అందరం ప్రతినిత్యం చదువుకునే ఈ లలితా సహస్రనామాలు కూడా హయగ్రీవుని ద్వారానే వచ్చాయి. హయగ్రీవుడు చదువులకు అధిదైవం. జ్ఞానం, విద్య, సద్య స్ఫురణ, సృజనాత్మకత కావాలనుకునే వారు హయగ్రీవుని ఆరాధించాలి. అవి కావాలని అందరూ కోరుకుంటారు కనుక అందరూ హయగ్రీవుని ఉపాసన చేయడం మంచిది.
శ్రవణానక్షత్రం ఏ పూర్ణిమనాడుంటే ఆ మాసాన్ని శ్రావణమాసం అంారు. శ్రవణం శ్రీహరి జన్మ నక్షత్రం. పూర్ణిమ లక్ష్మీదేవి పుట్టినతిథి. ఆ రెండు కలిసిన శ్రావణపూర్ణిమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పఠికాకృతిమ్
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే
దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీహరి దాల్చిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకి. సమస్త విద్యలను, జ్ఞానాన్ని పాండిత్యాన్ని అనుగ్రహించే శ్రీ గురుమూర్తి హయగ్రీవ స్వామి.
గుర్రపుముఖంతో, నరశరీరంతో, చతుర్భుజుడై శంఖచక్రాలను ధరించి వామాంకంలో లక్ష్మీదేవి సహితంగా ఆవిర్భవించిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హయగ్రీవస్వామి.
బ్రహ్మాండ పురాణంలో : హయగ్రీవస్వామికి సంబంధించిన మరొక పురాణగాథ బ్రహ్మాండ పురాణంలో ప్రచారంలో ఉంది. ఒకప్పుడు అగస్త్య మహర్షి శ్రీ లక్ష్మీహయగ్రీవస్వామిని ఉపాసించాడు. ఆ స్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. జగజ్జనని శ్రీ లలితా పరమేశ్వరుని గూర్చి ఏమి ఉపదేశించినా సరే అన్నాడు. అప్పుడు హయగ్రీవస్వామి శ్రీ లలితా అమ్మవారి మంత్రాన్ని అంగన్యాస, కరన్యాస పూర్వకంగా ఉపదేశించడమే కాకుండా, లలితాదేవి మహత్యాన్ని గూర్చి విపులంగా చెప్పాడు. అమ్మలగన్న అమ్మను గూర్చి సర్వవిధాల ఉపదేశించారు. కానీ, ఇంకొక కొరత ఉన్నది. అదే లలితా పరాబట్టారికా సహస్రనామస్తోత్ర వైశిష్ట్యాన్ని వీరు చెప్పకపోవడం వెలితిగా ఉంది అన్నాడు మహర్షి. అప్పుడు హయగ్రీవస్వామి అతి రహస్యమైనది, మహిమ గలది లోకక్షేమం కోసం, పరమేశ్వరీ సంకల్పంతో దాన్ని ఉపదేశిస్తాను అన్నాడు.
శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్నికుండసంభూతా దేవకార్య సముద్యతా
శ్రీ చక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ
శ్రీ శివా శివశక్యైక్య రూపిణి లలితాంబికా
ఏవం శ్రీలలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః...
ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరాఖండే శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితాసహస్రనామ స్తోత్రకథనం సంపూర్ణం....
అంటూ జరిగిన శ్రీహయగ్రీవస్వామి, అగస్త్య మహర్షి వారల సంవాదం వల్ల అత్యంత రహస్యమైన మహిమగల లలితా సహస్రనామం లోకానికి అందింది.
హయగ్రీవుని విశాల ఆలయం అస్సాంలో ఉంది. తిరుమల శ్రీహరి ఆలయ మహా ప్రదక్షిణ మార్గంలో శ్రీ లక్ష్మీహయగ్రీవ ఆలయం ఉంది.
ఆధ్యాత్మిక, చైతన్యాన్ని జ్ఞానాన్ని అందిస్తూన్న యజ్ఞమయ, విద్యామయ, దేవతామయ రూపం హయగ్రీవ స్వరూపం. శ్రావణపూర్ణిమనాడు హయగ్రీవ ఆరాధన చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
ఈ హయగ్రీవుని గురించి వేరు వేరు పురాణాలు వేరు వేరు గాథలను చెపుతున్నాయి.
ముఖ్యంగా అందరం ప్రతినిత్యం చదువుకునే ఈ లలితా సహస్రనామాలు కూడా హయగ్రీవుని ద్వారానే వచ్చాయి. హయగ్రీవుడు చదువులకు అధిదైవం. జ్ఞానం, విద్య, సద్య స్ఫురణ, సృజనాత్మకత కావాలనుకునే వారు హయగ్రీవుని ఆరాధించాలి. అవి కావాలని అందరూ కోరుకుంటారు కనుక అందరూ హయగ్రీవుని ఉపాసన చేయడం మంచిది.
No comments:
Post a Comment