Sunday 9 April 2017

చైత్ర పౌర్ణమి




చిత్తా నక్షత్రం లో చంద్రుడు సంచరించునపుడు వచ్చే పౌర్ణమి చైత్ర పౌర్ణమి. మధు మాధవములు గా పిలువబడు వసంత మాసములలో వచ్చే మొదటి పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి. నూతన సంవత్సరం ఆరంభమైన పక్షం రోజులకి వచ్చే పౌర్ణమి ఈ చైత్ర పౌర్ణమి. ఈ విధంగా అనీక రీతుల మనం ఈ పౌర్ణమి గురుంచి చెప్పుకోవచ్చు.
అయితే, సనాతన భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతీ పౌర్ణమి ఒక సందేశాన్ని ఇస్తుంది . గడిచిన కాలం లో (గత పక్షం రోజులలో) జరిగిన పనులు , దాని ఫలితం, (Reconciliation) రాబోయే పౌర్ణమి వరకు జరగవలసిన పనులు, (A kind of Plan) దానికి ప్రయత్నం ఇలా అనేక సందేశాలు పౌర్ణమి వల్లనే తెలుస్తుంది. భౌతిక , ప్రాపంచిక విషయ వివేకం (Materialistic intensities) కన్నా, ఆధ్యాత్మిక చైతన్యం (Spiritual Insights) ఎక్కువగా ప్రభావం చూపే రోజు పౌర్ణమి. అందుకే మన శాస్త్రాల్లో పౌర్ణమికి ఒక విశేషమైన స్థానం వున్నట్టు తెలుస్తుంది. పౌర్ణమి నాడు మనం చేసే పూజలు, ఉపాసనలు, దీక్షలు, అధ్యయనాలు, అభ్యాసనలు వచ్చే తరానికి, వారి ఉన్నతికి దోహద పడతాయి. అమావాస్య నాడు చేసేవి గతించిన పితరలకు చెందుతాయి.
ముఖ్యంగా ఈ చైత్ర పౌర్ణమి వలన ఒక అద్భుతమైన ప్రక్రియ మానవ శరీరం లో జరుగుతుంది. అదే అంకురారోపణం. మానవ శరీరానికి, ప్రకృతి లో ఋతువులకు ఒక చక్కని సంబంధం ఉన్నది. అది బయట వేడిని బట్టి మన శరీరం తన వేడిని సమతుల్యం చేస్తుంది (Equilibrium between Internal and External bodies) ఇక్కడ అనేక శరీరాలు అని అర్ధం కాదు, మన శరీరమే అనేక రీతుల వ్యవహరిస్తుంది అని అర్ధం.
దీనిని కొంచం సామాన్యం గా ఆలోచిద్దాం , మన పెద్దలు “పోలికలు” రావడం అంటారు కదా !! అది ఇక్కడి నుండే మొదలవుతుంది. అమావాస్య నాడు పితరలకు చేసే తర్పణాలు వారికి చెంది ఆ వంశం లో ఇంకో “అంకురం” కోసం కృషి చేసి, వారి అంశని ఆ రక్తాన్ని మోస్తున్న ఆ వంశపు పురుషుని భ్ర్రూమధ్య స్థానాన నింపుతారు. అదే కొన్ని రోజులకి (సుమారుగా ఒక పక్షం రోజులకి) ఆ పురుషని లో వంశాభివృద్ధికి కారణమయ్యే వీర్య కణం గా మారి దోహదపడుతుంది. ఇది ఏ శాస్త్రవేత్త కాదనలేని అక్షరసత్యం. దీనిని జ్యోతిష్య శాస్త్రం అమావాస్య నాడు మొదలయ్యి పౌర్ణమి తో పూర్తీ అయ్యే “శుక్ల” పక్షంగా చెప్తారు. మానవులలో ఈ ప్రక్రియ ఈ మాసానే మొదలవుతుంది అని ఎక్కడా లేదు, కానీ ఈ విధానం సృష్టి లో మాత్రం ఈ మాసంతోనే జరుగుతుంది. ఆకురాలుకాలం అయ్యాకా చిగురులు వస్తాయి అనడం అంటే ఇదే!!. ఈ పరిణామాన్ని మానవులకి ఆపాదించుకుంటే ???
మానవ శరీరం ఒక రధం, దాని కర్తవ్యం ఒక పయనం, ఒక గమనం, పరిపూర్ణ తత్వాన్ని ఆవిష్కరిస్తే అది ఒక మహా యజ్ఞం.

No comments:

Post a Comment