Friday 22 July 2016

Laughing Buddha(లాఫింగ్ బుద్ధా)





 Laughing Buddha(లాఫింగ్ బుద్ధా)


లాఫింగ్ బుద్ధామనిషి సంతోషానికి  ప్రతీక.ఈ లాఫింగ్ బుద్ధా ఇంటిలో సంపద , ఆర్దికాభివ్రుద్ది  మరియు విజయాలను ప్రసాదిస్తుంది.సరి అయిన దగ్గర ఉంచడంలోనే ఉంది కిటుకంత .ఫెన్గ్శుఇ నిపుణునుల సలహా తీసుకుని సరి అయిన ప్లేస్ లో ఉంచుకోని తక్షణ ఫలితాన్ని పొందండి.మొదిటి ద్వారానికి ఎదురుగ చిన్న tabal పైన ఉంచండి .అదృష్టాన్ని ఆహ్వానించండి.



Laughing Buddha signifies a happy man. It invites WEALTH, FINANCIAL GAINS and SUCCESS in the house. Placing the portrait in the right direction is very important as the energy, which enters your house is greeted by the laughing Buddha. Therefore, place it on the corner table, which is facing the front door.

అదృష్టాన్నిచ్చే లాఫింగ్ బుద్ధాను ఎక్కడ పెట్టాలో తెలుసా?



బాన బొజ్జ, గుమ్మడికాయ లాంటి పెద్ద తల, చిరు నవ్వులు చిందించే రూపం చూడగానే మన పెదవులు విచ్చుకుంటాయి. ముఖం నవ్వుతో విప్పారుతుంది. మనసు ఆహ్లాదంగా మారుతుంది. కాస్తంత సెంటిమెంటూ గుర్తుకు వస్తుంది. చాలా ఇళ్ళల్లోని షో కేసుల్లో, టీపాయిలపైన, ఆఫీసు టేబుల్స్‌మీద, షాపులు, దుకాణాలు, మనం ప్రయాణించే క్యాబ్‌లు, సొంత కార్లు... ఇలా ఎన్నో చోట్ల ఎక్కడైనా సరే ఈ ఆకారం దర్శనమిస్తుంది. బహుశా ఈ వర్ణనల్ని పోల్చుకునే ఉంటారు! ఆయనేనండీ లాఫింగ్‌ బుద్ధా.
 
భారతావనిలో రెండు దశాబ్దాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన, చేతుల్లో ఇమిడిపోయే రంగుల విగ్రహం లాఫింగ్‌ బుద్ధా! ఈ ప్రతిమ ఇంట్లో ఉంటే సుఖసంతోషాలు పొంగి పొర్లుతాయనీ, సంపద తాండవిస్తుందనీ, అదృష్టం కలిసొస్తుందనీ.. ఎన్నో నమ్మకాలు మనలో! దీన్ని ఆఫీసులో ఎదురుగా పెట్టుకుంటే మానసిక ప్రశాంతత, దుకాణాల్లో పెట్టుకుంటే వ్యాపారాభివృద్ధి అని నమ్మేవాళ్లు చాలామందే ఉన్నారు. పూజాదులేవీ చేయకపోయినా లాఫింగ్‌ బుద్ధా సుఖశాంతులనిస్తుందనీ, సిరిసంపదలు కురిపిస్తుందనీ పెంగ్‌షూయ్‌ నిపుణులంటారు. కాబట్టే మనదేశంతోపాటు చైనా, జపాన్ వంటి దేశాలుసహా ప్రపంచవ్యాప్తంగా లాఫింగ్‌ బుద్ధాకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది.
 
అసలెవరీ లాఫింగ్‌ బుద్ధా?
అత్యంత ప్రాధాన్యం దక్కించుకున్న పెంగ్‌షూయ్‌ వస్తువుల్లో లాఫింగ్‌ బుద్ధా ఒకటి. మనం ఇళ్లలో లక్ష్మీదేవిని పూజించినట్టే బౌద్ధ మతంలో కూడా లాఫింగ్‌ బుద్ధాని ఐశ్వర్య ప్రదాతగా భావించి పూజిస్తారు. లాఫింగ్‌ బుద్ధా మూర్తి ఇంట్లో ఉంటే అదృష్టం కలిసివస్తుందని మాత్రమే మనలో చాలామందికి తెలుసు. హ్యాపీబుద్ధా, బుదాయి, కైసీ, మైత్రేయ, హొటై ఇలా విభిన్నమైన పేర్లతో లాఫింగ్‌ బుద్ధాను పిలుస్తారు. ఈ పిలుపుల వెనుక వివిధ దేశాల్లో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
 
