ఆత్మ సాక్షాత్కారమే అంతిమ లక్ష్యం:
దివ్యశక్తి అందరిలోనూ ఉంది. అంతర్గతంగా ఉన్న ఆ దివ్యశక్తిని తెలుసుకోవడమే మన జీవితగమ్యం. ఆ గమ్యాన్ని చేరుకున్నవాడు ధన్యజీవి, దివ్యజీవి అవుతాడు. అంతర్గతంగా ఉన్న దివ్యశక్తిని అభివ్యక్తం చేయడం ఎలాగో స్వామి వివకానంద బోధించారు.
Each soul is potentially divine. The goal is to manifest this within by controlling nature, external and internal -Swami Vivekananda.
"ప్రతియాత్మ దివ్యంబే తత్వతః దివ్యంబే లోబయళ్ళ గల ప్రకృతిని స్వాధీనంబున నుంచుకొని అంతర్గతమగు దివ్యత్వమును అభివ్యక్త పరచుటె జీవితగమ్యం"
మనలో ఉన్న దివ్యత్వాన్ని ప్రస్ఫుటం చేయటం ముఖ్యంగా బాహ్య, అంతర ఇంద్రిాలను నియంత్రించడం వల్లనే సాధ్యమవుతుంది అని వివేకానంద బోధించారు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం ఆత్మసాక్షాత్కారానికి అత్యంత కీలకం.
ఇంద్రియాలను నిగ్రహించడం కోసం శమదమాలను అభ్యసించాలి. పంచ బాహ్యేంద్రియాలను నియంత్రించడం దమం అనీ, అంతరేంద్రియం అయిన మనసును నియంత్రించడం శమం అనీ శాస్త్రాలు చెబుతున్నాయి.
బాహ్య ఆకర్షణలకు లోనయ్యే స్వభావం కలవిగా భగవంతుడ్ ఇంద్రియాల్ని సృష్టించాడు. అలాంటి బహిర్ముఖమైన ఇంద్రియాలను అంతర్ముఖం చేయడం ఎలా?
Do this either by work, or worship, or psychic control or philosophy...Swami Vivekananda.
కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గాలలో ఏ ఒక్క మార్గాన్నైనా అవలంబించి బాహ్య, అంతర ఇంద్రియాలను నియంత్రించవచ్చని స్వామి వివేకానంద బోధించారు.
నిష్కామ సేవతో (కర్మయోగం)గానీ, జపతప సాధనలతో (భక్తియోగం)తో గానీ, ధ్యానంతో (రాజయోగం) గానీ, నిత్యానిత్యవస్తు వివేకంతో (జ్ఞానయోగం) గానీ ఇంద్రియాలను నియంత్రించి మన గమ్యస్థానమైన పరమపాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. అలా భగవంతుణ్ణి చేరడానికి నిత్యం సాగే మన గమనమే జీవన యాత్ర.

No comments:
Post a Comment