Tuesday, 4 April 2017

రామాయణంలోని కొన్ని ప్రధాన సంఘటనలు - కాల గణన


చైత్ర శుక్ల నవమి రోజున పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడని అందరికీ తెలుసు.. కానీ ఆధునిక కాలమానం ప్రకారం రాముడు పుట్టిన తేదీ ఏమిటో తెలుసా?.. 11 ఫిబ్రవరి, 4433 క్రీ.పూ. ఆదివారం రోజున శ్రీరాముడు జన్మించారు.. అంటే మనం రాముని 6,448వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నమాట..
రామాయణం కేవలం పురాణగాథ, అభూతకల్పన మాత్రమే అని వాదిస్తారు నాస్తికులు.. శ్రీరాముని ఉనికితో ముడిపడి ఉన్న ప్రదేశాలు దేశమంతటా మనకు కనిపిస్తాయి.. పలు పరిశోధనల్లో రామాయణం వాస్తవ చరిత్ర అని తేలుతోంది.. ఈ నేపథ్యంలో DATE OF SRI RAMA అనే గ్రంథం ఆసక్తిని కలిగించింది. ప్రముఖ ఇంజినీర్ ఎన్.నర్సింగ్ రావు రాసిన ఈ పుస్తకంలో రామ జననంతో పాటు రామాయణంలో జరిగిన ముఖ్య ఘట్టాల తేదీలను ఆధునిక ఆంగ్ల కాలమానం ప్రకారం వెల్లడించారు.. వాల్మీకి రామాయణం, మన పంచాంగం, తిథి, వార, నక్షత్రాల ఆధారంగా ఈ కాల గణన చేశారు.. దీని ప్రకారం రామాయణంలోని కొన్ని ప్రధాన సంఘటనల తేదీలు ఇలా ఉన్నాయి..

11 ఫిబ్రవరి, 4433 బిసి ఆదివారం – అయోధ్యలో శ్రీరామ జననం
6 ఫిబ్రవరి, 4421 బిసి – యజ్ఞ రక్షణ కోసం విశ్వామిత్రునితో పయనం
20 ఫిబ్రవరి, 4421 బిసి – శివ ధనుర్భంగం
4 మార్చి, 4421 బిసి – సీతారామ కల్యాణం
16 ఫిబ్రవరి, 4409 బిసి – వనవాసానికి బయలు దేరిన సీతా రామ లక్ష్మణులు
21 ఫిబ్రవరి, 4409 బిసి – దశరథుని మరణం
22 ఫిబ్రవరి, 4409 బిసి – చిత్ర కూటంలో నివాసం
26 ఫిబ్రవరి, 4399 బిసి – పంచవటిలో నివాసం
20 డిసెంబర్, 4396 బిసి – రావణుడిచే సీతాపహరణ
13 జనవరి, 4395 బిసి – రామసేతు నిర్మాణం (5 రోజుల పాటు)
19 జనవరి, 4395 బిసి – లంకలో యుద్ధం ప్రారంభం
5 ఫిబ్రవరి, 4395 బిసి – రామ రావణ యుద్దం మొదలు, నాలుగో రోజున రావణ సంహారం
6 ఫిబ్రవరి, 4395 బిసి – విభీషణుని పట్టాభిషేకం
7 ఫిబ్రవరి, 4395 బిసి – లంక నుండి పుష్పక విమానంతో తిరుగు పయనం
8 ఫిబ్రవరి 4395 బిసి – అయోధ్యలో శ్రీరాముని పట్టాభిషేకం
వాల్మీకి రామాయణం శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది.. అంత వరకే కాల గణన చేశారు..

No comments:

Post a Comment