Monday, 4 July 2016

పడకగదిలో పుస్తకాలు పెట్టుకోవచ్చా...........!!(ఫెంగ్‌షుయ్ టిప్స్)


 పడకగదిలో పుస్తకాలు పెట్టుకోవచ్చా...........!!(ఫెంగ్‌షుయ్ టిప్స్)

పడకగదిలో పుస్తకాలకంటూ అలమరాను కేటాయించాం. అయితే బెడ్ రూమ్‌లో పుస్తకాలు పెట్టుకోవడం మంచిది కాదని విన్నాం.. నిజమేనా...? అoటూ చాల మందికి డౌట్ ఉంటుంది కదా....

కాదు. పుస్తకాలు పడకగదిలో ఉండటం ఫెంగ్ షుయ్ ప్రకారం చెడును కలిగించదు. నిద్రించేందుకు ముందు కొంతసేపు పుస్తకాలను చదవడం మంచిదే. ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన పుస్తకాలు.. మహాత్ముల జీవిత గాథలను చదవొచ్చు.
అయితే నిద్రించేందుకు ఉపక్రమించేందుకు ముందు పుస్తక అలమరాలను మూతపెట్టడం మంచిది. పుస్తకాలు పడకగదిలో మూతపెట్టే షెల్ఫ్‌ల్లో ఉండటం ద్వారా మంచి శక్తినిస్తుందని ఫెంగ్ షుయ్ చెబుతుంది. పుస్తకాల చదవడం ద్వారా మాములుగా మానసిక ప్రశాంతత లభిస్తుందని.. ఇంకా ఉన్నతమైన పుస్తకాలను నిద్రించేందుకు ముందు చదవడం ద్వారా మనలో పాజిటివ్ శక్తులు పెరుగుతాయి.

No comments:

Post a Comment