మనదేశ పురాణకథ
బౌద్ధమతం పుట్టింది మనదేశంలోనే. చెక్కు చెదరని ఆ ఆనవాళ్లు మనదేశంలో ఉన్నాయి. అయితే విదేశాలలోనే ఎక్కువ ప్రాచుర్యం సంపాదించుకున్న మతం బౌద్ధం. యావత్ మానవాళి కష్టాలు చూసి బుద్ధ భగవానుడే ఆనాటి జనబాహుళ్యాన్ని ఓదార్చాడు. శాంతం, సహనం, ఓర్పు, దయ బుద్ధుడి సొంతం. అదే ఆయన ప్రవచనం. సాక్షాత్తూ బుద్ధుడే మైత్రేయగా అవతరించాడన్నది మనదేశంలో ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథ.
 
వరాల బొజ్జ మూర్తి!
థాయిలాండ్‌ చరిత్ర ప్రకారం ఆ దేశంలో ఒకప్పుడు సంకాజాయ్‌ అనే ఒక సాధువు ఉండేవారట. మగవారు సైతం ముచ్చటపడేంత అందంగా ఉండే ఆ సాధువును ఎంతో మంది అభిమానించేవారట. ఈ పరిస్థితి అతనికి చాలా ఇబ్బందికరంగా అనిపించి తన రూపాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడట. అనుకున్నదే తడవుగా బాన బొజ్జతో పాటు శరీరాన్ని లావుగా పెంచుకున్నాడని చెబుతారు. ఆయనకి థాయిలాండ్‌లో చాలా చోట్ల దేవాలయాలు నిర్మించారు. థాయ్‌ ప్రజలు సంకాజాయ్‌ సాధువును ఈనాటికీ అదృష్ట దేవుడిగానే భావిస్తారు. ఇప్పటికీ అలా సంకాజాయ్‌ మూర్తి పూజలు అందుకుంటోంది. వరాలన్నీ ఆయన పొట్టలోనే ఉంటాయని అందుకే దానిపై చేత్తో రాస్తే అదృష్టం వరిస్తుందని థాయిలాండ్‌ ప్రజల నమ్మకం.
 
చైనాలో హూతీ
లాఫింగ్‌ బుద్ధాను చైనాలో హూతీ అని పిలుస్తారు. సుమారు వెయ్యేళ్ల క్రితం లియాంగ్‌ వంశస్థులు చైనాను పాలిస్తున్న రోజుల్లో బుద్ధుడు తమ దేశానికి వచ్చాడని అప్పట్లో ఆయన్ను హూతీ అని పిలిచేవారని కొందరు చెబుతారు. అయితే సన్యాసి జీవితం గడిపే బుద్ధుడు పెద్దపొట్టతో, నిత్యం నవ్వుతూ, భుజాన సంచి, చేతిలో పాత్రతో తిరిగేవాడట. ఆయన మహిమల గురించి తెలియని వారికి బుద్ధుడు కేవలం ఓ భిక్షగాడు మాత్రమే. తెలిసిన వారికి మాత్రం ఓ ఆపద్భాంధవుడు. తన చుట్టూ చేరిన పిల్లలందరికీ తన సంచీలోని తినుబండారాలు, మిఠాయిలు పంచేవాడట. తినుబండారాలు ఎంతమంది పిల్లలకు పంచిపెట్టినా ఆ చిన్న సంచిలోంచి ఇంకా ఇంకా వస్తూనే ఉండేవట. ఆయన్ను దర్శించిన వారందరికీ ఆ రోజంతా చాలా ఆనందంగా ఉత్సాహంగా గడిచిపోయేదట. అందుకే చైనాలో లాఫింగ్‌ బుద్ధాను అదృష్టానికి సూచనగా భావించి పూజిస్తారు. కొందరు పూతాయ్‌గా పిలిచేవారట. హూట్టే అనే పేరే క్రమంగా పూతాయ్‌గా మారిందని చెప్తారు. ఇక జపాన్‌లో అయితే లాఫింగ్‌ బుద్ధాను ఆ దేశంలో ఉన్న ఏడుగురు అదృష్ట దేవుళ్ళలో ఒకరుగా పూజిస్తారు.
 
