శ్రీవారి పాదాలు..
బ్రహ్మకడిగిన పాదములవి. సాక్షాత్తూ ఆ వైకుంఠనారాయణుని పాదములు. ముల్లోకములను ఏలగల పాదములు. భక్తులకు ముక్తి చూపే పాదములు. నిత్యకళ్యాణం పచ్చతోరణం చేయగల పాదములు. అలాంటి పాదములకు హాని జరిగింది. ఆ దేవదేవుడు దివి నుంచి భువికి వచ్చినందుకు గుర్తుగా చెప్పే పాదములు చెదిరాయి. తిరిగి వాటి ప్రతిష్ట చేశారు. సరే, ఆ పాదముల మహత్యమేంటి? శ్రీవారి విషయంలో పాదాల ప్రాముఖ్యత ఏమిటి?
శ్రీహరిని అవమానించినవీ పాదములే
సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే
భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే
లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే
సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే
ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు
వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే.
మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే..
ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత వున్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు? అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మకడిగిన పాదములవి. బ్రహ్మము తానెడి పాదములవి. ఆ పాదాలకు ఎక్కడా లేని పౌరాణిక ప్రాధాన్యత ఉంది.
శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. అందుకే వీటి కాలి బొటనవేలు తొలగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శ్రీవారి విషయంలో ఏదైనా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఏ చిన్ని లోపం జరిగినా ఇక్కడ సంప్రోక్షణ చేస్తారు. అసలే సిరి హరి విడిపోయింది పాదపీడనం వల్ల. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీ దేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం.. చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసాడు.
బ్రహ్మకడిగిన పాదములవి. సాక్షాత్తూ ఆ వైకుంఠనారాయణుని పాదములు. ముల్లోకములను ఏలగల పాదములు. భక్తులకు ముక్తి చూపే పాదములు. నిత్యకళ్యాణం పచ్చతోరణం చేయగల పాదములు. అలాంటి పాదములకు హాని జరిగింది. ఆ దేవదేవుడు దివి నుంచి భువికి వచ్చినందుకు గుర్తుగా చెప్పే పాదములు చెదిరాయి. తిరిగి వాటి ప్రతిష్ట చేశారు. సరే, ఆ పాదముల మహత్యమేంటి? శ్రీవారి విషయంలో పాదాల ప్రాముఖ్యత ఏమిటి?
శ్రీహరిని అవమానించినవీ పాదములే
సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే
భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే
లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే
సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే
ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు
వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే.
మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే..
ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత వున్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు? అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మకడిగిన పాదములవి. బ్రహ్మము తానెడి పాదములవి. ఆ పాదాలకు ఎక్కడా లేని పౌరాణిక ప్రాధాన్యత ఉంది.
శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. అందుకే వీటి కాలి బొటనవేలు తొలగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శ్రీవారి విషయంలో ఏదైనా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఏ చిన్ని లోపం జరిగినా ఇక్కడ సంప్రోక్షణ చేస్తారు. అసలే సిరి హరి విడిపోయింది పాదపీడనం వల్ల. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీ దేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం.. చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసాడు.
కాలి నడక మార్గంలో వెళ్ళేవారికి అలిపిరి ఓ పాదాల మండపం కనిపిస్తుంది. క్రీ.శ .1628 కాలం నాటిదీ మండపం. ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనన్ని దర్శనమిస్తాయి. మాధవదాసు అనే భక్తుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట. తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యo. ఆ రోజు ఉపవాసం ఉండటం, పిండితాళిగలు చేయడం సంప్రదాయం. ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని ఓఇంటిలో, కంచి ప్రాంతంలోని మరో ఇంటిలో పాదముద్రలు పడతాయట. ఆ పాద ముద్రలను కొలత ప్రకారం, శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు. శ్రీకాళహస్తి నుంచి ఒకరు, కంచి నుంచి మరొకరు.. శ్రీవారి చెప్పులను నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ వచ్చి.. అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు.
ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట. కారణమేంటో తెలుసా.. తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట. అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ.. వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం.
త్రం మరచిందేమో కానీ భక్తులకు శ్రీవారి పాదాల పట్ల అంతటి భక్తి విశ్వాసాలుంటాయి. శ్రీహరి పాదాలను వారు విపరీతమైన భక్తిభావములతో కొలుస్తారు. ఆనందనిలయంలో ఆ దేవదేవుడ్ని చూసినంత సంబరంగా భావిస్తారు. అందుకే ఆ పాదాల్లోని బొటన వేలు విరగడం గురించి అంతగా బాధపడ్డారు. వాటిని తిరిగి ప్రతిష్టించడంతో కథముగిసిందనే అనుకోవాలా? అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిందిది.
శ్రీపాదములంటే శ్రీనివాసుడు. శ్రీనివాసుడంటే శ్రీపాదములు. అందుకు తిరుమలనంబి వుదంతమే ఉదాహరణ. ఇంతకీ ఏమిటా కథనం? శ్రీవారి పాదలీలా మహత్యం?
ఆనందనిలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్ధం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధమట.
అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు. శ్రీవారంటే శ్రీనివాసుడని అర్ధం. స్వామి వారి పాదలే శ్రీపాదములు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే. కొండ నుంచి నంబి, గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్రామానుజులు.. ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారట. ఈ కారణంగా తిరుమలనంబికి శ్రీవారి మధ్యాహ్న పూజా భాగ్యం దక్కడం లేదనే కొరత ఉండేది. స్వామి తిరుమలనంబి విచారాన్ని గుర్తించి "శ్రీ పాదములు"గా ఇక్కడ అవతరించాడట. అలా తన చరణములే- శరణములని భక్తులకు సూచిస్తుంటాడా తిరుమలేశుడు. ఈ పాదములనే అన్నమయ్య.. బ్రహ్మకడిగిన పాదము- అని స్తుతిoచాడు.
అలా శ్రీవారు తన భక్తులను పాదదర్శనంతో కరుణిస్తుంటారు. అందుకే శ్రీవారి పాదములనగానే భక్తుల మనోభావాలు అంతెత్తున ఎగసిపడుతుంటాయి. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ, పాద పూజ- ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవనిర్వహణ జరిగేది. వీటినే "నారాయణ పాదములు" అంటారు. తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉందీ నారాయణ పాదం. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం కనిపించేది ఇక్కడే. ఆషాడ శుద్ధ ఏకాదశి- ద్వాదశి తిథిలో శ్రీపాద పూజ, ఛత్రస్థాపన ఉత్సవాలు చేస్తారిక్కడ.
శ్రీవారికి తెల్లవారుజాము, మధ్యాహ్నకాల ఆరాధన ముగిశాక నారాయణగిరికి వస్తారు. అర్చకులు, ఏకాంగులు, అధికారులు, పరిచారకులు రెండు భూచక్ర గొడుగులను, యమునోత్తరం నుంచి పుష్పసరాలను, బంగారు బావి నుంచి తీర్ధాన్ని సిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు దగ్గరకు రాగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి- ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు 'భూచక్ర గొడుగులను' కట్టి వెనుకకు తిరుగుతారు. తర్వాత నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు. ఆపైన ప్రసాద వినియోగం, వనభోజనం జరుగుతాయి. తర్వాత మహాద్వారం చేరుకొంటారు. అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించడం గౌరవించడం జరుగుతుంది. అలాంటి పాదముల విషయంలో చిన్న లోపం సంభవిస్తే దాన్ని మహాపరాధంగా భావిస్తుంటారాయన భక్తజనులు.
శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు, బంగారు పాదకవచాలను పక్కకు తీసి- స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట- భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు. అదీ శ్రీవారి పాదాలకున్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడిచేతిని- పాదాల వైపు చూపి దర్శించుకో.. తరిస్తావంటాడు. ఆయన తానున్నాని సూచించడానికి పాదాలను విశేషంగా వినియోగిస్తారు.
శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు.
ఆనందనిలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్ధం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు.
ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే. మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే.. శ్రీహరి అందునా శ్రీవేంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన "ఇల" వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే.
ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటా అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేసాడని చెబుతుంది భాగవతం.
ఇక వామనావతారంలోనూ బలితన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత వుంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడుతాయి. ఈ మధ్య అలాంటి నారాయణ పాదాలు పగిలి పాదాల నుంచి బొటనవేలు వేరుపడింది. బొటనవేలు చెదరడాన్ని చూసి.. ఇది ఏ దుశ్శకునమో అనుకున్నారందరూ. కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం ,పడాల మండపం .దీనినే పాదాల మండపం అని కూడా అంటారు .క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం .ఈ మండపంలో `పాదరక్షలు `లెక్కలేనన్ని ఉన్నాయి .`మాధవదాసు `అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యo .ఆ రోజు ఉపవాసం చేయడం ,పిండితాళిగలు వేయడం సంప్రదాయం .ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో ,కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి .ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు .శ్రీకాళహస్తి నుండి ఒకరు ,కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు .
తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో `నారాయణ పాదం` ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ, పాద పూజ- ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవనిర్వహణ జరిగేది. వీటినే "నారాయణ పాదములు" అంటారు.
ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాద పూజ,ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు,ఏకాంగులు, అధికారులు,పరిచారకులు రెండు `భూచక్ర ` గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను,బంగారు బావి తిర్ద్దాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు `భూచక్ర గొడుగులను` కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు.ఆఫై ప్రసాద వినియోగం,వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకొంటారు.
అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించడం గౌరవించడం జరుగుతుంది. శ్రీవారి పాదం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే.
ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటా అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేసాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలితన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత వుంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడుతాయి. మొన్న నారాయణపాదముల బొటనవేలు చెదరడాన్ని చూసి.. ఇది ఏ దుశ్శకునమో అనుకున్నారందరూ. ఇప్పుడు పునఃప్రతిష్టించారు కాబట్టి.. మరేవిధమైన ఆటంకములు కలుగక ఆ శ్రీహరి భక్తజనులను కరుణిస్తారని ఆశిద్దాం.
సర్వేజనాసుఖినోభవంతు!
No comments:
Post a Comment