షిర్డీ సాయిబాబా
షిర్డీ సాయిబాబా భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు. సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులూ సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.
సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు.సాయిబాబా హిందువా, ముస్లిమా, దేవుడా, గురువా, సామాన్యుడా అన్ని విషయాల గురించి పలు వాదాలున్నాయి.
జీవిత చరిత్ర
సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలున్నాయి. తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవుసరమని అనేవారు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో మరియు పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కుల గోత్రాలు చూస్తారు మరియు వారిది ఈ మతం అని మనసులో నాటేసుకొంటారు, బహుశా బాబా గారు అందుకే వారి పేరు మరియు పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు. ఒకమారు తన ప్రియానుయాయుడైన మహాల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పారని కథనం ఉంది. మరొకమారు ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు చెప్పారట. ఈ రెండు కథనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి.
తన షుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చారని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత (షుమారు 1858లో) షిరిడీకి తిరిగి వచ్చారనీ అత్యధికులు విశ్వసించే విడయం. ఈ ప్రకారం బాబా షుమారు 1838లో జన్మించి ఉండవచ్చును.
ఆ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబాను తరచు దర్శించసాగారు. సాయిబాబా పిచ్చివాడని మరి కొందరు రాళ్ళు కూడా రువ్వేవారు. మళ్ళీ కొంతకాలం కనుపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశారని, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి అధ్వర్యంలో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చుననీ, కొంతకాలం నేత పని చేశారనీ కొన్ని సూచనల వలన తెలుస్తున్నాయి.
షిరిడీలో నివాసం
1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి "దయ చేయుము సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' పదం స్థిరపడి అతడు "సాయిబాబా"గా ప్రసిద్ధుడైనారు. షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు.ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.
1918లో తన మరణం వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నారు. యాచన అతని వృత్తి. మసీదులో ధునిని వెలిగించారు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది తమకు రక్షణ ఇస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించేవారని భక్తులు చెబుతారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. ఉత్సవాలలో పాల్గొనేవారు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవారు.
1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాదువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు. అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.
ముఖ్యమైన శిష్యులు, అనుయాయులు
సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు. సకోరీకి చెందిన ఉపాసనీ మహారాజ్, అహమ్మద్ నగర్‌కు చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు.
శ్రీ సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయనను సదా అంటిపెట్టుకొని ఉన్నారు - వారిలో ముఖ్యులు: మహాల్సాపతి, హేమాండ్ పంతు, శ్యామా ,తాత్యా.
బోధనలు
తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించారు. నమాజ్ చదవడం, అల్-ఫతీహా మననం, ఖొరాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు. ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించారు. తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు. ప్రార్థన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించారు. ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించారు. నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పారు. తన భక్తులకు రెండు (2) ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పారు - అవి శ్రద్ధ (విశ్వాసం, భక్తి, దీక్ష), సబూరి (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టారు. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించారు.
రెండు మతాల గ్రంధాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించారు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని ఆయనతో ఉన్నవారు చెప్పారు. హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి. తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నారు.
భగవంతుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. సాయిబాబా ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమనీ, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమనీ చెప్పారు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించీ, గురువునే దేవుడిగా భావించమనీ పదేపదే చెప్పారు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు.
సాయిబాబా రచించిన గ్రంధాలేవీ లేవు. సాయిబాబా బోధనలు మౌఖికంగానే శిష్యులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు. సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘దక్షిణ’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవారు. భక్తులవద్ద దక్షిణ తీసికొని వారి పూర్వ ఋణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని అతని అనుయాయులు అనేవారు.
దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం – ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు అని బాబా అనేవారు. దగ్గరకు వచ్చినవారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవారు. “దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాసం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారియెడల కుక్కలాగా మొరగవద్దు” అని చెప్పాడు.
బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని ప్రసిద్ధ వాక్యాలు – “నేనుండగా భయమెందులకు?"అతనికి మొదలు లేదు... తుది లేదు ",. తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.:
షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.
నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవుసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
నా సమాధినుండి నేను మాట్లాడుతాను.
నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.
మీరు నావంక చూడండి. నేను మీవంక చూస్తాను.
మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.
మత సామరస్యం
“ హిందువుల దైవమైన శ్రీ రాముడు, ముస్లిం ల దైవమైన అల్లా ఒక్కరే ! ఇరువురి బోధనల సారాంశం ఒక్కటే – అందరి దైవం ఒక్కరే ! కనుక మీలో మీరు కలహించుకోవడం మాని సోదరుల వలె కలిసి మెలిసి జీవించండి.”
సర్వాంతర్యామి అయిన ఆ భగవంతునిని సేవించుటకు మత భేదం ఆటంకం కాకూడదు
ఒక ముస్లింకు సంతానం కలిగితే శిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. సాయి అతనిని అల్లా అచ్చా కరేగా అని దీవించారు. కొంత కాలానికి అతని కోరిక ఫలించి కొడుకు పుట్టాడు.”వెళ్ళి మారుతీ ఆలయం లో మిఠాయి పంచు” అన్నారు.మారుతీ ఆలయం లో మిఠాయి పంచి తిరిగి సాయి వద్దకు రాగా ఆయన ఎంతో ఆనందంతో అతనిని కౌగలించుకొని అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు.
"అందరి దైవం ఒక్కరే. మతం అనేది ఆ దైవాన్ని చేరుకునే ఒక మార్గం మాత్రమే".
"ఖురానును చదవగానే సరి కాదు, అందులోని సారాంశాన్ని వంట పట్టించుకొని ఆచరించాలి.”
భక్తులు, పూజా విధానాలు
ఖండోబా ఆలయంలోని పూజారి మహాల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి. తరువాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు, విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరి కొద్దిమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును. 1910 తరువాత ఒక భక్తుడైన దాసగణు తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు. అప్పటినుండి దేశంలో చాలా ప్రాంతాలనుండి హిందూ, ముస్లిమ్ భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రాసాగారు. బాబా జీవిత కాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ, పార్శీ భక్తులు కూడా షిరిడి సాయి దర్శనానికి రాసాగారు.
షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.
దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ సాయిబాబా మందిరాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్…లో అనెక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి. సాయి బాబా గురించి అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింపబడుతున్నది. అయితే సాయిబాబా ఆరాధనోద్యమంలో కొద్దిపాటి మాత్రమే షిరిడి సాయి సంస్థానం మార్గదర్శకత్వ వ్యవస్థలో ఉంది. అధికంగా భక్తులు, పూజలు, ఆలయాలు అక్కడి ప్రజల సంకల్పానుసారం ఏర్పాటు చేయబడుతున్నది.
భారత దేశం వెలుపల అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా సాయి బాబా భక్తులు, ఆరాధనా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
షిరిడీలోని సాయిమందిరానికి సగటుమ రోజూ 20 వేల మంది సందర్శకులు వస్తారని. కొన్ని ప్రత్యేక దినాలలో ఈ సంఖ్య లక్షవరకూ ఉంటుందని అంచనా.
మహిమలు
సాయిబాబా భక్తులు అనుచరులు చెప్పే కథనాల ప్రకారం సాయిబాబా పెక్కు మహిమలు కనబరచారు. వీటిలో ఎక్కువగా హేమాండ్ పంతు రచించిన ‘సాయి సచ్చరిత్ర’లో ప్రస్తావించబడ్డాయి. దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయడం, ఖండ యోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, గాలిలో తేలి ఉండడం, ప్రకృతి శక్తులను నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాలు తెలిసికోవడం, దూర ప్రాంతాలలోని భక్తులకు తన సందేశం తెలియజేయడం వంటివి ఇలాంటి మహిమలలో కొన్ని.