ఎన్నో రూపాలు
లాఫింగ్‌ బుద్ధాకు ఎన్నో రూపాలు. మార్కెట్లో లాఫింగ్‌ బుద్ధా విగ్రహాలు మనకు వివిధ ఆకారాల్లో దర్శనమిస్తాయి. వాటిలో ఒక్కొక్క ఆకారానికి ఒక్కొక్క అర్థం కూడా ఉంటుంది. ఒక్కోరూపం ఒక్కొక్కరకమైన లాభాన్నిస్తుందట. మరి లాఫింగ్‌ బుద్ధాలో ఎలాంటి ఆకారాలున్నాయో, వాటి లాభాలేంటో వివరాలు చూద్దామా!
 
నిల్చుంటే ఆరోగ్యం
రెండు చేతులు పైకెత్తి బంగారు బంతులు మోస్తూ కనిపించే బుద్ధుడి ప్రతిమను ఆరోగ్యప్రదాతగా భావిస్తారు. ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలుగుతుందట. నవ్వుముఖంతో నిలబడి ఉన్న విగ్రహం ఇంటికి సకల సంపదలను, సుఖసంతోషాలను చేకూర్చేదిగా భావిస్తారు.
 
పిల్లలతో ఆడుకునే భంగిమ
పిల్లలతో ఆటలు ఆడుతున్న భంగిమలో ఉండే లాఫింగ్‌ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందట. అదృష్టం నేరుగా స్వర్గం నుంచి దిగి వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే చిన్న పిల్లల మాదిరి. లాఫింగ్‌ బుద్ధా కూడా స్వతహాగా జాలి, కరుణ అమాయకత్వం వంటి లక్షణాలు కలిగినవాడు కావడం వల్ల అతనిలోని ఈ మంచి గుణాలన్నీ అదృష్టం రూపంలో మనకు దక్కుతాయి.
 
చేత గిన్నెతో..
చేతిలో గిన్నెతో ఉన్న లాఫింగ్‌ బుద్ధ ప్రతిమ జ్ఞానాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు. ఈ రూపం దానధర్మాలకు ప్రతీకగా నిలిచిన చైనా బౌద్ధ భిక్షువుకి నిదర్శనంగా భావిస్తారు. మనం కూడా ఎవరికైనా దానం చేస్తే కష్ట సమయాల్లో మనకూ సహాయం అందుతుందని చైనా ప్రజలు విశ్వసిస్తారు.
 
విసనకర్రతో ఉంటే..
చేతిలో విసనకర్ర లేదా కర్రతో ఉన్న లాఫింగ్‌ బుద్ధ దూర ప్రయాణాల్లో మనకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ కల్పిస్తాడట.
 
బంగారు నాణాలపై కూర్చుని..
బంగారు నాణాల మీద కూర్చుని ఉన్న లాఫింగ్‌ బుద్ధా విగ్రహం ఇంట్లో ఉంటే అదృష్టం. ఈ ప్రతిమ ఆరోగ్య ప్రదాతే కాదు సమృద్ధిగా సిరిసంపదలు సమకూరుస్తుందట. బంగారు రంగులో ఉండే ప్రతిమ నెగెటివ్‌ శక్తులను హరిస్తుందని, ఆదాయం పెంచే అవకాశాలను అందిస్తుందని చెబుతారు.
 
జ్ఞానప్రదాత
మెడలో ముత్యాలు బీడ్స్‌ లేదా చేతిలో బంతిని కలిగి ఉన్న విగ్రహం ధ్యానం, సంపద, మంచి ఆరోగ్యానికి ప్రతీకగా చెబుతారు. క్రిస్టల్‌తో తయారు చేసిన లాఫింగ్‌ బుద్ధ జ్ఞానాన్ని పెంచుతుంది.
 
