Thursday 16 June 2016

తొమ్మిదవ 'అంకె' గోప్పదనo...!!

తొమ్మిదవ 'అంకె' గోప్పనo...!!


సంఖ్యా శాస్త్రంలో తొమ్మిదవ అంకెను 'బ్రహ్మసంఖ్య' అంటారు.
దైవసంఖ్య; వృద్ధిసంఖ్య అని కూడా అంటారు.
పురాణ సంఖ్య అని కూడా పేరు ఉంది.
మరి ఈ తొమ్మిదవ సంఖ్య గోప్పదనమేమిటో తెలుసుకుందామా!!
మీరు ఏదైనా మీ ఇష్టం వచ్చిన సంఖ్యను తీసుకొని ఆ సంఖ్యను
తొమ్మిది చేత హేచ్చించండి. హెచ్చించిన ఫలితాన్ని మొత్తం కలిపి ఏ
సంఖ్యను చేయండి, తొమ్మిదే వస్తుంది.
123456789*9 = 1111111101 మొత్తం అంకెలను కలిపి చూడండి
తొమ్మిది అవుతుంది.
ఈ విధంగా ఎంత చిన్న, ఎంత పెద్ద సంఖ్యనైనా తొమ్మిది చేత హెచ్చించి
చూడండి..
ఇలాగే తొమ్మిదవ ఎక్కన్ని కూడా పరీక్షించండి. శేషాలను కలిపి చూడండి..
తొమ్మిదే వస్తుంది.
కృతయుగం - 17,28,000; త్రేతాయుగం - 12,96,000; ద్వాపరయుగం
- 8,64,000. ఏ యుగపు సంవత్సరాలు కలిపినా తొమ్మిదే వస్తుంది.
ఇది తొమ్మిదవ అంకెకు మాత్రమే ఉన్న ప్రత్యేకత!
సున్నా తీసివేస్తే మనకున్న అంకెలు మొత్తం తొమ్మిదేగదా!
మహామా హేతిహాసమని పేరుపొందిన మహాభారతం మొత్తం తొమ్మిదవ
సంఖ్యతో ముడి పడిఉంది అండి.. మహాభారతంలోని పర్వాలు 18, మహాభారత
యుద్ధ దినాలు 18, మహాభారత సైన్యం 18 అక్షహిణులు. బగవద్గీత
అద్యాయలు 18. (ఒకటి ఎనిమిది కిలిపితే తొమ్మిది అవుతుంది కదా!)
భగవాన్ వ్యాసమహర్షి రచించిన పురాణాలు కూడా 18.
ఒకటి నుండి తొమ్మిది వరకు మొత్తం అంకెలు కూడితే 'తొమ్మిది' వస్తుంది.
1+2+3+4+5+6+7+8+9 = 81, 8+1 = 9
మనిషి శరీరానికి ఉన్న రంధ్రాలు కూడా 'తొమ్మిది'. సర్పానికి తప్ప
సృష్టిలోని ప్రతి ప్రాణికి తొమ్మిది రంధ్రాలు ఉండవలసిందెనట.
గంటకు 3,600 సెకండ్లు - 3+6+0+0 = 9
రోజుకి 1,440 నిముషాలు - 1+4+4+0 = 9
నెలలు 720 గంటలు - 7+2+0 = 9
సంవత్సరానికి 360 రోజులు - 3+6+0 = 9
60 సంవత్సరాలకు 720 నెలలు - 7+2+0 = 9
తొమ్మిదిని మృత్యుంజయ సంఖ్యగా భావిస్తారు.
బిడ్డ తల్లి గర్భంలో ఉండేది 270 రోజులు. 2+7+0 = 9.
మరి ఇన్ని కారణాలు ఉన్న తొమ్మిది గొప్పదే కదా!

No comments:

Post a Comment