వర్షారంభమాసం .....ఆషాఢం
ఆషాఢం వర్షారంభమాసం. ఆషాఢంలో ఆరంభమయ్యే వర్షం కార్తీకం వరకూ సాగడం వ్యవసాయానికి జీవం! అందువల్లనే ఆషాఢంలో మొదటి రోజున యక్షునికి వర్ష మేఘం కనిపించింది. వర్షం జీవనానికి హర్షం. నీరు అమృతం...అన్నాన్ని ప్రసాదించే ప్రకృతి వరం. నీరు లేనిదే పంట లేదు, తిండిలేదు. గ్రీష్మతాపంతో ఆవిరిగా మారి ఆకాశంలో సభ తీరే ‘నీరు’ అక్కడే ఉండిపోయినట్లయితే వర్షం లేదు, వ్యవసాయం లేదు, పంటలేదు, మానవాళికి తిండి లేదు. నింగికెగిరిన నీరు మళ్ళీ నేలతల్లి ఒడిలోకి చేరడానికై చినుకు చినుకుగా వర్షధారగా దిగివస్తోంది. ఇలా వర్షం కురవడానికి శ్రీకారం ఆషాఢమాసం.
పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే మాసం ఆషాఢం. ప్రధానంగా కాలినడకన నిరంతరం పరిక్రమించే పరివ్రాజకులైన యతులు ఆషాఢపౌర్ణమి నుండి నాలుగు నెలలపాటు అంటే కార్తిక పౌర్ణమి వరకు స్థావర దీక్షలో ఉంటున్నారు. ఒకేచోట ఉండిపోతారు. ఇదే చాతుర్మాస్య వ్రతం!

No comments:
Post a Comment