఎందుకు వేస్తారు?






ఆంజనేయస్వామికి లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఏర్పడే ఇబ్బందులు తొలగిపోతాయి. హనుమంతునికి తమలపాకుల మాల ధరిస్తే సకల సంపదలు చేకూరుతాయి.

ఇంకా ఇంట్లో మాంత్రిక దోషాలుఉన్నాయి అని అనుకుంటున్నా వారు,ఎలాంటి భయాలు ఉన్నవారు హనుమంతునికి తమలపాకుల హారాన్ని వేస్తేసంబంధమైన పీడలు తొలగిపోతాయి. సంసారంలో ప్రశాంతత లేనివారు వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా ఉంటారు. అటువంటి సమయంలో స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.

వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలొస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు, దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి.

సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకు హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది.

No comments:

Post a Comment