Sunday 26 June 2016

రుక్మిణీ కళ్యాణాన్ని విన్నంత మాత్రం చేత కన్యకామణులందరికీ శుభం కలుగుతుంది.

రుక్మిణీ కళ్యాణాన్ని విన్నంత మాత్రం చేత కన్యకామణులందరికీ శుభం కలుగుతుంది.


రుక్మిణీ కళ్యాణాన్ని పెళ్ళి కాని పిల్లలు కనుక వింటే,అల్పాయుర్దాయము కలవాడు, అన్యోన్య దాంపత్యం జరగనివాడు,ఆడపిల్లని హింసపెట్టేవాడు,ఆమె మనసు బాధ పడటానికి కారణం అయినవాడు భర్తగా రావాలి అని రాసిపెట్టి ఉంటే,ఆ నొసటి రాత తొలగుతుంది అని సంప్రదాయజ్ఞులు వ్యాఖ్యానం చేస్తారు.
అంత గొప్పది రుక్మిణీ కళ్యాణం.అందుకే ఆడపిల్లలకి రుక్మిణీ కళ్యాణం చేయించకుండా పెళ్ళి ప్రయత్నం చెయ్యరు.అటువంటి రుక్మిణీ కళ్యాణం లో ఆ లేఖ,ఆ పద్యాలు విన్నంత మాత్రం చేత కన్యకామణులందరికీ శుభం కలుగుతుంది.తప్పకుండా పెళ్ళి ఈడు వచ్చిన ఆడపిల్లలందరికి రుక్మిణీ కళ్యాణాన్ని,దాని గొప్పతనాన్ని వర్ణించి పారయణం చేయించాలి.పెళ్ళైపొయినవారికి అక్కర్లేదా అండి అని అడిగితే పెళ్ళి అయిపొయిన వారు వింటే వారికి కృష్ణానుగ్రహం కలుగుతుంది.

No comments:

Post a Comment