ఇంట్లో ఎక్కడ పెట్టాలి?
అదృష్టాన్ని తెస్తోంది కదా అని లాఫింగ్‌ బుద్దా విగ్రహాలను ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఒక నిర్దేశిత స్థలంలో, నిర్దేశిత దిశలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించాలి. అలా సక్రమంగా ప్రతిష్టించినప్పుడే అనుకున్న ఫలితాలు పొందుతారట.
 
1. నిలబడి ఉన్న బుద్ధుడి ప్రతిమను తూర్పుదిశకు అభిముఖంగా ఉంచాలి. కుటుంబంలో సమస్యలు తొలిగిపోయేందుకు ఇంట్లో వాళ్లందరికీ పదే పదే కనిపించే ప్రదేశాన్ని ఎంపికచేసి పెట్టాలి. లివింగ్‌ రూమ్‌ లేదా ప్రధాన హాల్‌లో పశ్చిమాభిముఖంగా కూడా ఉండవచ్చు.
 
2. బంగారు నాణాలపై ఉండే బుద్ధుని ప్రతిమ వాయువ్య దిశలో, ఉత్తరం లేదా దక్షిణాభిముఖంగా ఉండాలి. ఒకవేళ వాయువ్యం దిశలో స్నానాల గది లేదా వంటిల్లు ఉన్నచోట ఈ ప్రతిమను ఆగ్నేయంలో ఉంచడం మేలు.
 
3. పిల్లలతో ఆడుకుంటున్న మూర్తిని హాల్‌లో కానీ, చిన్న పిల్లల బెడ్‌రూమ్‌లో కానీ దక్షిణ దిశలో ఉంచడం మంచిది.
 
4. ముత్యాలు, బీడ్స్‌ ఉన్న విగ్రహాన్ని స్టడీ రూమ్‌లో ఉంచితే దాని నుంచి వచ్చే పాజిటివ్‌ సిగ్నల్స్‌ పిల్లల మనసును ప్రశాంతంగా ఉంచుతాయని నమ్ముతారు. ఇంటి యజమాని ఆదాయం పెరగాలంటే ఈ విగ్రహాన్ని హాల్‌లో ఈశాన్య దిశలో ఉంచాలి.
 
5. నవ్వుతూ నిలబడి ఉన్న విగ్రహాన్ని ఆఫీసులో మనకి కనిపించేలా ఎదురుగా పెట్టుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి సహోద్యోగులతో బంధం మెరుగుపడుతుందని నమ్ముతారు.
 
6. లాఫింగ్‌ బుద్ధా విగ్రహాలను ఎక్కడ పెట్టినా కంటికి సరాసరి కనిపించేలా లేదా కాస్త ఎక్కువ ఎత్తులో పెట్టుకుంటే మంచిదన్నది వాస్తు నిపుణుల అభిప్రాయం.
 
7. కరెంటు తీగలు, స్విచబోర్డుకు దగ్గర్లో వీటిని పెట్టడం అస్సలు మంచిది కాదని కొందరి నమ్మకం. లాఫింగ్‌ బుద్ధా విగ్రహాలను నేరుగా ఫ్లోర్‌ మీదా టీవీలపై పెట్టడం, బాత్రూంలలో ఉంచడం వంటివి మంచి పద్ధతులు కావని వాస్తు నిపుణుల అభిప్రాయం
 
8. ఇంట్లో సూర్యకిరణాలు ప్రసరించే ప్రదేశంలో సింహద్వారానికి ఎదురుగా వీటిని ఉంచితే మంచి జరుగుతుందన్న విశ్వాసం కూడా కొందరిలో ఉంది.
 
లవర్‌కి కానుకగా ఇస్తే? ప్రేమించే వారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? లాఫింగ్‌ బుద్ధాను ప్రేమికులకు కానుకగా అందజేస్తే వారి ప్రేమ జీవితాంతం చిరస్థాయిగా నిలిచిపోతుందని పెంగ్‌షుయ్‌ నిపుణులు చెబుతారు. పెద్ద పొట్టతో హాయిగా నవ్వుతూ ఉండే బుద్ధుడి బొమ్మ బహుమతిగా ఇవ్వాలట. దీనివల్ల ప్రేమ మరింత బలపడి ఎలాంటి కలతలూ రాకుండా ఉంటాయట. వివాహబంధం బాగుంటుందట.
 

No comments:

Post a Comment