Monday 18 July 2016

సూర్యుడు ఎర్రగా ఉంటాడు. ఎందుకు?

సూర్యుడు ఎర్రగా ఉంటాడు. ఎందుకు?

సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు . అసలు సూర్యుడు అంత ఎర్రగా ఎందుకుంటాడో ఇప్పుడు తెలుసుకుందాం.!
భూమి వాతావరణంలో సూర్యుడి కిరణాలు మన కంటికి చేరేంతదాకా అవి ప్రయాణించే దూరాలు మారుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య కిరణాలు మన కంటికి చేరేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాలి. దూరంగా భూమి, ఆకాశం కలసినట్లు కనిపించే క్షితిజ రేఖకు దగ్గరగా సూర్యుడు ఉదయించే, అస్తమించే సమయాల్లో దగ్గరగా ఉండటం వల్లనే సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.
అదే మధ్యాహ్న సమయాల్లో సూర్యుడు మన నడినెత్తిపైన ఉన్నప్పుడు కిరణాలు తక్కువ దూరంపాటు ప్రయాణించి మన కంటిని చేరుతాయి. అలాంటి సమయాల్లో సూర్యుడి రంగు మామూలుగానే ఉంటుంది. అయితే... వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, తక్కువగా చెదిరిపోయే ఎరుపు రంగు మన కంటికి ఎక్కువగా చేరుకోవడం వల్ల... సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు.

No comments:

Post a Comment