హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా,
రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు.
ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని
ఆరాధిస్తారు
హనుమంతుడు అంజనాదేవి, కేసరిల
పుత్రుడు. వాయుదేవుని ఔరస
పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని
సఖుడు. ఎర్రని
కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన
సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకము
ను హరించినవాడు.
ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి
యుద్ధమున వివశుడైన లక్ష్మణుని
ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు.
హనుమంతుని ఈ నామములు
నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.
హనుమాన్ జయంతి సందర్భముగా భక్తులు హనుమాన్ చాలీసా
పారాయణం చేస్తుంటారు.
ఆంజనేయ
స్వామి ధర్యానికి ప్రతీక. శక్తి సామర్ధ్యాలకు ప్రతీక హనుమత్
రూపం. సముద్రం
దాటి లంక చేరాడు. ఆకాశ మార్గములో ప్రయాణం చేసి
సీతమ్మ జాడ కనిపెట్టారు.
సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీర
హనుమాన్ శక్తి యుక్తులను
కీర్తించడం సాధ్యమా?
హనుమాన్
జయంతిని కొందరు చైత్ర పౌర్ణమి నాడు చేస్తుండగా మరికొందరు
వైశాఖ దశమి నాడు
జరుపుకుంటారు. ఇక కేరళ రాష్ట్రం లో మార్గశిర మాసం
లో హనుమత్ జయంతిని
జరుపుకుంటారు.
హనుమంతుడు
అంతులేని పరాక్రమవంతుడయ్యివుండి కూడా శ్రీరాముని
సేవలో గడపడానికే ఎక్కువ
ప్రాధాన్యత ఇచ్చాడు. ఆన్జనేయునికి
శ్రీరాముడంటే ఎంత భక్తి ప్రపత్తులంటే తన
మనసునే మందిరంగా చేసి
ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే
దర్శనం
ఇచ్చారని శ్రీరామున్ని సీతమ్మ తల్లికంటె మిన్నగా ప్రమించాడు
హనుమంతుడు.
ఒకసారి
సీతమ్మ నుదుటున సిందూరం పెట్టుకోవడ చూసి సింధూరం
ఎందుకు
పెట్టుకున్నావమ్మా? అని అడుగుతాడు. అందుకు సీతమ్మ నవ్వి "
శ్రీరాముడు
దీర్ఘాయుష్కుడిగా వుండాలని చెపుతుంది. అంతే హనుమంతుడు
ఒక్క క్షణం ఆలస్యం
చేయకుండా ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాడు.
అదీ హనుమంతునికి శ్రీరాముని మీద
గల నిరుపమానమైన భక్తి.
హనుమంతుని భక్తికి ఇలాంటి తార్కానాలన్ని ఎన్నో ఎన్నోన్నో వున్నాయి.
హనుమాన్ జయంతి విశేష దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతున్ని
అర్చిస్తారు. కలౌ కపి వినాయకౌ: ....... అంటే కలియుగం లో త్వరగా
ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు ... వినాయకుడు, హనుమంతుడు.
హనుమంతుడు - అంజనా దేవి,
కేసరీల పుత్రుడు. వాయుదేవుని ఔరస
పుత్రుడు, మహా బాలుడు. శ్రీరామునికి దాస
దాసుడు, అర్జునికి సఖుడు,
ఎర్రని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు,
శతయోజన విస్తారమైన
సముద్రాన్ని దాటినా వాడు, లంకలో బందీయైన సీతమ్మ తల్లి
శోకాన్ని
హరించిన వాడు, ఔషధీ సమేతముగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన
యుద్ధంలో
వివశుడైన లక్ష్ముని ప్రాణాలు నిలిపిన వాడు. దశకంటుడు
అయిన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు
నిద్రించడానికి
ముందు, ప్రయాణానికి ముందు స్మరించిన వారికి మృత్యు
భయం లేకుండా వారికి
సర్వత్రా విజయం లభిస్తుంది
ఎక్కడైతే
రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. అలాగే
భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా
రోగాలు నయం అవుతాయి. శని గ్రహం అనుకూలంగా లేకపోతె వచ్చే బాధలూ తొలగిపోతాయి.
మంచి బుద్ధి కలుగుతుంది. బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం
వస్తుంది.
హనుమంతునికి 5 సంఖ్య చాల ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటి పళ్ళు , మామిడి పళ్ళు అంటే ఆయనకు ప్రీతి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
అలాగే చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు
గల మండలం రోజుల పాటు ప్రతిరోజూ 1, 3, 5, 11, లేదా 41 సార్లు హనుమాన్
చాలీసా పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు త్వరగా పూర్తి
అవుతాయి. కోరిన కోరికలు నెరవేరే అవకాశాలు వుంటాయి. సంతానం కోరేవారు మండలం
పాటు పారాయణ చేసి అరటిపండు నివేదించి ఆ పండును ప్రసాదం గా స్వీకరిస్తే
తప్పకుండ సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE
FACEBOOK PAGE
FACEBOOK GROUP :
YOUTUBE
PRINTEREST
TWITTER
INSTAGRAM
BLOG
WHATSAPP GROUP
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
HTTPS://CHAT.WHATSAPP.COM/CDRK2ZFOHGI1RQFGNRJTBF
HTTPS://CHAT.WHATSAPP.COM/B57SNQO4QZ7KI1EH7P2QI5
HTTPS://CHAT.WHATSAPP.COM/IYNMOI7TGW9FN6LLPK8UDX
HTTPS://CHAT.WHATSAPP.COM/GEMSHZZOZHB5ACUXTVW5JY
HTTPS://CHAT.WHATSAPP.COM/KDKVPAHTYUSCYAPVGSHGIV
HTTPS://CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371
No comments:
Post a Comment