తన భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా బాబా అనేక భక్తులకు కలలలోను, మనోధ్యాన సమయంలోను దర్శనమిచ్చి మార్గ నిర్దేశనం చేయడం, కష్టాలనుండి విముక్తి కలిగించడం వంటి మహిమలు కనబరచినట్లు పెక్కు భక్తులు చెబుతుంటారు. ఇటువంటి విషయాలు భక్తుల సత్సంగ కార్యక్రమాలలో తరచు చెప్పబడతాయి.
చారిత్రిక ఆధారాలు
1916లో గోవిందరావు రఘునాధ దభోల్కర్ (ఇతనికి సాయిబాబా ‘హేమాండ్ పంత్’ అనే పేరు పెట్టారు) మరాఠీలో వ్రాసిన ‘సాయి సచ్చరిత్ర’ అనే గ్రంధం సాయిబాబా జీవిత విశేషాలకు సంబంధించన ముఖ్యమైన ఆధారం. ఈ రచయిత స్వయంగా సాయిబాబా సన్నిహిత అనుచరుడు. ఎక్కువ విషయాలు తను ప్రత్యక్షంగా చూచినవి లేదా బాబా మాటలలో చెప్పినవి లేదా ప్రత్యక్ష సాక్షులు చెప్పినవి వ్రాశాడు. ఈ గ్రంధం దాదాపు అన్ని భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువదించబడింది. తెలుగుగ లో ప్రత్తి నారాయణరావు అనువదించిన ‘సాయి సచ్చరిత్ర’ ఒక నిత్య పారాయణ గ్రంధంగా పెక్కు భక్తులు పరిగణిస్తారు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ వ్రాసిన ‘సాయి చరిత్ర, సందేశం’, స్మృతి శ్రీనివాస్, ఆంటోనియో రిగోపోలస్ వంటి వారు వ్రాసిన సాయిబాబా జీవిత చరిత్రలు వారు విన్న విషయాలపై ఆధారపడినవి. గణేష శ్రీకృష్ణ ఖర్పడే వ్రాసిన ‘షిరిడి దినచర్య’ కూడా ఒక ముఖ్యమైన ఆధారం. తొలి తెలుగు శిరిడీ సాయి చరిత్ర ను (1957) వేమూరి వెంకటేశ్వరరావు గారు వ్రాసినారు. ఇంకా బి.వి.నరసింహస్వామిజీ రచించిన ‘సాయి సందేశం’ కూడా ముఖ్యమైన తెలుగు గ్రంథం.
వివిధ మతాలలో అభిప్రాయాలు
హిందూమతంలో
సాయిబాబా జీవితకాలంలోనే యెవాలా ఆనందనాధ్ అనే సాధువు బాబను ఒక ఆధ్యాత్మ వజ్రంగా అభివర్ణించాడు.. గంగాగిర్ అనే మరొక సాధువు కూడా ఇదే భావాన్ని వెలిబుచ్చాడు. బాబాను అమితంగా విశ్వసించిన బేడేకర్ మహారాజ్ 1873లో బాబాను దర్శించుకొన్నపుడు ఆయనను జగద్గురు అని సంబోధించాడు.టెంబే స్వామీజీ అనబడే వసుదేవానంద సరస్వతి కూడా బాబాను అమితంగా గౌరవించాడు. చాలా మంది శైవ సాధువులు కూడా బాబాను ఆరాధించారు. స్వామి కాళేశ్వర్ బాబాను తన దైవ సమానుడైన గురువుగా పూజించారు.సత్యసాయిబాబా తనను తాను షిరిడీ సాయిబాబా అవతారమని చెప్పుకొన్నారు.
ఇతర మతాలు
అధికంగా సూఫీ సంప్రదాయానికి చెందిన మహమ్మదీయులు సాయిబాబాను గురువుగా పరిగణించడం జరుగుతున్నది. మెహెర్ బాబా సాయిబాబాను కుతుబ్ ఎ ఇర్షాద్ (అత్యుత్తమమైన కుతుబ్) అని అభివర్ణించాడు. జోరాస్ట్రియన్ మతానికి చెందిన నానీ ఫాల్కీవాలా, హోమీ భాభా వంటి ప్రముఖులు కూడా సాయిబాబాను విశ్వసించారు.

No comments:
Post a Comment